Most Beautiful Snakes: ప్రపంచంలోనే 10 అందమైన పాములు ఇవి, ఏ దేశాల్లో కనిపిస్తాయంటే..
Snakes in The World | చాలా మందికి పాములంటే భయం. కానీ కొన్ని పాము జాతులు చూడటానికి అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఆ పాము జాతులను చూడాలంటే మీరు పలు దేశాలకు వెళ్లక తప్పదు.

Most beautiful Snakes in the world: పాము అనే పేరు వినగానే మనలో ఏదో భయం మొదలవుతుంది. విషపూరితమైన పాము మనల్ని కరిచేందుకు వెంబడిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. పాము కాటు కారణంగా ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది చనిపోతున్నారు. చాలా మంది పాములకు దూరంగా ఉండాలని కోరుకుంటారు, కానీ కొన్ని పాములు చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. ప్రపంచంలోని 10 అందమైన, ఆకర్షణీయమైన పాముల వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ఆ పాములను కనుక చూడాలంటే ఆ దేశాలకు వెళ్లాల్సిందే.
బ్లూ కోరల్ పాము
ఇది ప్రపంచంలోని అత్యంత అందమైన పాము జాతులలో ఒకటి. ఈ పాము మలేషియా, థాయిలాండ్, సింగపూర్, ఇండోనేషియా వంటి దక్షిణ ఆసియా దేశాల్లోనే కనిపిస్తుంది. ఈ రకం రంగురంగుల పాములు ఈ దేశాలలోమాత్రమే కనిపిస్తాయి. వీటి శరీరం నీలి-బూడిద రంగులో ఉంటుంది. పాము మీద లేత నీలి రేఖలు ఉంటాయి. తల, తోక రంగు నారింజ లేదా ఎరుపు నారింజ రంగులో ఉంటుంది. ఈ పాము కాటుకు గురైన వారు అదృష్టవశాత్తూ బతికినా జీవితకాలం వైకల్యంతో బాధపడే అవకాశం ఉంది. విషపూరితమైనప్పటికీ, ఇవి మానవులను అంత తేలికగా కాటేయవు.
హిరే హరిత వృక్ష బోవా పాము
ఇది దక్షిణ అమెరికాలోని అమెజాన్ రెయిన్ ఫారెస్టులో మనకు కనిపిస్తుంది. ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇది ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీని శరీరంపై తెల్లని చారలు ఉంటాయి.
బ్రెజిలియన్ రెయిన్బో బోవా పాము
బ్రెజిలియన్ రెయిన్బో బోవా పాము బ్రెజిల్, దక్షిణ అమెరికాలో మాత్రమే కనిపిస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఇది ఇంద్రధనస్సు లాంటి ఆకారాన్ని శరీరంపై ప్రదర్శిస్తుంది.
హరిత వృక్ష అజగర్ పాము
హరిత వృక్ష అజగర్ పాములను ఆస్ట్రేలియాలోని న్యూ గిని అడవులలో చూడవచ్చు. ఇది పసుపు లేదా నీలి రంగు మచ్చలతో ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఎంత అందంగా కనిపిస్తుందో, అంత విషపూరితమైనది కూడా.
సన్‌బీమ్ పాము
సన్‌బీమ్ పాము దక్షిణ ఆసియా దేశాలలో కనిపిస్తుంది. ఇది చూడటానికి సాధారణంగా ఉంటుంది. అయితే, సూర్యకాంతి పడినప్పుడు ఇది ఇంద్రధనస్సులా ప్రకాశిస్తుంది.
ఐలష్ వైపర్ పాము
ఐలష్ వైపర్ పాము మధ్య అమెరికా, దక్షిణ అమెరికా అడవులలో కనిపిస్తుంది. ఈ పాము పసుపు రంగులో ఉంటుంది. కళ్ళ పైన కనుబొమ్మల వంటి నిర్మాణం చూడవచ్చు. .
కోరల్ పాము
కోరల్ పాము ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా అడవులలో కనిపిస్తుంది. ఇది చూడటానికి ఎంత అందంగా ఉంటుందో, కాటేస్తే అంత ప్రమాదకరమైనది. ఎరుపు, పసుపు, నలుపు రంగు చారలు దీని ప్రత్యేకత.
బ్యాండెడ్ సీ కరైట్ సముద్ర పాము
బ్యాండెడ్ సీ కరైట్ సముద్ర పాము ఇండో-పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇది ఎంత అందంగా ఉంటుందో, అంతే విషపూరితమైనదని నిపుణులు చెబుతుంటారు. దీని శరీరంపై నలుపు, తెలుపు రంగు చారలు ఉంటాయి.
సాన్ ఫ్రాన్సిస్కో గార్టర్ పాము
గార్టర్ పాము జాతి చాలా విలక్షణమైనది. సాన్ ఫ్రాన్సిస్కో గార్టర్ పాము అమెరికాలో చూడవచ్చు. అత్యంత అరుదైన పాము జాతులలో ఇది ఒకటి. ఇది దాని ప్రకాశవంతమైన చారలు, రంగులతో ఇతర పాముల కంటే భిన్నంగా కనిపిస్తుంది.
అరిజోనా కోరల్ పాము
ఈ పాము చూడటానికి సన్నగా కనిపించవచ్చు, కానీ దాని కాటు నిమిషాల్లో అత్యంత ప్రమాదకరం ప్రమాదకరం కావచ్చు. అరిజోనా కోరల్ పాము చాలా భయంకరమైనది, విషపూరితమైనది. దీని శరీరంపై ప్రాకాశవంతమైన ఎరుపు, నలుపు, పసుపు రంగు చారలు ఉంటాయి. అరిజోనా కోరల్ పాము అరిజోనా, మెక్సికో ప్రాంతాల్లో కనిపిస్తుంది.






















