Weather Latest Update: నేడు ఏపీ, తెలంగాణలో పొడి వాతావరణమే: ఐఎండీ
Weather Updates: హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
Weather Latest News: ఈ రోజు కింది స్థాయిలోని గాలులు తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని కారణంగా ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం వుంది. తెలంగాణలో ఎలాంటి వాతావరణ హెచ్చరికలను జారీ చేయలేదు.
హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో తూర్పు, దక్షిణ దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 29.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 16.1 డిగ్రీలుగా నమోదైంది. 57 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం
ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు దిశల్లో గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల.. ఏపీలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.
Weather warning for Andhra Pradesh for next five days dated 11.12.2023 #IMD #APWeather #APforecast #MCAmaravati pic.twitter.com/RYpxU9J3tM
— MC Amaravati (@AmaravatiMc) December 11, 2023