Weather Latest Update: మరో మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్! - ఐఎండీ హైదరాబాద్ అంచనా
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
Weather Latest News: ఈ రోజు కింది స్థాయిలోని గాలులు నైరుతి, పశ్చిమ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. కానీ, ఈనెల 23 నుంచి మాత్రం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 35 డిగ్రీలు, 20 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ, నైరుతి దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20.2 డిగ్రీలుగా నమోదైంది. 54 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
Andhra Pradesh Weather: ఉపరితల ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా సగటు సముద్రమట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో ఆగ్నేయ, నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయని తెలిపారు. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్రలో వాతావరణం పొడిగానే ఉంటుందని అమరావతి వాతావరణ అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు పొగమంచు ఉంటుందని చెప్పారు. ఉత్తర కోస్తాంధ్రలో కూడా వాతావరణం పొడిగా ఉండనుంది. రాయలసీమలో కూడా వాతావరణం పొడిగానే ఉంటుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల ఉండే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాలో కూడా పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.