Weather Latest Update: ఈ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్! విపరీతంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
Weather News: ఈ రోజు కింది స్థాయిలోని గాలులు తూర్పు దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
![Weather Latest Update: ఈ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్! విపరీతంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు Weather in Telangana Andhrapradesh Hyderabad on 21 December 2023 Winter updates latest news here Weather Latest Update: ఈ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్! విపరీతంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/20/e9701bbb6ceaffda462b89d7f2ba2ccd1703092169954234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Weather Latest News: తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. చలి విపరీతంగా పెరుగుతోంది. హైదరాబాద్ లో కూడా వాతావరణం చల్లగా ఉంటోంది. రాత్రివేళే కాకుండా పగలు కూడా చలిగాలులు వణికిస్తున్నాయి. రాగల రెండు, మూడు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.
ఈ రోజు కింది స్థాయిలోని గాలులు తూర్పు దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని కారణంగా ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో ఎలాంటి వాతావరణ హెచ్చరికలను జారీ చేయలేదు. ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు మాత్రం చలి విషయంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 16 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో తూర్పు, ఆగ్నేయ దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 27.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 15.7 డిగ్రీలుగా నమోదైంది. 58 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు గాలులు వీయనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా ఆంధ్రలో వాతావరణం పొడిగానే ఉండే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాంధ్రలో రేపు వాతావరణం పొడిగా ఉండగా.. రాయలసీమలో కూడా వర్షాలేమీ పడే అవకాశం లేదని తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)