అన్వేషించండి

Falta ByPoll: ఫాల్టా ఉపఎన్నికలో చేతులెత్తేసిన తృణమూల్ అభ్యర్థి - పోలింగ్‌కు ముందే బీజేపీ విజయం

West Bengal Politics: బెంగాల్ ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గంలో మే 21న జరగాల్సిన రీ-పోలింగ్‌ ముందు టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ విస్మయానికి గురిచేశారు.

BJP Bengal Pushpa Vs Singham: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించి, సువేందు అధికారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్  కోటలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. ముఖ్యంగా అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితుడు, ఫాల్టా నియోజకవర్గ టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ అనూహ్య నిర్ణయం బెంగాల్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది.
 
ఏప్రిల్ 29న జరిగిన పోలింగ్‌లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ఎన్నికల సంఘం మొత్తం 285 కేంద్రాల్లో రీ-పోలింగ్‌కు ఆదేశించింది. అయితే, అనూహ్యంగా జహంగీర్ ఖాన్ మీడియా ముందుకు వచ్చి, తాము ఇక పోటీలో ఉండటం లేదని ప్రకటించడమే కాకుండా.. బీజేపీ ముఖ్యమంత్రి సువేందు అధికారిని ప్రశంసలతో ముంచెత్తారు.

 పుష్ప  తగ్గాడు.. సింగం  గెలిచింది! 
 
ఎన్నికల ప్రచార సమయంలో యూపీకి చెందిన ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మను ఉద్దేశించి  నేను పుష్పని.. తగ్గేదే లే  అంటూ జహంగీర్ ఖాన్ సవాల్ విసిరారు.  సింగం  వర్సెస్  పుష్ప గా సాగిన ఆ పోరులో చివరకు జహంగీర్ ఖాన్ తోకముడిచారు. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పది రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన, ఇప్పుడు తిరిగి వచ్చి పూర్తిగా తన వైఖరిని మార్చుకున్నారు. మన ముఖ్యమంత్రి సువేందు అధికారి ఫాల్టా అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నారు, ఆయన నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యం  అని చెప్పుకొస్తున్నారు. 

అభిషేక్ బెనర్జీకి గట్టి దెబ్బ 

ఫాల్టా నియోజకవర్గం టీఎంసీ సెకండ్ ఇన్ కమాండ్ అభిషేక్ బెనర్జీ పార్లమెంటు నియోజకవర్గమైన డైమండ్ హార్బర్ పరిధిలోకి వస్తుంది. అక్కడ తన అత్యంత నమ్మకస్తుడైన అభ్యర్థి ఇలా చివరి నిమిషంలో బీజేపీ సీఎంను పొగుడుతూ తప్పుకోవడం టీఎంసీకి కోలుకోలేని దెబ్బ. ముఖ్యమంత్రి సువేందు అధికారిని మన సీఎం  అని జహంగీర్ సంబోధించడం బెంగాల్‌లో టీఎంసీ పతనావస్థకు నిదర్శనమని  భావిస్తున్నారు. తన అభ్యర్థి ఎందుకు తప్పుకున్నాడో తమకు తెలియదని టీఎంసీ అధికార ప్రతినిధి అరూప్ చక్రవర్తి నీళ్ళు నమలడం చర్చనీయాంశంగా మారింది.  

 వలసల పర్వం మొదలైందా? 

బెంగాల్‌లో 15 ఏళ్ల టీఎంసీ పాలనకు చరమగీతం పాడుతూ బీజేపీ 200లకు పైగా సీట్లతో అధికారంలోకి రావడంతో, గతంలో  బాహుబలులు గా చలామణి అయిన టీఎంసీ నేతలు ఇప్పుడు తమ రాజకీయ అస్తిత్వం కోసం బీజేపీ వైపు చూస్తున్నారు. జహంగీర్ ఖాన్ నిర్ణయం కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం కాదని, రాబోయే రోజుల్లో మరికొంత మంది టీఎంసీ నేతలు సువేందు అధికారి నాయకత్వాన్ని బలపరిచే సంకేతంగా కనిపిస్తోంది.  పోలింగ్ ఏజెంట్లను కూడా పెట్టుకోలేని స్థితికి టీఎంసీ పడిపోయింది  అని సీఎం సువేందు అధికారి ఎద్దేవా చేశారు.
 
ఫాల్టాలో పోలింగ్ జరగకముందే బీజేపీ విజయం దాదాపు ఖాయమైపోయింది. బెంగాల్‌లో బీజేపీ వేవ్ ఏ స్థాయిలో ఉందో జహంగీర్ ఖాన్  యూ-టర్న్  స్పష్టం చేస్తోంది. ఒకప్పుడు అధికారాన్ని శాసించిన నాయకులు ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి వినమ్రంగా మారుతుండటం చూస్తుంటే.. బెంగాల్ రాజకీయం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగినట్లు కనిపిస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget