అన్వేషించండి

Weather Latest Update: అధిక పీడనం వల్ల మరింత చలి - సంక్రాంతి వరకూ ఇంతే - ఐఎండీ

Weather News: ఈ రోజు కింది స్థాయిలోని గాలులు ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

Weather Latest News: తెలంగాణను ఆనుకొని అధిక పీడన ప్రాంతం ఉండడం వల్ల రాష్ట్రంలో చలి పెరుగుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు. తెలంగాణపైకి వీస్తున్న శీతల గాలుల వల్ల చలి తీవ్రత పెరుగుతూ ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాత్రివేళ చలి అధికంగా ఉంటుండగా.. పగలు కాస్త ఎండ తీక్షణంగానే ఉంటోంది. రాబోయే రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.

ఈ రోజు కింది స్థాయిలోని గాలులు ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని కారణంగా ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో ఈరోజు, రేపు కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో ఆదిలాబాద్, కుమ్రం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పొగమంచు అధికంగా ఉండనుంది. తెలంగాణలోని ఏ జిల్లాల్లోనూ నేడు ఎల్లో అలర్ట్ జారీ చేయలేదు.

Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో ఆగ్నేయ దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 28.1 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 18.5 డిగ్రీలుగా నమోదైంది. 78 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.

Andhra Pradesh Weather: ఈ ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, ఆగ్నేయ దిశల్లో గాలులు వీయనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తూర్పు, ఆగ్నేయ దిశల్లో గాలులు వీస్తున్నట్లు చెప్పారు. దక్షిణ కోస్తా ఆంధ్రలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు పొగమంచు ఉంటుందని చెప్పారు. ఉత్తర కోస్తాంధ్రలో రేపు వాతావరణం పొడిగా ఉండగా.. రాయలసీమలో కూడా వర్షాలేమీ పడే అవకాశం లేదని తెలిపారు. కానీ, పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల ఉండే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాలో కూడా పొగమంచు ఏర్పడే  అవకాశం ఉందని, తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

‘‘ఇప్పుడు ఆ అధిక పీడన ప్రాంతం తెలంగాణ రాష్ట్రాన్ని ఆనుకొని ఉంది. దీని వలన చలి తీవ్రత కాస్త పెరగనుంది. కానీ మరో వైపున కోస్తా ప్రాంతానికి బంగాళాఖాతంలో నుంచి తేమ గాలులు వీయటం వలన చలి తీవ్రత ఎక్కువగా ఉండదు. వెచ్చదనం అనేది కాస్త ఉంటుంది. మరో ఐదు రోజులు పెద్దగా చెప్పుకోదగ్గ వాతావరణ పరిస్థితులు కనబడటం లేదు’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

US New President Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌- 300లకుపైగా మెజారిటీ!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌- 300లకుపైగా మెజారిటీ!
Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
Telangana Survey: 75 ప్రశ్నలతో తెలంగాణలో ఇంటింట సమగ్ర సర్వే- సేకరించే వివరాలు ఇవే
75 ప్రశ్నలతో తెలంగాణలో ఇంటింట సమగ్ర సర్వే- సేకరించే వివరాలు ఇవే
AP DSC 2024: ఏపీలో నిరుద్యోగులకు షాక్, 'మెగా డీఎస్సీ' ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ, కారణమిదేనా!
ఏపీలో నిరుద్యోగులకు షాక్, 'మెగా డీఎస్సీ' ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ, కారణమిదేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాపై హత్యాయత్నం? ఆ ఖర్మ లేదు.. విజయమ్మ భావోద్వేగంIPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US New President Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌- 300లకుపైగా మెజారిటీ!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌- 300లకుపైగా మెజారిటీ!
Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
Telangana Survey: 75 ప్రశ్నలతో తెలంగాణలో ఇంటింట సమగ్ర సర్వే- సేకరించే వివరాలు ఇవే
75 ప్రశ్నలతో తెలంగాణలో ఇంటింట సమగ్ర సర్వే- సేకరించే వివరాలు ఇవే
AP DSC 2024: ఏపీలో నిరుద్యోగులకు షాక్, 'మెగా డీఎస్సీ' ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ, కారణమిదేనా!
ఏపీలో నిరుద్యోగులకు షాక్, 'మెగా డీఎస్సీ' ప్రకటనను వాయిదా వేసిన విద్యాశాఖ, కారణమిదేనా!
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Actress Kasthuri: తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
RRB: ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఒకటే గ్రామీణ బ్యాంక్‌ - స్పెషల్‌ కేస్‌గా తెలంగాణ
ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఒకటే గ్రామీణ బ్యాంక్‌ - స్పెషల్‌ కేస్‌గా తెలంగాణ
Embed widget