అన్వేషించండి

G7 Summit: 'డ్రాగన్​'​కు స్కెచ్, కరోనాకు చెక్.. ఇదే జీ7 మాస్టర్ ప్లాన్!

చైనా ఆధిపత్యం ఆసియానే కాదు ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. మరోవైపు కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ తరుణంలో శక్తిమంతమైన జీ7 దేశాలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇటీవల జరిగిన జీ7 సదస్సు హైలైట్స్​ ఇవే

ప్రపంచంలో అత్యంత సంపన్న ప్రజాస్వామ్య దేశాల కూటమి జీ7. ఈ సదస్సులో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా దేశాల అధినేతలు ప్రపంచ స్థాయి అంశాలపై సవివరంగా చర్చిస్తారు. 

ఈ ఏడాది జీ7 సదస్సు జూన్​లో ముగిసింది. ఈ భేటీలో ముఖ్యంగా చైనా దుర్మార్గాలకు చెక్​ పెట్టేలా జీ7 దేశాలు స్కెచ్ వేశాయి. చైనా మానవ హక్కుల ఉల్లంఘన, కరోనా వైరస్, వ్యాక్సిన్ వంటి విషయాలపై దేశాధినేతలు మాట్లాడారు.

జీ7 హైలైట్స్​..

చైనాకు చెక్..

చైనా పెత్తనానికి అడ్డుకట్ట వేసేందుకు జీ7 కూటమి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా చైనా నుంచి పొంచి ఉన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఒక సమగ్ర వ్యూహంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని నేతలు జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రముఖంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

కరోనాపై

  1. భవిష్యత్తులో కరోనా వంటి ముప్పు రాకుండా చర్యలు.
  2. భవిష్యత్తులో కొత్త రకం వైరస్‌ ముప్పు ఎప్పుడు బయటపడినా దాన్ని వంద రోజుల్లోనే కట్టడి చేయాలని సంకల్పం.  ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య తీర్మానం(కార్బిస్ బే) ఆమోదం.
  3. ప్రపంచ ఆరోగ్య రంగంలోనే మైలురాయి 'కార్బిస్‌ బే'.
  4. 100 రోజుల్లో వైరస్‌ ముప్పును తప్పించేందుకు జంతువుల టీకా అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయనున్న బ్రిటన్‌

టీకాలు

కరోనా విజృంభణ, టీకాల కొరత నేపథ్యంలో పేద దేశాలకు ఒక బిలియన్‌ వ్యాక్సిన్‌ డోసులు విరాళంగా ఇవ్వాలని జీ7 దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల టీకా డోసుల్ని వివిధ మార్గాల ద్వారా పంపిణీ చేయాలని సభ్య దేశాలు నిర్ణయించాయి.

పర్యావరణ పరిరక్షణ..

  • పర్యావరణ పరిరక్షణ దిశగా కఠినమైన లక్ష్యాలను పెట్టుకోవాలని జీ7 దేశాలు నిర్ణయించాయి.
  • బొగ్గు, శిలాజ ఇంధన వినియోగాన్ని క్రమంగా తగ్గించాలని సంకల్పించుకున్నాయి.
  • వాతావరణ మార్పులపై పోరాడేందుకు జీ7 దేశాలు అందించే నిధుల వాటాను 100 బిలియన్ డాలర్లకు పెంచాలని నిర్ణయం.
  • 2010 స్థాయులతో పోలిస్తే కర్బన ఉద్గారాలను 2030 నాటికి సగానికి తగ్గించాలనే లక్ష్యం

చైనా, రష్యా ఎందుకు లేవు?

ఈ శక్తిమంతమైన కూటమిలో చైనా, రష్యా వంటి దేశాలు లేకపోవడానికి ప్రత్యేక కారణాలున్నాయి.

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగివుండటంతో పాటు రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న చైనాలో జనాభా తలసరి ఆదాయం మిగతా అభివృద్ధి చెందిన దేశాలకన్నా తక్కువ స్థాయిలో ఉంది. ఈ కారణంతోనే జీ7 దేశాల తరహాలో ఆర్థికంగా అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా చైనాని పరిగణించటం లేదు.

1998లో రష్యా కూడా ఈ బృందంలో చేరింది. అప్పుడు ఇది జీ8 బృందంగా ఉండేది. కానీ.. ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియాను రష్యా తన భూభాగంలో కలుపుకోవటం వల్ల 2014లో ఈ బృందం నుంచి ఆ దేశానికి ఉద్వాసన పలికారు. దీంతో ఈ బృందం మళ్లీ జీ7గా మారింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
Embed widget