Weather Latest Update: తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం, నేడు ఉష్ణోగ్రతలు ఇలా
Telangana Weather: ఈ రోజు కింది స్థాయిలోని గాలులు దక్షిణ, నైరుతి దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Weather Latest News: ద్రోణి ఒకటి తూర్పు విదర్భ, పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు కింది స్థాయిలోని గాలులు దక్షిణ, నైరుతి దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 36 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో ఆగ్నేయ దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 35.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 21.2 డిగ్రీలుగా నమోదైంది. 74 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
Andhra Pradesh Weather: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో ఈశాన్య, ఆగ్నేయ దిశల్లో గాలులు వీస్తున్నాయని తెలిపారు. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్రలో వాతావరణం పొడిగానే ఉంటుందని అమరావతి వాతావరణ అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు పొగమంచు ఉంటుందని చెప్పారు. ఉత్తర కోస్తాంధ్రలో కూడా వాతావరణ పొడిగా ఉండనుంది. రాయలసీమలో కూడా వాతావరణం పొడిగానే ఉంటుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల ఉండే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాలో కూడా పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.