By: ABP Desam | Updated at : 13 Oct 2021 01:04 PM (IST)
Edited By: Sai Anand Madasu
కెనడా మహిళ ఇంటిపై పడిన ఉల్క(ఫైల్ ఫొటో)
కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో ఓ మహిళ నిద్రపోతుంది. సడెన్ గా ఆమె పక్కనే ఓ రాయి పడింది. అది ఆకాశంలో నుంచి వచ్చి.. పడింది. ఇంటికి కన్నం చేసుకూని మరీ.. దూసుకొచ్చింది. ఈ ఘటనతో ఉలిక్కిపడి లేచిన మహిళ వెంటనే పోలీసులకు కాల్ చేసింది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది.
కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో రూత్ హామిల్టన్ అనే మహిళ తన ఇంట్లో నిద్రిస్తుంది. ఆకాశం నుంచి ఏదో పడి.. ఇంటికి కన్నం పడి.. దిండు పక్కన పడింది. పక్కనే ఉన్నా.. పేపర్ల లాంటి వస్తువులు తన మెుకంపై పడ్డాయి. ఉలిక్కి పడి లేచింది హామిల్టన్. అసలు ఏం జరుగుతుందో గుర్తించలేకపోయింది. లేచి లైట్ ఆన్ చేసింది. వెంటనే 911 కి డయల్ చేసిందని, ఒక పోలీసు అధికారిని సంఘటనా స్థలానికి వచ్చారు. వచ్చిన పోలీసు అధికారి పరిశీలించి.. పక్కనే నిర్మాణం జరుగుతన్న ప్రదేశం నుంచి వచ్చి ఉంటుందని అనుకున్నాడు. కానీ అలా జరగలేదు.
వారు ఏదైనా బ్లాస్టింగ్ చేస్తున్నారేమోననే అనుమానంతో అక్కడికి వెళ్లి చూశారు. కానీ అక్కడి వాళ్లు అలాంటిది ఏమీ లేదని.. చెప్పారు. కానీ ఆకాశంలో ప్రకాశవంతమైన కాంతిని చూశామని చెప్పారు.
అది అరుదైన అంతరిక్ష రాయి. పై నుంచి పడినట్టు తెలుసుకున్నారు. అలాంటి రాయి అందరి దగ్గరా ఉండదు. అయినా ఆమె బాగా భయపడింది. కానీ అది ఆకాశం నుంచి పడిన ఉల్క. అక్కడ అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతాయని చెబుతారు.
'ఘటన జరగగానే నేను భయపడ్డాను. ఎవరైనా దూకారని అనుకున్నాను. లేకుంటేతుపాకీతో కాల్పులు జరిపారని అనుకున్నాను. ఆకాశం నుంచి పడిందని తెలుసుకున్నాక కాస్త ఉపశమనం కలిగిందని..' హామిల్టన్ చెప్పారు.
ఆ రాయిని గుర్తుగా దాచుకుంది హామిల్టన్. గతేడాది ఇండొనేసియాలోని ఉత్తర సుమత్రాలో జోషువా హుటాగాలంగ్ ఇంటి రూఫ్‌పై ఓ ఉల్క పడింది. అది ఏకంగా 2.1 కేజీల బరువుంది. అది అరుదైనది కావడంతో వేలంలో రూ.13 కోట్లకు అమ్ముడైంది. ప్రస్తుతం హామిల్టన్ దగ్గర ఉన్న ఉల్కను CM1/2 కార్బొనేషియస్ ఖోన్‌డ్రైట్ రకంగా గుర్తించారు. ఒక్కో గ్రాము ధర రూ.64వేలకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Also Read: Pornhub Traffic Surged: ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్ పని చేయట్లేదని.. ఆ సైట్స్ మీద ఎగబడ్డారుగా యూజర్లు
Also Read: Attack At Saudi Airport : సౌదీ ఎయిర్‌పోర్టుపై డ్రోన్ దాడులు.. హైతీ తిరుగుబాటు దారుల పనేనని అనుమానం !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Top 10 Headlines Today: పోలవరం టూర్‌కు జగన్, నాగర్ కర్నూల్‌లో కేసీఆర్ పర్యటన, తిరుపతిలో ఆదిపురుష్ వేడుక
Top 10 Headlines Today: ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం, ఒడిశా ప్రమాద బాధితులపై మమత
Google AI Course: ఉచిత ఏఐ కోర్సులు అందిస్తున్న గూగుల్, పూర్తి చేసిన వారికి బ్యాడ్జ్‌లు
School Girls Poisoned: ఆఫ్ఘన్‌లో బాలికలపై విషప్రయోగం, ఆస్పత్రిపాలైన 80 మంది విద్యార్థినులు
Kathleen Folbigg: 20 ఏళ్ల జైలుశిక్ష తర్వాత విడుదలైన 'సీరియల్ కిల్లర్'- ఫలించిన వైద్యులు, నోబెల్ గ్రహీతల పోరాటం
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో స్మార్ట్ కాపీయింగ్- స్నేహితుల కోసం చీట్ చేసి చిక్కిన టాపర్
RBI: కొత్త వడ్డీ రేట్లపై నేటి నుంచి ఆర్‌బీఐ సమీక్ష, రెపో రేట్ ఎంత పెరగొచ్చు?
WTC Final 2023 Live Streaming: డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఫ్రీ లైవ్‌స్ట్రీమింగ్ ఎందులో? టైమింగ్, వెన్యూ ఏంటి?
Adani Group: అప్పు తీర్చిన అదానీ, షేర్ ప్రైస్‌లో స్మార్ట్ రియాక్షన్