By: ABP Desam | Updated at : 13 Oct 2021 11:22 AM (IST)
Edited By: Sai Anand Madasu
అరటి చెట్టు మీద పడిందని సుప్రీ కోర్టుకు వెళ్లిన వ్యక్తి(ఫైల్ ఫొటో)
పని చేసే స్థలంలో ప్రమాదాలు జరిగితే.. తీవ్రతను బట్టి పరిహారం ఉంటుంది. ఓ వ్కక్తి.. తనపై అరటి చెట్టు పడిందని.. దాదాపు 4 కోట్ల దావా వేశాడు. అవును ఇది నిజం. అంతేంటీ బాబోయ్ అనుకోకండి.. అసలు విషయంలోకి వెళ్తే పూర్తిగా అర్థం అవుతుంది. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా? ఆస్ట్రేలియాలో..
ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో సమీపంలోని ఎల్ అండ్ ఆర్ కాలిన్స్‌కు చెందిన అరటి తోటలో జైర్ లాంగ్ బాటమ్ అనే వ్యక్తి పని చేసుకుంటున్నాడు. రోజు వారిలానే.. చేస్తున్న పనిలో ఓ ఘటన చోటుచేసుకుంది. కాపునకు వచ్చిన అరటి గెలలను నరుకుతున్నాడు. ఈ సమయంలోనే ప్రమాదవశాత్తు.. అరటి పండ్ల గెలతోపాటు చెట్టు కూడా వచ్చి బాటమ్ పై పడింది. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. దెబ్బలు ఎక్కువగా తగిలి పాపం.. బాటమ్ వికలాంగుడు అయ్యాడు. ప్రమాద కారణంగా.. ఇక పని చేయలేకపోయాడు. ఉపాధి కోల్పోయాడు. ఏం చేయాలో.. ఎలా బతకాలో తెలియని పరిస్థితి. ఈ సమయంలోనే.. తనకు పరిహారం కావాలని క్వీన్స్ ల్యాండ్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాడు.
ఈ పిటిషన్ పై కోర్టులో విచారణ జరిగింది. తాజాగా మరోసారి వాదనలు జరిగాయి. పని చేస్తున్న సమయంలో.. అరటి పండ్ల గెల మీద పడటం కారణంతోనే బాటమ్ తీవ్ర గాయపడ్డాడని.. అందువల్లనే లైఫ్ టైమ్ ఉపాధి కోల్పోవలసి వచ్చిందని.. కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. దీనితో.. ఆ అరటి తోట యజమాని దాదాపు 4 కోట్ల రూపాయలు బాధితుడికి చెల్లించాలని.. ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాల ప్రకారం యజమాని.. పూర్తి నష్టపరిహారం చెల్లించాడు. ఈ ఘటన 2016లో జరిగింది. అప్పటి నుంచి విచారణ జరుగుతూ.. తాజాగా తీర్పు వెలువడింది.
Also Read: Pornhub Traffic Surged: ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్ పని చేయట్లేదని.. ఆ సైట్స్ మీద ఎగబడ్డారుగా యూజర్లు
Also Read: Attack At Saudi Airport : సౌదీ ఎయిర్‌పోర్టుపై డ్రోన్ దాడులు.. హైతీ తిరుగుబాటు దారుల పనేనని అనుమానం !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Qin Gand Dead: చైనా మాజీ విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్ ఆత్మహత్య? సంచలనం సృష్టిస్తున్న రిపోర్ట్
Las Vegas shooting: అమెరికాలో మరో సారి కాల్పుల మోత, ముగ్గురు మృతి
Fact Check: రష్యా అధ్యక్షుడు పుతిన్ పాలస్తీనాకు మద్దతు ప్రకటించారా? ఇది నిజమేనా?
Viral Video: చిన్న పిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చిన కిమ్, పిల్లల్ని కనాలంటూ ఎమోషనల్ - వీడియో వైరల్
Philippines Earthquake: ఫిలిప్పైన్స్‌లో మరోసారి భూకంపం, వారం రోజుల్లో 2 వేల సార్లు ప్రకంపనలు
APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు
Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం
Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?
Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?
/body>