Trump offer: వెనిజులా అధ్యక్షుడ్ని పట్టిస్తే 800 కోట్లు - ట్రంప్ ఆఫర్ - కామెడీ కాదు సీరియస్సే !
Venezuela president: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను డ్రగ్ ట్రాఫికింగ్ ఆరోపణలపై "వాంటెడ్"గా ప్రకటించారు ట్రంప్. పట్టిచ్చిన వారికి రూ.400 కోట్లు బహుమతి కూడా ఇస్తారట.

Venezuela president Vs Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను డ్రగ్ ట్రాఫికింగ్ ఆరోపణలపై "వాంటెడ్"గా ప్రకటించారు. అతన్ని పట్టుకొని అమెరికాకు తీసుకువచ్చిన వారికి 50 మిలియన్ డాలర్లు (సుమారు రూ.800 కోట్లు) బహుమతి ఇస్తామని ప్రకటించారు.
The illegitimate President & de facto Dictator of Venezuela, Nicolás Maduro, has just had his DOJ Rewards for Justice reward doubled to $50 million dollars for information leading to his arrest/capture announced by US Attorney General Pamela Bondi.
— Pernicious Propaganda (@natsecboogie) August 7, 2025
pic.twitter.com/GKvkeW0yd3
ట్రంప్ ప్రభుత్వం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను "కార్టెల్ డెల్ సోల్" (Cartel del Sol) అనే డ్రగ్ ట్రాఫికింగ్ సంస్థ నాయకుడిగా పేర్కొంది. అతన్ని అమెరికాకు తీసుకువచ్చిన వారికి 50 మిలియన్ డాలర్లు హుమతి ఇస్తామని అమెరికా న్యాయ శాఖ ప్రకటించింది. దక్షిణ అమెరికాలో అతిపెద్ద డ్రగ్ ట్రాఫికర్లలో ఒకడిగా మదురోను ట్రంప్ అనుమానిస్తున్నారు. అతను నడిపే కార్టెల్ అమెరికాకు మాదక ద్రవ్యాల సరఫరా చేస్తుందని ఆరోపణలు ఉన్నాయి.
Please help spread this great news to all Venezuelans using every possible means, as there is no access to X in Venezuela. $50 MILLION reward for the narco-dictator Nicolás Maduro pic.twitter.com/xjK0YMilqr
— VeneRealidades (@venerealidades) August 8, 2025
ట్రంప్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ కార్టెల్ డెల్ సోల్‌ను "స్పెషలీ డెసిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్"గా పేర్కొంది. ట్రంప్ కార్టెల్‌లను టెర్రరిస్ట్ సంస్థలుగా గుర్తించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు, ఇందులో మదురో కార్టెల్ కూడా ఉంది అమెరికా రక్షణ శాఖ డ్రగ్ కార్టెల్‌లను లక్ష్యంగా చేసుకోవడానికి స్పెషల్ ఫోర్సెస్‌ను ఉపయోగించడానికి ట్రంప్ అధికారం ఇచ్చారు. వెనిజులా దీర్ఘకాలంగా ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో ఉంది. మదురో నాయకత్వంలో దేశం అత్యధిక ద్రవ్యోల్బణం, పేదరికం, అక్రమ కార్యకలాపాలతో సతమతమవుతోంది.
$50M bounty on a President
— The Chronology (@TheChronology__) August 8, 2025
US has doubled its reward for information leading to the arrest of Venezuelan President Nicolás Maduro, raising it to $50 million amid accusations of his involvement in drug trafficking and ties with criminal organizations like Tren de Aragua and the… pic.twitter.com/gS70P42SS8
ట్రంప్ తన మొదటి టర్మ్‌లో కూడా మదురో ప్రభుత్వంపై ఆంక్షలు విధించారు. 2020లో అమెరికా న్యాయసాఖ మదురోపై 15 మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించింది. ఇప్పుడు దాన్ని 50 మిలియన్ డాలర్లకు పెంచారు. కొందరు ఈ చర్యను వెనిజులా రాజకీయాల్లో అమెరికా జోక్యంగా భావిస్తున్నారు. మదురో ప్రభుత్వాన్ని బలహీనపరచడానికి ట్రంప్ వ్యూహంగా చూస్తున్నారు.





















