News
News
X

లక్కీ లేడి, తన కారు నెంబర్లు చెప్పి రూ.43 లక్షలు గెలుచుకుంది - ఇదిగో ఇలా!

అమెరికాలో ఓ మహిళకు అదృష్టం అంటే ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది. పాత కారు నెంబర్ తో రూ. 40 లక్షల లాటరీ గెల్చుకుంది.

FOLLOW US: 

అదృష్టం ఎవరిని.. ఎప్పుడు పలకరిస్తుందో చెప్పడం కష్టం. కష్టాల్లో ఉన్న వారికి లంకె బిందెలు దొరికినట్లు.. మట్టి కోసం తవ్వితే గుప్త నిధులు కనిపించినట్లు.. లక్ అనేది ఒక్కొక్కరికి ఒక్కోసారి షేక్ హ్యాండ్ ఇస్తుంది. తాజాగా అమెరికాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఒక్క డాలర్ తో లాటరీ టికెట్ కొన్న మహిళకు రూ. 40 లక్షల రూపాయల లాటరీ తగిలింది. ఆ లాటరీ గెలిచేందుకు ఉపయోగపడ్డది మాత్రం తన పాత కారు నెంబర్ ప్లేట్. లాటరీ గెలవడానికి.. పాత నెంబర్ ప్లేట్ కు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..  

కారు నెంబర్ తో లాటరీ టికెట్ కొనుగోలు

అమెరికాలోని మేరీల్యాండ్‌లో 43 ఏండ్ల మహిళ నివసిస్తోంది. ఓ రోజు సరదాగా బయటకు వెళ్లింది. బాల్టిమోర్‌లోని ఫుడ్ స్టాప్ మినీ మార్ట్‌లో ఓ లాటరీ పోటీ నిర్వహించారు. ఇందులో ఆమె కూడా పాల్గొంది. ఈ లాటరీ పేరు పిక్ 5. అంటే ఈ లాటరీ టికెట్ 5 అంకెలతో ఉంటుంది. ఎవరికి నచ్చినట్లు వారు 5 అంకెలు చెప్పి లాటరీ టికెట్ తీసుకుంటున్నారు. ఏ నెంబర్ చెప్పాలా? అని ఈ మహిళ కొద్ది సేపు ఆలోచించింది. చివరకు ఓ నిర్ణయానికి వచ్చింది. తన పాత కారు నెంబర్ ప్లేట్ లోని ఐదు అంకెలు చెప్పి ఓ లాటరీ టికెట్ తీసుకుంది. తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంది.

అక్షరాలా 50 వేల డాలర్లు గెలిచిన మహిళ

కొద్ది రోజుల తర్వాత లాటరీ ఫలితాలు వచ్చాయి.  అనుకున్నట్లుగానే ఈ మహిళకు లాటరీ తగిలింది. అదీ ఏకంగా 50 వేల డాలర్లు. భారత కరెన్సీలో సుమారు రూ. 40 లక్షలు. ఒక్క డాలర్ తో కొనుగోలు చేసిన లాటరీ టికెట్ ఏకంగా 50 వేల డాలర్లు గెలవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసింది. తొలుత తాను లాటరీ గెలిచానని తెలుసుకుని ఆశ్చర్యపోయినట్లు వెల్లడించింది. వాస్తవానికి తాను ముందు ఈ విషయాన్నితాను నమ్మలేదని చెప్పింది. ఒకటికి రెండు సార్లు లాటరీ నెంబర్ పరిశీలించినట్లు చెప్పింది. తనే కాకుండా.. తన తల్లిని కూడా ఓసారి చెక్ చేయాలని చెప్పిందట. తను కూడా నిజమే అని చెప్పడంతో అప్పుడు నమ్మిందట. 

లాటరీ డబ్బుతో ఏం చేయబోతుందంటే?

లాటరీ టికెట్ తన జీవితాన్ని మార్చేయనుందని సంతోషం వ్యక్తం చేసింది. అయితే, ఆమె నెంబర్ ప్లేట్ అంకెలను చెప్పి లాటరీ గెలుచుకున్న తీరు గురించి తెలుసుకొని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. లాటరీ డబ్బులతో కొన్ని బిల్లులు చెల్లించాలని చెప్పింది. అటు తన కారుకు కొన్ని రిపేర్లు చేయించాలి అనుకుంటున్నట్లు వెల్లడించింది. మిగిలిన డబ్బుతో తన పిల్లలు, మనువడి వైద్య ఖర్చుల కోసం వాడుతానని తెలిపింది.

Also Read: కాఫీ డికాషన్‌ను వేస్ట్‌గా పడేయొద్దు, దానితో అద్భుతాలు చేయొచ్చు - ఇవిగో చిట్కాలు

Also Read: పోషకాల పవర్ హౌస్ కివీ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అసలు వదిలిపెట్టరు

Published at : 05 Sep 2022 06:01 PM (IST) Tags: lottery win US Woman Old Car Licence Number Lottery winner

సంబంధిత కథనాలు

Hyderabad News : దసరాకు సొంతూరు వెళ్తున్నారా? అయితే పోలీసుల సూచనలు మీకోసమే!

Hyderabad News : దసరాకు సొంతూరు వెళ్తున్నారా? అయితే పోలీసుల సూచనలు మీకోసమే!

Moola Nakshatra : రేపు బెజవాడ దుర్గమ్మను దర్శించుకోనున్న సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పణ

Moola Nakshatra : రేపు బెజవాడ దుర్గమ్మను దర్శించుకోనున్న సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పణ

Gandhi Jayanti 2022: శుక్రవారానికి గాంధీజీకి ఓ స్పెషల్ లింక్ ఉందట, ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడు ఆయనే

Gandhi Jayanti 2022: శుక్రవారానికి గాంధీజీకి ఓ స్పెషల్ లింక్ ఉందట, ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడు ఆయనే

మూలాన‌క్ష‌త్రంలో దేవి దర్శనానికి తరలి వస్తున్న భక్తులు- విజయవాడ వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు

మూలాన‌క్ష‌త్రంలో దేవి దర్శనానికి తరలి వస్తున్న భక్తులు- విజయవాడ వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు

Russia Ukraine War: మిస్టర్ పుతిన్ మీకు అర్థమవుతోందిగా, ఒక్క ఇంచును కూడా తాకనివ్వం - బైడెన్ ఘాటు వ్యాఖ్యలు

Russia Ukraine War: మిస్టర్ పుతిన్ మీకు అర్థమవుతోందిగా, ఒక్క ఇంచును కూడా తాకనివ్వం - బైడెన్ ఘాటు వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

KCR Warangal Tour: వరంగల్‌లో ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌‌ ప్రారంభించిన కేసీఆర్, అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యలు

KCR Warangal Tour: వరంగల్‌లో ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌‌ ప్రారంభించిన కేసీఆర్, అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యలు

Srikalahasti News : రెచ్చిపోయిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్, మహిళపై అమానుష దాడి!

Srikalahasti News : రెచ్చిపోయిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్, మహిళపై అమానుష దాడి!

IND W vs SL W T20: గెలుపుతో ఆసియా కప్‌ ప్రారంభించిన టీమిండియా - శ్రీలంక మహిళల జట్టుపై భారీ విజయం!

IND W vs SL W T20: గెలుపుతో ఆసియా కప్‌ ప్రారంభించిన టీమిండియా - శ్రీలంక మహిళల జట్టుపై భారీ విజయం!

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?