Donald Trump Tarriffs: ఆసియా దేశాలు ఏకమైతే అమెరికా ఏం చేస్తుంది, భారత్- చైనాలను ట్రంప్ ఎదుర్కోగలరా?
Trmup Tarrifs India | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసియా దేశాలపై అధిక సుంకాలు విధించారు. రష్యా, చైనా, భారత్ దేశాలు కలిసి అమెరికాకు వ్యతిరేకంగా పనిచేస్తే ట్రంప్ పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది.

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న పలు దేశాలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ తలతిక్క టారిఫ్‌లు ప్రతికూల ప్రభాం చూపుతున్నాయి. ఆగస్టు 7 నుంచి డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలు అమలులోకి వచ్చాయి. ఈ సుంకాలు వివిధ దేశాలపై 10 శాతం నుండి 50 శాతం వరకు ఉన్నాయి. ట్రంప్ ప్రస్తుతం భారతదేశంపై 50 శాతం సుంకం విధించారు. అయితే అమలులోకి వచ్చింది 25 శాతం. మిగతా ఇరవై ఐదు శాతం వచ్చే నెలాఖరు నుంచి అమల్లోకి రానుంది.
ఆగస్టు 27 నుంచి 25 శాతం సుంకాలు అమలు
భారతదేశం, రష్యా మధ్య స్నేహం కొనసాగడం... రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేయడంతో అదనపు సుంకం ఆగస్టు 27 నుండి అమలులోకి వస్తుంది. ఈ పరిస్థితిలో అమెరికా టారిఫ్ లకు వ్యతిరేకంగా భారతదేశం ఎలాంటి చర్యలు చేపడుతుందని ఆసక్తి నెలకొంది. భారతదేశం అమెరికన్ డాలర్లతో రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తుందని, దీని కారణంగా రష్యా ఆయుధాల కోసం నిధులు పొందుతుందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అమెరికాకు వ్యతిరేకంగా ఆసియా దేశాలన్నీ ఏకం అయితే డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి ఏంటన్నది ఇక్కడ పరిశీలిద్దాం.
ట్రంప్ సుంకాల్లో ప్రత్యేకతలు ఏమిటి
డొనాల్డ్ ట్రంప్ సుంకాల్లో ఆసియాలోని పెద్ద దేశాలపై అధిక సుంకాలు విధించారు. ముఖ్యంగా బ్రిక్స్ సభ్య దేశాలైన భారత్, రష్యా, చైనాలపై అమెరికా ఎక్కువ పన్నులు వేసింది. తరువాత భారత నేషనల్ సెక్యూరిటీ సలహాదారు అజిత్ దోవల్ మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిశారు. భారత ప్రధాని మోదీ త్వరలో చైనా పర్యటనకు వెళ్లనున్నారు. మరోవైపు పుతిన్, ప్రధాని మోదీల మధ్య టెలిఫోన్ సంభాషణ, అదే సమయంలో బ్రెజిల్ అధ్యక్షుడు లులా డి సిల్వా సైతం భారత ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. ఈ అన్ని విషయాలలో కామన్ పాయింట్ ఏమిటంటే బ్రెజిల్, భారతదేశం, రష్యా, చైనా. ఈ నాలుగు దేశాలు బ్రిక్స్ వ్యవస్థాపకులు. అమెరికా డాలర్ కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ దేశాలు ఎదుగుతున్నాయని ట్రంప్ ఏడుపు. ట్రంప్ టారిఫ్ వార్ వ్యతిరేకించి బ్రిక్స్ దేశాలు తిరుగుబాటు చేస్తే అమెరికా అధ్యక్షుడు వెనక్కి తగ్గుతారా అనేది చర్చకు వస్తోంది.
అమెరికాకు సమాధానం చెప్పడానికి బ్రిక్స్ సిద్ధమా?
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, బ్రిక్స్ దేశాలన్నీ కలిసి ఒక పెద్ద ప్రకటన చేయాలని చూస్తున్నాయి. ఇది అమెరికాకు షాక్ ఇచ్చే నిర్ణయం అవుతుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రతిరోజూ చేస్తున్న టారిఫ్ వార్.. యుద్ధాలు ఆపుతున్న నేతగా చేసుకుంటున్న ప్రచారానికి అడ్డుకట్ట పడుతుంది. బ్రిక్స్ దేశాలు ప్రపంచ GDPలో దాదాపు 35.6 శాతం వాటా కలిగి ఉన్నాయి. దాంతో ఇప్పుడు ఆసియా దేశాలు ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా ఏకం కావడానికి ప్రయత్నిస్తున్నాయి.
ఆసియా దేశాలు ఏకం అయితే ట్రంప్ పరిస్థితి ఏమిటి?
బ్రిక్స్ కూటమిలో చాలా కొత్త దేశాలు చేరాయి. చాలా దేశాలు చైనాకు దగ్గరగా ఉన్నాయి. వీటిలో చాలా దేశాలతో భారతదేశానికి స్నేహం ఉంది. చైనా అధికారిక గ్లోబల్ టైమ్స్ కూడా భారతదేశం గురించి తన స్వరాన్ని తగ్గించింది. అమెరికాకు వ్యతిరేకంగా భారతదేశానికి మద్దతుగా చైనా మీడియా మాట్లాడుతోంది. బ్రిక్స్ దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా వెళితే, వారు అదనంగా 10 శాతం సుంకాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని ట్రంప్ అన్నారు. ఇది అన్యాయమని భారతదేశం పేర్కొంది. రష్యాతో సంబంధాలు తమ నమ్మకంపై ఆధారపడి ఉన్నాయని స్పష్టం చేసింది. ఆ పరిస్థితిలో, బ్రిక్స్ దేశాలు నిజంగా ఏకం కాబోతున్నాయా, వారు కలిసి అమెరికాకు ఝలక్ ఇస్తే ట్రంప్ నిజంగానే వెనక్కి తగ్గుతారా లేక బ్రిక్స్ కూటమి కోసం ట్రంప్ కొత్త ప్లాన్ అమలు చేస్తారా అనే ప్రశ్న తలెత్తుతుంది.






















