Nandyala Road Accident: నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం, స్కార్పియో వాహనం కల్వర్టును ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం
Road Accident In Nandyala: వేగంగా వెళ్తున్న స్కార్పియో వాహనం కల్వర్టును ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
![Nandyala Road Accident: నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం, స్కార్పియో వాహనం కల్వర్టును ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం Nandyala Road Accident: Three dies in a Road Accident In Nandyala District Nandyala Road Accident: నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం, స్కార్పియో వాహనం కల్వర్టును ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/13/46241ab29f05d0c0d8931c1df5dbfffe_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Three Dies In Nandyala Road Accident: నంద్యాల జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై స్కార్పియో వాహనం కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం ఆళ్లగడ్డ మండలం గూబగుండం మెట్ట దగ్గర జరిగింది. క్షతగాత్రులలో ఇద్దరికి సీరియస్ గా ఉండగా మరొకరికి స్వల్ప గాయాలు కావడంతో వారిని నంద్యాల ఆసుపత్రికి తరలింపు తరలించారు. మృతులు కడప జిల్లా మైదుకూరుకు చెందిన హోటల్ నిర్వాహకులు వెంకటేశ్వర్లు, సామ్రాజ్యం, విజయలక్ష్మిగా గుర్తించారు.
దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా విషాదం..
కడప జిల్లా మైదుకూరుకు చెందిన వెంకటేశ్వర్లు, సామ్రాజ్యం, విజయలక్ష్మిలు తమ కుటుంబంతో కలిసి బేతంచెర్ల మండలం మద్దిలేటయ్య స్వామి దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం స్వస్థం మైదుకూరుకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న స్కార్పియో ఒక్కసారిగా హైవే పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. దీంతో వాహనం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
స్కార్పియోలో ఇరుకున్న వారిని బయటకు తీసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడమే ప్రమాదానికి కారణమై ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు, అతడి భార్య లక్ష్మి దేవి, అక్క సామ్రాజ్యం అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. వాహనంలో ప్రయాణిస్తున్న డ్రైవర్ శ్రీనివాసులు, నాగమణి, మౌనికలు తీవ్రంగా గాయపడ్డారు.
Also Read: Konaseema Road Accident : కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు మృతి
Also Read: Palnadu Crime : పెళ్లి చేసుకోమన్నందుకు యువతి గొంతు కోసేశాడు, 36 గంటల్లో నిందితుడు అరెస్టు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)