అన్వేషించండి

Gold : ప్రపంచంలో అత్యధిక గోల్డ్ నిల్వలున్న దేశాల్లో భారత్‌ది ఎన్నో స్థానమో తెలుసా ? ప్రజల దగ్గర ఉన్నది కూడా కలిపితే ?

Gold Reserves : బంగారం అనే మాటకు ఎంతో విలువ ఉంది. బంగారానికీ ఉన్న విలువను బట్టే అది వచ్చింది. ఎంత ఎక్కువ బంగారం ఉంటే అంత రిచ్. మరి ప్రపంచంలో ఏ దేశం రిచ్చో తెలుసా ?

Which country owns the most gold in the world What is India Place : ప్రపంచంలో అత్యధిక దేశాలు విదేశీ మారకద్రవ్యాల రిజర్వులుగా పెట్టుకుంటాయి. ఎక్కువ దేశాలు డాలర్స్ రూపంలోనే ఇవి లెక్కలేసుకుంటాయి. కానీ అన్ని దేశాలు బంగారాన్ని వీలైనంత ఎక్కువగా  దాచి పెట్టుకుంటూ ఉంటాయి. సాధారణ కుటంబాలు ఎలాగో.. ప్రపంచంలోని అన్ని  దేశాలు అంతే. ఎందుకంటే. .. కరెన్సీ విలువ పడిపోతుందేమో కానీ బంగారం విలువ మాత్రం పడిపోదు. ప్రపంచంలో అత్యధిక బంగారం రిజర్వు ఉన్న దేశం సహజంగానే అమెరికా. ఎందుకంటే ఆ దేశం దగ్గర భారీగా డాలర్లు ఉంటాయి కాబట్టి దొరికినంత కొని దాచి పెట్టేసుకుంటున్నారు. ఇలా అమెరికా వద్ద 8966 టన్నుల బంగారం ఉంది. 

అమెరికా తర్వాత రెండో స్థానంలో అత్యధిక బంగారం రిజర్వులు ఉంచుకున్న దేశం జర్మనీ. అయితే ఆ దేశం వల్ల ఉన్నది 3696 టన్నులు మాత్రమే. అంటే.. మొదటి స్థానంలో ఉన్న అమెరికా కన్నా ఐదు వేల టన్నులు తక్కువ.ఈ లెక్క ప్రకారం చూస్తే అమెరికాను ఈ మధ్య కాలంలో ఎవరూ బీట్ చేయలేరు. అంత ఎక్కువగా అమెరికా వద్ద బంగారం ఉంది. ఇక మూడో స్థానంలో ఉన్నది దేశం కాదు.. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ప్రపంచదేశాలకు ఆర్థిక సాయం చేసే ఐఎంఎఫ్ వద్ద 3102 టన్నుల బంగారం రిజర్వ్ ఉంది. 

  సెలవుల్లో టూర్ వెళుతున్నారా, ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా, అది ఎందుకు ముఖ్యమో తెలుసా? 

ఇక నాలుగో స్థానంలో యూరోపియన్ కంట్రీ ఇటలీ ఉంది. ఈ దేశం వద్ద 2703 టన్నుల బంగారం ఉంది. ఐదో స్థానంలో ఉన్న ఫ్రాన్స్ వద్ద 2686 టన్నుల బంగారం ఉంది. ఆరో స్థానంలో రష్యా ఉంది. వ్లాదిమిర్ పుతిన్ తమ దేశ సంపదను బంగారంలోకి మార్చడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. రష్యా వద్ద 2568 టన్నుల బంగారం  ఉంది. మాములుగా అయితే చైనా ఇలాంటి అంశాల్లో చాలా ముందు ఉంటుంది. ఎందుకో కానీ బంగారం నిల్వల విషయంలో అమెరికాతో పోటీ పడలేకపోయింది. ఏడో స్థానంలో 2355 టన్నుల బంగారం మాత్రమే  ఉంచుకోగలిగింది. ఎనిమదో స్థానంలో స్విట్టర్ ల్యాండ్ 1146 టన్నుల బంగారం, తొమ్మిదో స్థానంలో ఉన్న జపాన్ వద్ద 993 టన్నుల బంగారం ఉంది. 

పెళ్లంటే 3 ముళ్లు, 7 అడుగులు మాత్రమే కాదు - అదో పెద్ద వ్యాపార కూడలి 

టాప్ 9లో భారత్ లేదు.. కానీ టాప్ టెన్‌లో ఉంది. అంటే.. పదో స్థానంలో భారత్ ఉంది . భారత్ వద్ద ఉన్న మొత్తం  బంగారం నిల్వలు 879 టన్నులు. అయితే ఈ పది ర్యాంకులు పూర్తిగా .. ప్రభుత్వాల వద్ద ఉన్న బంగారం రిజర్వుల గురించి మాత్రమే. ప్రజల వద్ద ఉన్న  బంగారం కాదు. ఆయా దేశాల్లో ప్రజలు బంగారం పెట్టుబడిగా పెడతారు. ఇండియన్స్ మాత్రం అదో సెంటిమెంట్ గా కొనుగోలు చేస్తూంటారు . అందుకే ప్రజల వద్ద ఉన్న బంగారాన్ని కూడా కలుపుకుంటే.. అమెరికా వద్ద ఉన్నంత బంగారం ఇండియాకు కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: హైద‌రాబాద్ సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చండి- కేంద్రానికి రేవంత్ రెడ్డి విన‌తి
హైద‌రాబాద్ సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చండి- కేంద్రానికి రేవంత్ రెడ్డి విన‌తి
AP Liquor Shops : ఏపీలో మద్యం దుకాణాల కోసం లేని స్పందన - రింగ్ అయిపోయారా ? రిస్క్ అనుకుంటున్నారా ?
ఏపీలో మద్యం దుకాణాల కోసం లేని స్పందన - రింగ్ అయిపోయారా ? రిస్క్ అనుకుంటున్నారా ?
Euphoria Glimpse: ‘యుఫోరియా’ గ్లింప్స్ వచ్చేసింది- సంథింగ్ డిఫరెంట్ గా గుణశేఖర్ కొత్త మూవీ
‘యుఫోరియా’ గ్లింప్స్ వచ్చేసింది- సంథింగ్ డిఫరెంట్ గా గుణశేఖర్ కొత్త మూవీ
Lost and Found Service: విమాన ప్రయాణంలో వస్తువులు మిస్సింగ్! ఆ మరిచిపోయిన ఐటెమ్స్‌ను ఇలా తిరిగి పొందవచ్చు
విమాన ప్రయాణంలో వస్తువులు మిస్సింగ్! ఆ మరిచిపోయిన ఐటెమ్స్‌ను ఇలా తిరిగి పొందవచ్చు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PM Modi Yogi Pawan Kalyan Hindutva Speech | హిందూత్వ నినాదంతో మోదీ,యోగి బాటలో పవన్ కళ్యాణ్ | ABPIndia vs Bangladesh T20 Match Result | టీ 20 మ్యాచ్‌లో బంగ్లాపై భారత్ విజయం | ABP DesamHardik Pandya No Look Shot Wins Internet | అదిరిపోయే షాట్ కొట్టిన పాండ్యా | ABP DesamExplosion Near Karachi Airport | కరాచీ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఆత్మాహుతి దాడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: హైద‌రాబాద్ సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చండి- కేంద్రానికి రేవంత్ రెడ్డి విన‌తి
హైద‌రాబాద్ సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చండి- కేంద్రానికి రేవంత్ రెడ్డి విన‌తి
AP Liquor Shops : ఏపీలో మద్యం దుకాణాల కోసం లేని స్పందన - రింగ్ అయిపోయారా ? రిస్క్ అనుకుంటున్నారా ?
ఏపీలో మద్యం దుకాణాల కోసం లేని స్పందన - రింగ్ అయిపోయారా ? రిస్క్ అనుకుంటున్నారా ?
Euphoria Glimpse: ‘యుఫోరియా’ గ్లింప్స్ వచ్చేసింది- సంథింగ్ డిఫరెంట్ గా గుణశేఖర్ కొత్త మూవీ
‘యుఫోరియా’ గ్లింప్స్ వచ్చేసింది- సంథింగ్ డిఫరెంట్ గా గుణశేఖర్ కొత్త మూవీ
Lost and Found Service: విమాన ప్రయాణంలో వస్తువులు మిస్సింగ్! ఆ మరిచిపోయిన ఐటెమ్స్‌ను ఇలా తిరిగి పొందవచ్చు
విమాన ప్రయాణంలో వస్తువులు మిస్సింగ్! ఆ మరిచిపోయిన ఐటెమ్స్‌ను ఇలా తిరిగి పొందవచ్చు
Israel Hamas War: యుద్ధం ఆపవద్దు, శత్రువులు కోలుకోని విధంగా నాశనం చేద్దాం: సైన్యానికి ఇజ్రాయెల్ ఐడీఎఫ్ చీఫ్ లేఖ
యుద్ధం ఆపవద్దు, శత్రువులు కోలుకోని విధంగా నాశనం చేద్దాం: సైన్యానికి ఇజ్రాయెల్ ఐడీఎఫ్ చీఫ్ లేఖ
Andhra University: అమ్మాయిలు డ్యాన్స్ చేయాలంటూ ర్యాగింగ్ - ఏయూలో 10 మంది సీనియర్ల సస్పెన్షన్
అమ్మాయిలు డ్యాన్స్ చేయాలంటూ ర్యాగింగ్ - ఏయూలో 10 మంది సీనియర్ల సస్పెన్షన్
Telangana News: 'ఆ వదంతులు నమ్మొద్దు' - ఫ్యామిలీ డిజిటల్ కార్డుల దరఖాస్తులపై ప్రభుత్వం కీలక ప్రకటన
'ఆ వదంతులు నమ్మొద్దు' - ఫ్యామిలీ డిజిటల్ కార్డుల దరఖాస్తులపై ప్రభుత్వం కీలక ప్రకటన
Chandrababu Delhi Tour : ప్రధాని మోదీతో గంట పాటు చంద్రబాబు భేటీ -  కీలక అంశాలపై చర్చలు
ప్రధాని మోదీతో గంట పాటు చంద్రబాబు భేటీ - కీలక అంశాలపై చర్చలు
Embed widget