Covid 19 Cases China: చైనాలో మళ్లీ కరోనా గుబులు, భారీగా పెరిగిన కేసులు- కొత్త సబ్ వేరియంట్ డేంజర్
చైనాలో 2 ఏళ్ల తర్వాత మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కొత్తగా 13 వేల కేసులు నమోదయ్యాయి.
చైనాలో కరోనా వైరస్ మళ్లీ భయపెడుతోంది. కొత్తగా 13,146 కరోనా కేసులు నమోదయ్యాయి. 2 ఏళ్ల క్రితం చైనాలో కరోనా ఫస్ట్ వేవ్ పీక్ స్టేజ్‌లో ఉన్న తర్వాత ఇవే అత్యధిక కేసులు. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ వేరియంట్ కారణంగానే కేసులు పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే చైనాలోని 12కు పైగా రాష్ట్రాల్లోకి ఒమిక్రాన్ వ్యాపించింది.
కొత్తగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కేసును చైనాలో గుర్తించినట్లు అక్కడి మీడియాలో వార్తలు వస్తున్నాయి.
చర్యలు
షాంఘై నగరంలోని మొత్తం 2.5 కోట్ల మందిని లాక్‌డౌన్‌లో ఉంచింది చైనా ప్రభుత్వం. ఈ ఒక్క ప్రాంతంలోనే కొత్తగా 8,200 కరోనా కేసులు నమోదయ్యాయి. చైనాలోని మొత్తం కేసుల్లో ఇది 75 శాతం. అధిక జనసాంద్రతతో పాటు ప్రపంచంలో అత్యంత రద్దీ ఉండే ప్రాంతాల్లో షాంఘై ఒకటి. అలాంటి నగరం ఇప్పుడు మూగబోయింది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి.
Behold… the abandoned streets of the most populace city on Earth, Shanghai, in the strictest pandemic lockdown the world has ever seen. Normally these streets are shoulder-to-shoulder crowded. Eeerie. pic.twitter.com/HGdvK6NLOD
— Eric Feigl-Ding (@DrEricDing) April 1, 2022
కఠిన లాక్‌డౌన్‌తో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. నిత్యావసరాలు, ఆస్పత్రి సేవలు సకాలంలో దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నిరసనల గళం వీలైన రీతిలో వినిపిస్తున్నారు. రోబోలతో వీధుల వెంట కరోనా జాగ్రత్తలు చెప్పిస్తున్నారు.
Also Read: Swiggy Delivery Boy: వీడియో - లవర్స్ మధ్య ఫైట్, వారి మధ్యలోకి దూరి యువతిని చితకబాదిన ‘స్విగ్గి’ బాయ్