అన్వేషించండి

Donald Trump Statement on Gun Fire: కాల్పులతో ఇరాన్‌కు లింకులను కొట్టిపారేసిన ట్రంప్.. నిందితుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్

White House dinner shooting | వైట్ హౌస్ డిన్నర్ కాల్పుల ఘటనలో ఎలాంటి అంతర్జాతీయ కుట్ర లేదని, ఇది ఒక వ్యక్తి చేసిన పనిగానే కనిపిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.

వాషింగ్టన్: వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా జరిగిన కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  పలు కీలక విషయాలు తెలిపారు. ఈ దాడికి ఎలాంటి అంతర్జాతీయ కుట్రతో సంబంధం ఉన్నట్లు కనిపించడం లేదని, ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన పని అయి ఉంటుందని పేర్కొన్నారు. ఈ దాడికి ఇరాన్‌తో నడుస్తున్న ఉద్రిక్తతలకు ఏమైనా సంబంధం ఉందా అని ట్రంప్‌ను ప్రశ్నించగా, అలా ఏమీ లేదన్నారు. దర్యాప్తు తర్వాత పూర్తి విషయాలు బయటకు వస్తాయని, అయితే ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం దాడి చేసిన వ్యక్తి ఒంటరిగానే ఇందుకు పాల్పడినట్లు తెలిపారు. 

నిందితుడు పలు ఆయుధాలతో మొదట సెక్యూరిటీ చెక్‌పాయింట్‌పై దాడి చేయడానికి ప్రయత్నించాడు. అయితే సీక్రెట్ సర్వీస్, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం వేగంగా స్పందించి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారని ట్రంప్ ప్రెస్ బ్రిఫింగ్‌లో తెలిపారు. భద్రతా దళాల వేగాన్ని, ధైర్యసాహసాలను అభినందించారు. వారి వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని భద్రతా సిబ్బందిని కొనియాడారు. ఈ ఘటనలో ఒక అధికారికి తూటా తగిలి గాయమైందని, అయితే ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ట్రంప్ తెలిపారు. నిందితుడు కాలిఫోర్నియా నివాసి అని వెల్లడించారు. నిందితుడి టాలెంట్, బ్యాగ్రౌండ్ తెలుసుకుని అంతా ఆశ్చర్యపోతున్నారు.


Donald Trump Statement on Gun Fire: కాల్పులతో ఇరాన్‌కు లింకులను కొట్టిపారేసిన ట్రంప్.. నిందితుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్

నిందితుడు టాలెంటెడ్ పర్సన్.. బెస్ట్ టీచర్
వైట్ హౌస్ కరస్పాండెంట్స్‌ డిన్నర్‌లో కాల్పులకు పాల్పడిన నిందితుడిని కాలిఫోర్నియాకు చెందిన 31 ఏళ్ల కోలో టామోస్‌ అలెన్‌గా దర్యాప్తు బృందాలు గుర్తించాయి. నిందితుడు అత్యంత విద్యావంతుడు కావడంతో పాటు బెస్ట్ టీచర్ అవార్డు గెలుచుకున్న వ్యక్తి కావడం విశేషం. కోలో టామోస్ కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌, కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్శిటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ సైతం పూర్తి చేశాడు. 

ఎమర్జెన్సీ బ్రేక్స్ రూపొందించి సంచలనం.. 
గతంలో నాసా ఫెలోషిప్‌లో పాల్గొన్న అలెన్, విద్యార్థిగా ఉన్న సమయంలోనే వీల్‌ఛైర్లకు ఎమర్జెన్సీ బ్రేక్‌ను రూపొందించి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం ఒక విద్యా సంస్థలో టీచర్‌గా పనిచేస్తున్న అలెన్, 2024 డిసెంబర్‌లో టీచర్ ఆఫ్ ది మంత్ గా కూడా ఎంపికయ్యాడు. ఇతడు డెమోక్రటిక్ పార్టీ సానుభూతిపరుడు. అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ ప్రచారానికి విరాళం కూడా ఇచ్చాడని రికార్డులు చెబుతున్నాయి. ఒక మేధావిగా, మంచి టీచర్‌గా గుర్తింపు పొందిన వ్యక్తి ఇలాంటి దాడికి ఎందుకు పాల్పడ్డాడనే కోణంలో సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతటి నేపథ్యం ఉన్న వ్యక్తి హింసాత్మక మార్గాన్ని ఎంచుకోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

ఇండోర్ ఈవెంట్స్ విషయంలో ఆలోచన మార్చుకోవాలా? 
ఈ ఘటన తర్వాత ఇండోర్ ఈవెంట్స్ విషయంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందా అని ట్రంప్‌ను అడగ్గా.. అలా చేయలేనని ఖచ్చితంగా చెప్పారు. కార్యక్రమం జరుగుతున్న రూమ్ చాలా సురక్షితంగా ఉందని అన్నారు. దాడి చేసిన వ్యక్తి తనను లక్ష్యంగా చేసుకున్నాడా అని ప్రశ్నించినప్పుడు, తాను కూడా దాడికి గురయ్యే అవకాశం ఉందన్నారు.

ఈ ఘటన తర్వాత దేశ ప్రజలు శాంతిని పాటించాలని డొనాల్డ్ ట్రంప్ విజ్ఞప్తి చేశారు. విభేదాలను హింసతో కాకుండా శాంతియుత మార్గాల్లో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా పలు దేశాల అధినేతలు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. పారదర్శకత కోసం తాను ఒక వీడియోను విడుదల చేయాలని ఆదేశించానని, అందులో దాడి చేసిన వ్యక్తి చర్యలు, భద్రతా సంస్థల రియాక్షన్ కనిపిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఈ కాల్పుల ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రాథమిక సమాచారం ఆధారంగా డెమొక్రాటిక్ పార్టీ సానుభూతిపరుడిగా ఉన్న ఒక టాలెంటెడ్ టీచర్ ఈ కాల్పులు జరిపాడని.. ఇందులో కుట్రకోణంపై దర్యాప్తు చేపట్టారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Donald Trump Assassination Attempt:టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Embed widget