By: ABP Desam | Updated at : 07 Sep 2023 09:16 PM (IST)
Edited By: Pavan
న్యూయార్క్‌లో 19 శాతం పెరిగిన కార్ల దొంగతనాలు, కారణమేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ( Image Source : Freepik )
Car Theft Case: సోషల్ మీడియా వాడకం ఈమధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయింది. రీల్స్, షార్ట్స్, టిక్ టాక్ వీడియోలు అంటూ చిన్న పిల్లల నుంచి యువత వరకు చాలా మంది సోషల్ మీడియాలోనే రోజంతా గడిపేస్తున్నారు. రకరకాల పాటలు, మ్యూజిక్ బీట్ లు, బీజీఎం, ట్రెండ్ అవుతున్న ట్యూన్స్ కు డ్యాన్సులు చేయడం, డైలాగులు చెప్పడం, ముఖకవళికలతో భావాలు పలికించడం లాంటి వీడియోలు తీస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి లైకులు లెక్కపెట్టుకుంటోంది యువత.
సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక సాంగ్, ఇతర అంశమో హైలెట్ అయి అది కొన్ని రోజుల పాటు ట్రెండ్ అవుతుంది. మిగతా వారంతా ఆ ట్రెండ్ ఫాలో అవుతూ వారు కూడా వీడియోలు చేస్తూ ఉంటారు. ఒకరిని చూసి మరొకరు చేస్తూ పోతుంటారు. అలాగే కొందరు ఛాలెంజ్ లు కూడా విసురుకుంటూ సోషల్ మీడియాలో ఆయా వీడియోలు పోస్టు చేస్తుంటారు. అలాంటి ఓ సోషల్ మీడియా ట్రెండ్ ఇప్పుడు అమెరికాకు సమస్యగా మారింది. ఒక సోషల్ మీడియా ట్రెండ్ అమెరికా లాంటి దేశానికి సమస్యను తెచ్చిపెట్టడం ఏమిటా అని ఆలోచిస్తున్నారా..
అమెరికాలోని అనేక ప్రాంతాల్లో కార్ల దొంగతనాలు ఒక ప్రధాన సమస్యగా మారాయి. చాలా ప్రాంతాల్లో ఎన్నడూ లేనంతగా.. కార్లు దొంగతనానికి గురవుతున్నాయి. న్యూయార్క్ నగరంలో కార్ల దొంగతనాలు ఏకంగా 19 శాతానికి పైగా పెరిగినట్లు పోలీసు అధికారులు చెబుతున్నాయి. దొంగతనాల కేసులు పెరగడం అటు పౌరులను, ఇటు పోలీసులను ఆందోళనకు గురిచేస్తోంది. సాధారణంగా కార్ల దొంగతనాలు అంటే.. ఆర్థిక సంబంధితమైనవే ఉంటాయి. అయితే తాజాగా జరుగుతున్న దొంగతనాల వెనక కారణం మాత్రం ఆశ్చర్యకరంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
అమెరికాలోని టిక్ టాక్ లో ఓ ఛాలెంజ్ ట్రెండ్ అవుతోంది. ఆ ఛాలెంజ్ ను స్వీకరించిన వారు సదరు పనిని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే తలనొప్పిగా మారింది. ఆ ఛాలెంజ్ ఏమిటంటే.. కార్లను దొంగలించడం. కార్లను దొంగలించి ఆయా కార్లలో జాయ్ రైడ్ చేయడమే ఛాలెంజ్. ఈ వైరల్ టిక్‌టాక్ ఛాలెంజ్ లో కియా, హ్యుందాయ్ కార్లను దొంగలించి.. వాటిలో ఏంచక్కా జాయ్ రైడ్‌లు చేస్తున్నారు యువతీ యువకులు. ఈ ఛాలెంజ్ వల్లే ఒక్క న్యూయార్క్ నగరంలోనే ఏకంగా 19 శాతం కార్ల దొంగతనాలు పెరిగినట్లు స్థానిక పోలీసు కమిషనర్ ఎడ్వర్డ్ కాబన్ చెప్పుకొచ్చారు.
పోలీసుల డేటా ప్రకారం న్యూయార్క్ నగరంలోని ఐదు ప్రాంతాల్లో మొత్తం 10,600 కార్ల దొంగతనాలు జరిగాయి. గత ఏడాది ఇదే సమయంలో 9000 వరకు కార్లు దొంగతనానికి గురయ్యాయి. గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే కార్ల దొంగతనాలు 25 శాతం పెరిగాయని ఒక అధికారి తెలిపారు. కార్లను తాళంచెవి లేకుండా ఎలా స్టార్ట్ చేయాలి లాంటి టిక్‌టాక్ వీడియోలు కుప్పల కొద్దీ ఉన్నాయని పోలీసులు తెలిపారు. కియా, హ్యూందాయ్ లోని కొన్ని మోడళ్ల కార్లను ఎలా దొంగలించాలో సవివరంగా చూపిస్తున్నారని, కీ లేకుండా ఆయా మోడళ్ల కార్లను ఎలా స్టార్ట్ చేయాలో చెబుతున్నారని పోలీసులు అంటున్నారు. న్యూయార్క్ నగరంలో దొంగతనానికి గురైన కార్లలో ఐదో వంతు ఆ మోడళ్లే ఉన్నాయని న్యూయార్క్ పోలీసులు తెలిపారు. కార్ల దొంగతనానికి పాల్పడుతున్న వారిలో సగం మంది 18 ఏళ్లలోపు యువకులేనని న్యూయార్క్ పోలీసు డిపార్ట్‌మెంట్ నివేదించింది.
ఆహారం అందిస్తుండగా దాడి చేసిన సింహం, ప్రాణాలు కోల్పోయిన జూ కీపర్
కరాచీలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం, వీధిలోనే కాల్చి చంపిన దుండగులు
టర్కీ పార్లమెంట్‌కి సమీపంలో ఆత్మాహుతి దాడి, మంత్రి ఆఫీస్ గేట్ బయటే ఘటన
యూకేలో సిక్కు రెస్టారెంట్ ఓనర్ కార్లపై దాడి, ఖలిస్థాన్ ఉద్యమాన్ని వ్యతిరేకించాడనే!
అఫ్గనిస్థాన్ సంచలన నిర్ణయం, ఢిల్లీలోని రాయబార కార్యాలయం మూసివేత - భారత్ సహకరించడం లేదని అసహనం
Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు
Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా
KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ
/body>