అన్వేషించండి

Trump Tariffs on India: భారత్‌‌తో అమెరికాకు గుడ్ రిలేషన్, టారిఫ్ విషయంలో తగ్గేదేలేదు: డొనాల్డ్ ట్రంప్ క్లారిటీ

US Tariffs On India | అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి తాను అధికారం చేపట్టాకే భారత్ నుంచి జరిగే వ్యాపారాలలో అసమతుల్యత కాస్త తగ్గిందని డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు.

US Pesident Donald Trump | వాషింగ్టన్: అమెరికాకు భారతదేశంతో మంచి సంబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత్ స్నేహాన్ని అమెరికా ఎంజాయ్ చేస్తోందని, కానీ వాణిజ్య పరంగా ఎన్నో ఏళ్ల నుంచి భారత్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందన్నారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ "భారీ సుంకాలు" విధిస్తోందని మంగళవారం నాడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

భారత్ విధించే సుంకాలే అధికం..

భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలను తగ్గించే యోచన ఉందా అని వైట్‌హౌస్‌లో అడిగిన ప్రశ్నకు ట్రంప్ బదులిచ్చారు. తాను అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత మాత్రమే పరిస్థితిలో కొంచెం మార్పు వచ్చిందన్నారు. భారత్ మా నుంచి భారీ సుంకాలు వసూలు చేస్తోంది,  ప్రపంచంలోనే అమెరికా మీద అధిక సుంకాలు విధిస్తున్న దేశం భారత్ అని ఆయన అన్నారు. మేం భారతదేశంతో పెద్దగా వ్యాపారం చేయలేదు. కానీ వారు మా దేశంలో మంచిగా బిజినెస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మేం మొన్నటివరకూ భారత్ మీద భారీ సుంకాలు విధించలేదు. దాంతో మాకే అధిక నష్టం వాటిల్లిందని, భారత్ చేసే వ్యాపారంతో తమకు ఎలాంటి ప్రయోజనం లేనది సంచలన వ్యాఖ్యలు చేశారు.

భారత్ తమ మీద 200 శాతం సుంకాలు విధించిందన్న ట్రంప్

హార్లే- డేవిడ్‌సన్ బైకుల విషయాన్ని ఉదాహరణగా చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. హార్లే- డేవిడ్‌సన్ కంపెనీ భారతదేశంలో 200 శాతం వరకు సుంకాలు చెల్లిస్తోంది. అప్పుడు ఏం జరుగుతుంది.. ఈ ఖర్చలు భరించలేక, హార్లే డేవిడ్‌సన్ భారతదేశానికి వెళ్లి అక్కడే మోటార్‌సైకిల్ ప్లాంట్‌ను నిర్మించింది. దానివల్ల వారు ఆ కంపెనీ ఉత్పత్తులపై సుంకాలు చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. ఈ విధానం అమెరికా తయారీదారులకు జరుగుతున్న అన్యాయమని ట్రంప్ పేర్కొన్నారు. 

"మా దేశంలో తయారుకావాల్సిన ఉత్పత్తులు ఇక నుంచి భారతదేశంలో మానుఫ్యాక్చర్ అవుతాయి. ఇంకా చెప్పాలంటే భారతదేశంలోనే అమెరికా కంపెనీలు ఉత్పత్తులు చేసి మా దేశానికి ఎగుమతి చేసే అవకాశం ఉంది. ఇది అమెరికా కంపెనీలకు ప్రతికూలంగా మారుతుంది. కానీ మేము భారత్‌కు ఏదీ ఎగుమతి చేయలేం. వారు మా నుంచి 100% సుంకాలు వసూలు చేస్తున్నారని ట్రంప్ అన్నారు.

సుంకాలను సుంకాలతోనే ఎదుర్కొంటున్న అమెరికా..

అమెరికా ఎగుమతులు సమర్థవంతంగా నిరోధిస్తున్నారు. కానీ భారత ఉత్పత్తులు సంవత్సరాలుగా US మార్కెట్‌లోకి ప్రవాహంలా రావడం నిజం కాదా అని ప్రశ్నించారు. భారత్ విధిస్తున్న భారీ సుంకాలతో అమెరికా వదిలి కంపెనీలు ఆ దేశంలో ప్లాంట్లు ఏర్పాటు చేయడం మాకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇలాంటి వాటిని భర్తీ చేయడానికి, అమెరికా ప్రయోజనాల కోసం సుంకాలు విధించినట్లు తన నిర్ణయాలను ట్రంప్ సమర్థించుకున్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
Gulf illegal residency help: గల్ఫ్ ఇరుక్కుపోయిన మహిళలకు పిల్లల పౌరసత్వ కష్టాలు - ఈ సమస్యను గుర్తించేది ఎవరు?
గల్ఫ్ ఇరుక్కుపోయిన మహిళలకు పిల్లల పౌరసత్వ కష్టాలు - ఈ సమస్యను గుర్తించేది ఎవరు?
US Attacks Iran: ఇరాన్ మిస్సైల్ సెంటర్లపై అమెరికా మెరుపు దాడులు! సీజ్ ఫైర్ సమయంలో మరోసారి ఉద్రిక్తత
ఇరాన్ మిస్సైల్ సెంటర్లపై అమెరికా మెరుపు దాడులు! సీజ్ ఫైర్ సమయంలో మరోసారి ఉద్రిక్తత
White House Gun Fire: వైట్ హౌస్ వద్ద కాల్పులు.. సీక్రెట్ సర్వీస్ ఎదురుకాల్పుల్లో దుండగుడు హతం, ట్రంప్ సేఫ్
వైట్ హౌస్ వద్ద కాల్పులు.. సీక్రెట్ సర్వీస్ ఎదురుకాల్పుల్లో దుండగుడు హతం, ట్రంప్ సేఫ్

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gandhi Bhavan Fight: గాంధీ భవన్‌లో గలాటా - గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు - మంత్రుల ఎదుటే !
గాంధీ భవన్‌లో గలాటా - గల్లాలు పట్టుకుని కొట్టుకున్న నేతలు - మంత్రుల ఎదుటే ! వీడియో
Madhura Sreedhar Reddy: సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి
సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి
YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
Pune Porsche Crash Case: పుణె పోర్షే ప్రమాదం కేసులో నిందితులకు బెయిల్ - సంబరాల వీడియోల వైరల్ - బాధితులకు వ్యవస్థలపై నమ్మకం ఎలా?
పుణె పోర్షే ప్రమాదం కేసులో నిందితులకు బెయిల్ - సంబరాల వీడియోల వైరల్ - బాధితులకు వ్యవస్థలపై నమ్మకం ఎలా?
Battery as a Service India: ఈవీ మార్కెట్‌లో కొత్త
ఈవీ మార్కెట్‌లో కొత్త "బాస్‌"! సగం ధరకే విద్యుత్‌ కార్లు! నిజంగానే ఇది సామాన్యుడికి వరమేనా?
ED Raids Kerala: కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
Balakrishna Birthday: బాలయ్య బర్త్ డేకు గిఫ్ట్ రెడీ చేస్తున్న గోపీచంద్ మలినేని
బాలయ్య బర్త్ డేకు గిఫ్ట్ రెడీ చేస్తున్న గోపీచంద్ మలినేని
Embed widget