Microsoft Server Outage: మైక్రోసాఫ్ట్‌లో వచ్చిన సాంకేతిక సమస్య ఇదే, ఈ స్థాయిలో ప్రభావం పడింది అందుకే!
Crowdstrike: మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సమస్యతో ప్రపంచమంతా గందరగోళంలో పడిపోయింది. CrowdStrike సమస్య వల్లే ఇదంతా జరుగుతోందని ఆ కంపెనీ ప్రకటించింది.
What is Crowdstrike: మైక్రోసాఫ్ట్‌లో సాంకేతిక సమస్యపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. పలు సర్వీస్‌లు ఈ దెబ్బతో నిలిచిపోయాయి. ఉన్నట్టుండి పీసీలు, ల్యాప్‌టాప్‌లు రీస్టార్ట్ అవడంతో పాటు స్క్రీన్‌పై Blue Screen of Death' (BSOD) ఎర్రర్ మెసేజ్ కనిపిస్తోంది. దీనిపై ఎక్స్‌పర్ట్స్ కీలక విషయాలు వెల్లడించారు. CrowdStrike కంపెనీకి చెందిన Falcon Softwareలో సమస్య తలెత్తడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంత గందరగోళానికి తెర తీసిందని వివరించారు. CrowdStrike అనేది సైబర్ సెక్యూరిటీ కంపెనీ. ఏ నెట్‌వర్క్ అయినా సైబర్ దాడులకు గురి కాకుండా ఈ సంస్థ Falcon Sensorని తయారు చేసింది. అయితే..ఇప్పుడు ఇందులోనే బగ్ వచ్చింది. ఆ తరవాత వెంటనే స్క్రీన్‌పై బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపించింది. కొన్ని నెట్‌వర్క్‌లు మాత్రం ఈ సమస్య నుంచి తప్పించుకున్నాయి. పలు చోట్ల హాస్పిటల్స్‌తో పాటు బ్యాంకింగ్ సర్వీస్‌లకూ అంతరాయం కలిగింది. కేంద్రం కూడా దీనిపై స్పందించింది. త్వరలోనే పరిష్కారమవుతుందని స్పష్టం చేసింది.
BSOD అంటే..
ఈ సమస్య వచ్చినప్పుడు సిస్టమ్ పని చేయకుండా (What is BSOD) పోతుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇదో సర్వర్ ఇష్యూ. అప్పటి వరకూ మనం ఏదో పని చేసుకుంటూ ఉంటాం. ఆ డేటా అంతా ఒక్కసారిగా చెరిగిపోతుంది. సిస్టమ్ రీస్టార్ట్ అయిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే జరుగుతోంది. Microsoft 365తో పాటు Amazon Web Services, Azure ప్లాట్‌ఫామ్స్‌పైనా ప్రభావం పడింది. అయితే...ఈ సమస్యపై CrowdStrike కీలక ప్రకటన చేసింది. ఇంజనీర్‌లు సమస్యని పరిష్కరించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది. సిస్టమ్ డ్రైవర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లో సమస్యల కారణంగా ఈ BSOD సమస్య తలెత్తింది. ఈ గ్లిచ్ వచ్చినప్పుడు అప్లికేషన్స్ క్రాష్ అవుతాయి. విండోస్ బ్యాగ్రౌండ్‌లో రన్ అవుతున్నప్పటికీ మిగతా ఏదీ పని చేయదు.
Microsoft faces global outage: Indian Computer Emergency Response Team (CERT-In) issues advisory; says, "It has been reported that Windows hosts related to Crowd strike agent Falcon Sensor, are facing outages and getting crashed due to recent update received in the product. The… pic.twitter.com/jbNTusisVI
— ANI (@ANI) July 19, 2024
ఎలా సాల్వ్ చేయాలి..?
వీలైనంత త్వరగా ఈ సమస్యని పరిష్కరిస్తామని CrowdStrike సీఈవో ప్రకటించారు. అయితే...దీనికి ఓ మాన్యువల్ సొల్యూషన్ కూడా ఉందని ఎక్స్‌పర్ట్స్ వెల్లడించారు. CrowdStrike Windows 10 BSOD సమస్యని రిజాల్వ్ చేయాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలని సూచించారు.
1. విండోస్‌ని సేఫ్ మోడ్‌లో బూట్ చేయాలి. Boot Windows into Safe Mode or WRE.
2. C:WindowsSystem32driversCrowdStrike పాథ్‌లోకి వెళ్లాలి.
3. "C-00000291*.sys" లొకేట్ చేసి డిలీట్ చేయాలి.
4. ఆ తరవాత నార్మల్‌గా సిస్టమ్‌ని బూట్ చేయాలి.
Also Read: Microsoft Server Outage: మైక్రోసాఫ్ట్ దెబ్బకి ఈ సెక్టార్‌లు డౌన్, ఎక్కడ చూసినా గందరగోళమే