(Source: Poll of Polls)
China Covid-19: చైనాను వణికిస్తున్న కరోనా మహమ్మారి, రీ లాక్‌డౌన్ విధించాక అక్కడ తొలి కరోనా మరణం
Covid-19 Deaths In China: కరోనా ఫోర్త్ వేవ్ ముప్పు పొంచిఉన్న నేపథ్యంలో చైనాలో పలు నగరాల్లో లాక్ డౌన్ విధించారు. కానీ షాంఘై నగరంలో తొలి కరోనా మరణం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
China Covid-19 Deaths: కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. పలు దేశాలు ఈ మమహమ్మారిని నియంత్రించేందుకు వ్యాక్సినేషన్ వేగవంతం చేస్తున్నాయి. అయితే కరోనా కేసులు తగ్గడంతో పలు దేశాలు కొవిడ్19 నిబంధనల్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడం ఫోర్త్ వేవ్‌కు కారణం అవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా చైనాలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా వ్యాప్తి అధికం కావడంతో చైనాలో పలు నగరాలలో లాక్‌డౌన్ విధించారు. ఇటీవల లాక్‌డౌన్ విధించిన తరువాత చైనాలోని షాంఘై (Shanghai reports first Covid deaths since the start of lockdown)లో తొలి కరోనా మరణం నమోదైంది.
షాంఘై నగరంలో కరోనా మరణం నమోదైందని నగర అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది. షాంఘైలో ఆదివారం నాడు ముగ్గురు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇటీవల లాక్‌డౌన్ మళ్లీ విధించిన తరువాత తొలి కరోనా మరణాలు ఇవేనని షాంఘై హెల్త్ కమిషన్ స్పష్టం చేసింది.
China's Shanghai reports first Covid deaths since the start of lockdown, as per city govt: AFP
— ANI (@ANI) April 18, 2022
వారికి దీర్ఘకాలిక అనారోగ్యం..
చనిపోయిన వారి వయసు 89, 91 అని.. వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నాయని షాంఘై అధికారులు వెల్లడించారు. జిలిన్ ఈశాన్య ప్రావిన్స్‌లో మార్చి నెలలో కరోనాతో ఇద్దరు వ్యక్తులు చనిపోయాక.. కరోనా మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఏడాది తరువాత జిలిన్‌లో గత నెలలో మళ్లీ కరోనా మరణాలు మొదలయ్యాయి. ఒమిక్రాన్, డెల్టా వేరియంట్, డెల్టాక్రాన్ లాంటి ప్రమాదకర వేరియంట్ల భయంతో చైనాలో పలు నగరాలు లాక్‌డౌన్ విధించాయి. కొవిడ్19 నిబంధనల్ని కఠినతరం చేశాయి.
చైనాలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నగరాలలో షాంఘై ఒకటి. కొవిడ్19 వ్యాప్తిని నియంత్రించేందుకు కరోనా సోకిన వ్యక్తులను గుర్తిస్తే.. ఆ ఏరియాలలో నిబంధనలు కఠినతరం చేస్తోంది ప్రభుత్వం. ప్రైమరీ, కాంటాక్ట్స్ ఉన్న వారికి వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కమ్యూనిటీ లెవల్ వ్యాప్తి జరగకుండా చూసేందుకు అధికారులు పలు నగరాలు, పట్టణాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నారు. షాంఘైలో ఇప్పటివరకూ 3,20,000 మంది కరోనా బారిన పడ్డారు. జీరో కొవిడ్ స్టేటస్‌కు రావాలని స్థానిక అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Konaseema Road Accident : కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు మృతి