అన్వేషించండి

US Presidential Elections: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో బైడెన్‌ది ఓ బాధ‌, ట్రంప్‌ది మ‌రో కథ- అసలేం జ‌రుగుతోంది?

అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు ముందు చిత్ర‌మైన ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు జోబైడెన్‌, మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు.

America presidential Elections: అగ్ర‌రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నిక‌ల‌(America Elections)కు స‌మ‌యం చేరువ అవుతోంది. అప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో(States) ప్ర‌చారాలు ఎన్నిక‌లు కూడా జ‌రుగుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ తాను పోటీలో ఉన్నాన‌ని ప్ర‌స్తుత అధ్య‌క్షుడు జో బైడెన్(Joe Biden) ప్ర‌క‌టించారు. అయితే.. ``బైడెన్ ఒక చెత్త‌.. ఈ చెత్త‌ను ఎత్తి పారేయ‌డానికి నేను వ‌స్తున్నా`` అంటూ మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రెడీ అయ్యారు. ఆయ‌న కూడా రాష్ట్రాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. కానీ, ఇద్ద‌రికీ కూడా.. సొంత చిక్కులు ఎదుర‌వుతున్నాయి. ఇద్ద‌రిదీ చెరో బాధ‌గా మారిపోయింది. బైడెన్‌పై వృద్ధుడు, మ‌తిమ‌రుపు ఉన్న నాయ‌కుడు అనే ముద్ర ప‌డ‌గా.. ట్రంప్‌పై కేసులు చిక్కుముళ్లు పెరుగుతుండ‌డంతోపాటు.. జ‌రిమానాలు కూడా ప‌డుతున్నాయి. దీంతో ఇద్ద‌రి ప‌రిస్థితీ కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింది. 

ట్రంప్ ప‌రిస్థితి ఇదీ..  
 మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) వ‌చ్చే అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో త‌న‌కు తిరుగులేద‌ని.. త‌నంత సంప‌న్నుడు కూడా లేడ‌ని చెప్పిన 24 గంట‌ల్లోనే కోర్టు భారీ షాక్ ఇచ్చింది. గ‌తంలో బ్యాంకును మోస‌గించార‌న్న అభియోగంపై ట్రంప్‌పై న‌మోదు చేసిన కేసుల‌ను విచారించిన కోర్టు.. ఏకంగా.. 3 వేల కోట్ల మేర‌కు(364 బిలియ‌న్ డాల‌ర్లు) జ‌రిమానాగా విధించింది. వాస్తవిక విలువ కంటే అధికంగా చూపి బ్యాంకులను, బీమా సంస్థలను ఆయ‌న గుండుగుత్త‌గా మోసం చేశారనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు.. అప్పులు  కూడా చేశారు. దీనిపై న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌, డెమోక్రాట్‌ నేత లెటిటియా జేమ్స్‌ ఈ దావా వేయగా.. దీనిపై ఇటీవల రెండున్నర నెలల పాటు న్యాయస్థానం విచారణ జరిపింది. ఇందులో ట్రంప్‌పై అభియోగాలు రుజువయ్యాయి. దీంతో 3 వేల కోట్ల మేర‌కు ఆయ‌న‌కు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. అంతేగాక, మూడేళ్ల పాటు న్యూయార్క్‌కు చెందిన ఏ సంస్థలోనూ ఆయన ఆఫీసర్‌ లేదా డైరెక్టర్‌గా ఉండకూడద‌ని కూడా నిషేధం విధించ‌డం మ‌రో సంచ‌ల‌న తీర్పుగానే చెబుతున్నారు. అయితే, ఇది సివిల్‌ కేసు కావడంతో జైలు శిక్ష వేయట్లేదని స‌రిపుచ్చారు. కాగా, ప్ర‌స్తుత అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో కీల‌క రేసులో ఉన్న ట్రంప్‌.. ఈ ప‌రిణామంతో ఇబ్బంది ప‌డే ప‌రిస్థితి ఏర్ప‌డింది. నిజానికి ఆయ‌న కొంతకాలంగా లైంగిక వేధింపుల కేసు వెంటాడుతోంది. అదేవిధంగా అధ్య‌క్ష భ‌వ‌నం ముందు ఆందోళ‌న చేసిన వారిని రెచ్చ‌గొట్టి దాడులు చేయించార‌న్న కేసులు కూడా ఉన్నాయి. అంతేకాదు.. 2022లో పన్ను చెల్లింపులకు సంబంధించిన మోసం కేసులో కూడా ఆయ‌న జ‌రిమానా చెల్లించారు. ఈ ప‌రిణామాల‌ను అధికార పార్టీ ప్ర‌చార అస్త్రంగా మార్చుకుంది. 

ట్రంప్ రాష్ట్రాల్లో ముందంజ‌! 
అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ రేసులో ఉన్న‌ డొనాల్డ్ ట్రంప్(Trump)​ దూసుకెళ్తున్నారు. ఇప్పటికే రెండు ఎన్నికల్లో గెలిచిన ఆయన, వర్జిన్ ఐలాండ్స్​, నెవాడ ప్రైమరీ ఎలక్షన్​లోనూ ఘన విజయం సాధించారు. నాలుగు రోజుల కింద‌ట‌ వర్జిన్​ ఐలాండ్స్​లో జరిగిన ఎన్నికలో ట్రంప్​ 73శాతం ఓట్లు సాధించి భారీ మెజారిటీతో గెలుపొందారు. నెవాడాలో ఏకగ్రీవంగా గెలిచారు. బరిలో ఉన్న నిక్కి హేలీ పోటీ నుంచి తప్పుకోవడం వల్ల ఆయన ఏకగ్రీవంగా గెలిచారు. ఎన్నికల్లో నిబంధనలు పాటించకపోవడం వల్ల బహిష్కరించినట్లు హేలీ తెలిపారు. ఈ ఎన్నికల్లో విజయంతో ట్రంప్​నకు 26 డెలిగెట్స్​ లభించాయి. అధికారికంగా పార్టీ తరఫున నామినేషన్ దక్కించుకునేందుకు ఆయనకు 1,215 డెలిగెట్స్​ అవసరం అవుతాయి. అంతకుముందు అయోవా, న్యూ హ్యాంప్​షైర్​ రాష్ట్ర ప్రైమరీలో విజేతగా నిలిచారు, అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి ట్రంప్‌ పోటీ పడుతుండటం వరుసగా ఇది మూడోసారి. 2016లో అధ్యక్ష పదవి చేపట్టిన ఆయన, 2020లో డెమోక్రటిక్‌ నేత జో బైడెన్‌ చేతిలో ఓటమిపాలయ్యారు.

బైడెన్ ప‌రిస్థితి ఇలా.. 
అమెరికా అధ్యక్షుడిగా ఉన్న‌ జో బైడెన్‌(Jeo Biden) రెండోసారి గెలవాలని కోరుకుంటున్నారు. అయితే.. ఈయ‌న‌కు కూడా ఇబ్బందులు ఉన్నాయి. రహస్యపత్రాలకు సంబంధించిన నివేదిక అంశాలు ఇబ్బంది కలిగిస్తున్నాయి. రహస్య పత్రాలను బైడెన్‌ తన ఇంట్లో పెట్టుకోవడంపై ఓ నివేదిక ఇచ్చిన స్పెషల్‌ కౌన్సిల్‌ అందులో బైడెన్‌ జ్ఞాపకశక్తిపై సందేహాలు వ్యక్తం చేసింది. బైడెన్‌ను జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్న వృద్ధుడని పేర్కొంది. కాగా, ఈ నివేదికను బైడెన్ తీవ్రంగా ఖండించారు. తనకు అన్ని స్పష్టంగా గుర్తుంటాయని చెప్పారు. అయితే ఇలా చెప్పిన కొద్ది సేపటికే మెక్సికో సరిహద్దుల్లో గాజా ఉందంటూ ఓ ప్రెస్​మీట్​లో చెప్పటం వల్ల మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ``మీకు ముందే తెలుసు. మెక్సికో అధ్యక్షుడు ఎల్​ సీసీ సరిహద్దులు(గాజా సరిహద్దులు) తెరిచి మానవీయ సాయం పంపేందుకు ఇష్టపడలేదు. నేను ఆయనతో మాట్లాడి గేట్లు తెరిపించాను' అని బైడెన్ సమాధానం ఇచ్చారు. దీంతో అక్కడ ఉన్నవారు అంతా అవాక్కయ్యారు. ఆ తర్వాత అధ్యక్ష కార్యాలయ ప్రతినిధులు ఆ తప్పును సరిదిద్దాల్సి వచ్చింది. ఇక‌, ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ఉన్న రిపబ్లికన్ల చేతికి ఈ వీడియో క్లిప్ చేరింది. ఆ వీడియోను ఎక్స్‌లో బలహీనం, బాధాకరం, ఇక్కడ చూసేందుకు ఏమీలేదు అంటూ ట్రంప్ సలహా దారులు క్రిస్‌ లాసివిట, జేసన్‌ మిల్లర్లు కామెంట్లు పెడుతూ పోస్ట్ చేశారు. ఇప్పటికే బైడెన్‌ వృద్ధాప్యాన్ని, జ్ఞాపకశక్తిని తమ ప్రధాన ఎన్నికల అస్త్రంగా ప్రత్యర్థులు వాడుకుంటున్నారు.

పుతిన్ మ‌ద్ద‌తు.. కానీ..! 
రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్​ బైడెన్​ నెగ్గాలని, ప్రత్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌తో పోలిస్తే ఆయన కాస్త మేలని రష్యా(Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌(Vlodemir Putin) తన అభిప్రాయాన్ని ఇటీవ‌ల‌ వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల్లో ఎవరు గెలిచినా వారితో కలిసి తాము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కానీ, మాస్కో కోణంలో చూస్తే మాత్రం బైడెన్‌ మళ్లీ గెలవాలని తాను కోరుకుంటున్నట్లుగా చెప్పారు. అంతేగాక జో బైడెన్​ అనుభవం, అంచనావేయగల నేత అని పుతిన్‌ కొనియాడారు.  బైడెన్‌ విధానాలు చాలా బలంగా ఉంటాయని పుతిన్‌ ప్రశంసించారు.  అయితే.. తాజాగా బైడెన్ పుతిన్‌పై విరుచుకుప‌డుతున్నారు. ర‌ష్యా విప‌క్ష నాయ‌కుడు, ప్ర‌ముఖ ఉద్య‌మ కారుడు అలెక్సీ నావ‌ల్నీ మ‌ర‌ణంపై అనుమానాలు వ్య‌క్తం చేస్తూ.. పుతిన్ ప్ర‌భుత్వం దీనికి బాధ్య‌త వ‌హించాల‌ని బైడెన్ తాజాగా డిమాండ్ చేశారు. దీంతో పుతిన్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు బైడెన్‌కు ఇచ్చిన మ‌ద్ద‌తును ఉప‌సంహ‌రించుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ హైకోర్టు షాక్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ హైకోర్టు షాక్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?-  అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?- అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Pushpa 2 Chennai Event Date: ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
Sabarimala Special Trains: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Marquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP DesamRishabh pant IPL 2025 Auction | స్పైడీ రిషభ్ పంత్ కొత్త రికార్డులు సెట్ చేస్తాడా.? | ABP DesamRishabh Pant Border Gavaskar Trophy Heroics | ఒక్క ఇన్నింగ్స్ తో టెస్ట్ క్రికెట్ క్రేజ్ మార్చేశాడుPujara Great Batting at Gabba Test | బంతి పాతబడటం కోసం బాడీనే అడ్డం పెట్టేశాడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ హైకోర్టు షాక్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ హైకోర్టు షాక్, జీవో 16 కొట్టివేస్తూ ఉత్తర్వులు
YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?-  అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?- అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
Pushpa 2 Chennai Event Date: ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?
Sabarimala Special Trains: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే
Amaran OTT Release Date: 'అమరన్' ఓటీటీ రిలీజ్ ఈ నెలలోనే... అనుకున్న తేదీ కంటే ముందుగానే Netflixలో... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'అమరన్' ఓటీటీ రిలీజ్ ఈ నెలలోనే... అనుకున్న తేదీ కంటే ముందుగానే Netflixలో... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Lagacharla Incident: అధికారులపై దాడి కేసులో కీలక పరిణామం, లొంగిపోయిన కీలక నిందితుడు - 14 రోజులపాటు రిమాండ్
అధికారులపై దాడి కేసులో కీలక పరిణామం, లొంగిపోయిన కీలక నిందితుడు - 14 రోజులపాటు రిమాండ్
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Viral News : గంజాయి మొక్కలతో బాల్కనీ గార్డెన్ - రొమాంటిక్ ఫోటోషూట్‌ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన జంట - కట్ చేస్తే
గంజాయి మొక్కలతో బాల్కనీ గార్డెన్ - రొమాంటిక్ ఫోటోషూట్‌ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన జంట - కట్ చేస్తే
Embed widget