Mohan Babu : పవన్ కల్యాణ్ విమర్శలకు మోహన్ బాబు ఆన్సర్ ఎప్పుడు? మాటలతోనా? చేతలతోనా ?
ఏపీ ప్రభుత్వంతో టాలీవుడ్‌కు ఉన్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఇప్పుడు మోహన్ బాబుపై పడింది. పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు చేతలతోనే రిప్లయ్ ఇవ్వాల్సి ఉంది.
రిపబ్లిక్ సినిమా ఫంక్షన్‌లో ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్.. మోహన్ బాబు ప్రస్తావన తీసుకు వచ్చారు. ఆయన ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అప్పుడు పదో తేదీ తర్వాత స్పందిస్తానని మోహన్ బాబు అన్నారు. అయితే ఆ చాలెంజ్ కోసం కాకపోయినా ఇప్పుడు కొత్తగా వచ్చి పడిన బాధ్యత మేరకు మోహన్ బాబు స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో టాలీవుడ్‌కు ఉన్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత మంచు విష్ణు, మోహన్ బాబుపై పడింది.
ఏపీలో సినీ పరిశ్రమకు ఎన్నో సమస్యలు !
"మా" ఎన్నికల వివాదం దాదాపుగా ముగిసిపోయింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ అస్త్రసన్యాసం చేసేసింది. ఇక వాళ్లంతా ఎవరి షూటింగ్‌లు వాళ్లు చేసుకుంటారు. అయితే గెలిచిన మంచు విష్ణుతో పాటు ఆయన తండ్రి మోహన్ బాబుపై ముందు ఓ పెద్ద సవాల్ ఉంది. అదే ఏపీ ప్రభుత్వంతో టాలీవుడ్‌కు ఉన్న సమస్యలను పరిష్కరించడం. కరోనా పరిస్థితుల వల్ల కుదేలైన సినీ పరిశ్రమ కోలుకునేందుకు తంటాలు పడుతోంది. తెలంగాణలో ఎలాంటి సమస్యలు లేవు. పాత తరహాలో తమ వ్యాపారం చేసుకోవడానికి అనుమతులు లభించాయి. అయితే ఆంధ్రలో మాత్రం ఇంకా పరిస్థితులు కుదుట పడలేదు. అక్కడ ప్రభుత్వ నిర్ణయాలు ఇండస్ట్రీని దెబ్బ మీద దెబ్బకొట్టేలా ఉన్నాయి. ఈ కారణంగానే కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వంతో టాలీవుడ్ నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు.
Also Read : రెండు వర్గాలుగా ఇక టాలీవుడ్ ! "మంచు"కు మందుంది అసలు పరీక్ష !
టిక్కెట్ రేట్స్ టు ఆన్ లైన్ టిక్కెటింగ్ !
ఆంధ్రలో ఇప్పటికీ నైట్ కర్ఫ్యూ కంటిన్యూ అవుతోంది. ఈ కారణంగా ధియేటర్లలో మూడు షోలు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. సీటింగ్ కెపాసిటీ కూడా యాభై శాతమే అనుమతి ఇస్తున్నారు. ఇక టిక్కెట్ రేట్లను వకీల్ సాబ్ సినిమా సమయంలోనే తగ్గించారు. వాటిని పెంచాలని అదే పనిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక ఆన్ లైన్ టిక్కెటింగ్‌ను తామే అడిగామని చెబుతున్నప్పటికీ.. ఇండస్ట్రీ వర్గాలు దానిపై అంత సుముఖంగా లేవనేది ఎక్కువ మంది నిర్మాతలు చెప్పేమాట. ఈ సమస్యలను ఇప్పటి వరకూ ఎవరూ పరిష్కరించలేకపోయారు. ఇప్పుడు ఈ సమస్యలు పరిష్కారమైతేనే టాలీవుడ్‌కు మళ్లీ కాస్తంత ఊరట లభిస్తుంది.లేకపోతే పెద్ద సినిమా విడుదలలు పోస్ట్ పోన్ అవుతూనే ఉంటాయి.
Also Read : ‘మా’ ఎన్నికల్లో ట్రాజెడీ సీన్లు.. బెనర్జీ కన్నీరు.. తనీష్ ఆవేదన!
ఇప్పటి వరకూ చిరంజీవి.. ఇక నుంచి మోహన్ బాబు !
సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో దఫదఫాలుగా చర్చలు జరిగాయి. కానీ ఫలితం లేదు. ఆ చర్చల ప్రక్రియలో ఏపీ ప్రభుత్వం చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దగా గుర్తించింది. మంత్రి పేర్ని నాని చిరంజీవికే ఫోన్ చేసి.. సమస్యలు చెప్పుకోవడానికి రావాలని సూచించారు. రెండు సార్లు చిరంజీవే టాలీవుడ్ తరపున గతంలో సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. మా ఎన్నికల్లో మంచువిష్ణు గెలిచారు. ఆయన తండ్రి మోహన్ బాబు స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత. తన బంధుత్వం, రాజకీయ సంబంధాలను ఉపయోగించుకుని అయినా సరే ప్రస్తుతం ఉన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తే.. మోహన్ బాబు పలుకుబడి మరింత పెరుగుతుందన్న అభిప్రాయం ఉంది.
Also Read : ‘మా’ పదవులకు ప్రకాష్ రాజ్ ప్యానల్ రాజీనామా .. ఇప్పటికిప్పుడు కొత్త సంఘం లేనట్లే !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి