Amazon Delivery Agent: కళ్ల ముందే దొంగతనం, ఏమీ చేయలేకపోయిన అమెజాన్ డెలివరీ ఏజెంట్
Amazon Truck Loot: అమెరికాలోని అట్లాంటాలో విచిత్రమైన దొంగతనం జరిగింది. కళ్ల ముందే వాహనంలోని వస్తువులను దుండగులు ఎత్తుకెళ్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మహిళా డ్రైవర్ వారిని చూస్తూ ఉండిపోయింది.
Amazon Delivery Truck Loot: అమెరికాలోని అట్లాంటా (Atlanta)లో విచిత్రమైన దొంగతనం జరిగింది. అమెజాన్ డెలివరీ వాహనాన్ని (Amazon Delivery Van) గుర్తు తెలియని వ్యక్తులు దోచుకున్నారు. కళ్ల ముందే వాహనంలోని వస్తువులను దుండగులు ఎత్తుకెళ్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మహిళా డ్రైవర్ (Truck Driver) వారిని చూస్తూ ఉండిపోయింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఆదివారం ఫెయిర్‌బర్న్ మేస్ (Fairburn Mays) పరిసరాల్లోని అమెజాన్ డెలివరీలను ఇవ్వడానికి ఓ ట్రక్ వచ్చింది. అక్కడ ఓ అపార్ట్‌మెంట్‌కు పార్సిల్ డెలివరీ ఇవ్వడానికి మహిళా డ్రైవర్ వెళ్లారు.
ఆ సమయంలో నలుగురు దుండగులు డెలివరీ వాహనంలో ఉన్న పార్సిళ్లను దొంగతనం చేయడం మొదలు పెట్టారు. డ్రైవర్ పార్సిల్ ఇచ్చి వచ్చే సరికి చాలా బాక్సులను దొంగలు ఎత్తుకెళ్లారు. ఆ దుండగులను చూసి ఆమె ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయింది. సమీపంలోని అపార్ట్ మెంట్‌లో ఉంటున్న వ్యక్తి వీడియో తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో నలుగురు వ్యక్తులు ట్రక్కు వద్దకు పరిగెత్తుతూ వెళ్లి పార్సిళ్లను తీసుకుని పారిపోవడం కనిపిందింది. ఆ సయమంలో ఇద్దరు దొంగలు కింద పడ్డారు. తరువాత లేచి వ్యానులో బాక్సులను తీసుకుని పరారయ్యారు. డ్రైవర్ వారిని చూస్తూ ఉండిపోయింది.
ఇదేం దొంగతనం రా మావా? చూస్తుండగానే వ్యాను మొత్తం ఖాళీ చేశారు
— Chaitanya Reddy (@Chaithanya225) November 17, 2023
అమెరికాలోని అట్లాంటాలో విచిత్రమైన దొంగతనం జరిగింది. అమెజాన్ డెలివరీ వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దోచుకున్నారు. కళ్ల ముందే వాహనంలోని వస్తువులను దుండగులు ఎత్తుకెళ్తుంటే మహిళా డ్రైవర్ వారిని చూస్తూ ఉండిపోయింది. pic.twitter.com/kU5KYiDHrT
ఘటనపై డ్రవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన సమయంలో వ్యాన్ డోర్ లాక్ వేయడం మర్చిపోయినట్లు చెప్పారు. దుండగులు అనేక ప్యాకేజీలను దొంగిలించారని ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన ప్యాకేజీల్లో ఏయే వస్తువులు ఉన్నాయో తెలియదని పేర్కొంది. మెంఫిస్ ప్రాంతంలో ఇలాంటి దాడులు చాలా జరిగాయి. డెలివరీ వాహనాలపై దుండగులు దాడి చేసి అందులోని వస్తువులను దోచుకెళ్లడం కొత్తేం కాదు. గతంలో కొందరు వాహనదారులు ఫెడెక్స్ సెమీ ట్రక్కును అడ్డుకున్నారు. ప్యాకేజీలను దొంగిలించారు. అలాగే సాయుధ దొంగల బృందం ఇటీవల మేల్యాండ్‌లో యుపీఎస్ వాహనాన్ని ఎత్తుకెళ్లారు.