San Rechal Gandhi Death: నలుపు అందం కాదన్న ప్రపంచంపై తిరుగుబాటు చేసిన సుందరి - 26 ఏళ్లకే ఆత్మహత్య - అసలేం జరిగింది ?
Popular model : పుదుచ్చేరికి చెందిన ప్రముఖ మోడల్ సాన్ రాచెల్ గాంధీ ఆత్మహత్య చేసుకున్నారు. నల్లగా ఉండే ఆమె.. నలుపు అందమేనని అందరికీ నిరూపించారు. ఎన్నో అందాల పోటీల్లో పాల్గొన్నారు.

San Rechal Gandhi Popular model and influencer dies by suicide at 26 : సాన్ రేచల్ గాంధీ అనే పుదుచ్చేరికి చెందిన ప్రముఖ మోడల్ , సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె వయసు 26 ఏళ్లు. ఆమె ఫ్యాషన్ ఇండస్ట్రీలో రంగు వివక్షతకు వ్యతిరేకంగా తన గళాన్ని బలంగా వినిపిస్తూ వచ్చారు.
నల్లగా ఉంటే రాచెల్ గాంధీ అందాల పోటీల్లో విస్తృతంగా పాల్గొనేవారు. అనేక చోట్ల విజయం సాధించారు కూడా. 2019లో మిస్ డార్క్ క్వీన్ తమిళనాడు, 2019లో మిస్ బెస్ట్ యాటిట్యూడ్, 2021లో మిస్ పుదుచ్చేరి, 2022 , 2023లో క్వీన్ ఆఫ్ మద్రాస్, 2023లో మిస్ ఆఫ్రికా గోల్డెన్ ఇండియాలో రన్నరప్ గా నిలిచారు. లండన్, జర్మనీ, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా వంటి దేశాలలో జరిగిన అంతర్జాతీయ బ్యూటీ పేజెంట్‌లలో పోటీపడ్డారు. 180,000 ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నారు. ఆమె రంగు వివక్షతకు వ్యతిరేకంగా పోరాడేవారు.
సాన్ రేచల్ భారతీయ ఫ్యాషన్ , సినిమా రంగాలలో "ఫెయిర్ స్కిన్" ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ, ముదురు చర్మం రంగు ఉన్నవారు, ముఖ్యంగా మహిళలు, ఎదుర్కొనే వివక్షపై బహిరంగంగా మాట్లాడారు. ఆమె తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి శరీరం ఏ రంగులో ఉన్నా స్వీకరించాలన్నారు. ఉద్భోధించేవారు. ఆమె గత కొన్ని నెలలుగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని.. తన కెరీర్ కోసం ఆమె ఆభరణాలను విక్రయించి, అప్పులు తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సాన్ రేచల్ తన చర్మం రంగు కారణంగా ఆన్‌లైన్‌లో ట్రోలింగ్‌కు గురయ్యారు. కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నారు.
సాన్ రేచల్ ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ను తన ప్రేరణగా భావించారు. ఆమె చిన్న వయస్సులో చర్మం రంగు కారణంగా ఎదుర్కొన్న సవాళ్లను అధిగమించి, ఆత్మవిశ్వాసంతో తన సహజ రంగును స్వీకరించారు. "8వ మరియు 9వ తరగతుల్లో నేను నా చర్మాన్ని తెల్లగా మార్చేందుకు వివిధ కాస్మెటిక్స్‌ను ప్రయత్నించాను, కానీ ఏదీ పని చేయలేదు. అప్పుడు నేను నన్ను ప్రశ్నించుకున్నాను, ‘నేను ఇలా ఎందుకు చేస్తున్నాను?’ క్రమంగా నా చర్మ రంగును స్వీకరించడం ప్రారంభించాను," అని ఆమె ఓ ఇంటర్యూలో చెప్పారు.
San Rechal Gandhi was not just a model but also a strong voice against colourism in the fashion industry.
— Shridhar V (@Shridhar_07) July 14, 2025
She won Miss Puducherry 2022 and even represented India at Miss Africa Golden 2023.
It’s so sad that she was battling financial stress and depression, and despite selling… pic.twitter.com/sl1OHTiRta
సాన్ రేచల్ జులై 5న అధిక మోతాదులో నిగ్ప మాత్రలు మింగారు. ఆమెను మొదట ఇందిరా గాంధీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు, తర్వాత మూలకులంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కు, చివరగా జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (JIPMER)కు తరలించారు. జులై 12న ఆమె మరణించారు. పోలీసులు ఆమె నివాసంలో ఒక సూసైడ్ నోట్‌ను స్వాధఈనం చేసుకున్నారు. ఇందులో ఆమె తన మరణానికి ఎవరినీ బాధ్యులను చేయవద్దని పేర్కొన్నారు. సాన్ రేచల్ 2024 జూన్‌లో పుదుచ్చేరిలోని ఝాన్సీ నగర్‌కు చెందిన సత్య అనే వ్యక్తిని రెండు కుటుంబాల అంగీకారంతో వివాహం చేసుకున్నారు.
సాన్ రేచల్ మరణం ఫ్యాషన్ , సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమయింది. ఆమె రంగు విషయంలో చూపించిన ఆత్మవిశ్వాసం ఇతర సమస్యల విషయంలోనూ చూపించాల్సిందని సానుభూతి వ్యక్తమవుతోంది.





















