అన్వేషించండి

Watch Video: మమతాకి మరోసారి తప్పిన ప్రమాదం,హెలికాప్టర్‌ ఎక్కుతూ కాలు జారి పడిపోయిన దీదీ

Watch Video: బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెలికాప్టర్ ఎక్కే క్రమంలో కాలు జారి కింద పడిపోయారు.

Bengal CM Mamata Injured: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి గాయపడ్డారు. దుర్గాపూర్‌లో హెలికాప్టర్ ఎక్కుతున్న సమయంలో ఆమె ఉన్నట్టుండి అదుపు తప్పి కింద పడిపోయారు. హెలికాప్టర్ మెట్లు ఎక్కి లోపలికి వెళ్లిన ఆమె...సీట్‌లో కూర్చునే క్రమంలోనే పట్టుతప్పి పడిపోయారు. అయితే..ఈ ఘటనలో ఆమెకి తీవ్ర గాయమేమీ అవ్వలేదని, ఆ తరవాత ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారని తెలుస్తోంది. 

ఏం జరిగింది..?

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మమతా బెనర్జీ దుర్గానగర్‌కి వెళ్లారు. అక్కడ సభ ముగిసిన తరవాత అక్కడి నుంచి మరో చోటకు వెళ్లాల్సి ఉంది. హెలికాప్టర్‌ అప్పటికే సిద్ధంగా ఉంది. వేగంగా నడుచుకుంటూ వచ్చిన దీదీ మెట్లు ఎక్కారు. లోపలి వరకూ బాగానే వెళ్లారు. అయితే..అక్కడ కుర్చీలో కూర్చునే సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా ఆమె తూలిపోయి కింద పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెని పైకి లేపారు. ఈ ఘటనలో ఆమెకి స్వల్ప గాయం అయినట్టుగా సమాచారం. ఆ తరవాత ఆమె షెడ్యూల్ ప్రకారం అసన్సోల్‌లోని సభకు హాజరయ్యేందుకు వెళ్లారు. ఇటీవలే ఆమె గాయపడి కోలుకున్నారు. కోల్‌కత్తాలోని ఆమె ఇంట్లోనే జారి పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆమె తలకి తీవ్ర గాయమైంది. రక్తం కారుతున్న ఫొటోలు, వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. వెంటనే హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందించారు. అంతకు ముందు 2023 జూన్‌లోనూ దీదీకి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. వాతావరణం అనుకూలంగా లేని కారణంగా హెలికాప్టర్‌ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అది ల్యాండ్ అయిన సమయంలోనే ఆమె కాలికి గాయమైంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Special Trains: ఓటు వేయడానికి వెళ్తున్నారా? టికెట్లు దొరకట్లేదా? ఈ స్పెషల్ ట్రైన్‌లో ట్రై చేయండి!
ఓటు వేయడానికి వెళ్తున్నారా? టికెట్లు దొరకట్లేదా? ఈ స్పెషల్ ట్రైన్‌లో ట్రై చేయండి!
Chandrababu Biopic : యూట్యూబ్‌లో దూసుకుపోతున్న చంద్రబాబు బయోపిక్ 'తెలుగోడు'
యూట్యూబ్‌లో దూసుకుపోతున్న చంద్రబాబు బయోపిక్ 'తెలుగోడు'
CM Jagan: లండన్ పర్యటనకు వెళ్లేందుకు సీఎం జగన్ పిటిషన్ - అనుమతి ఇవ్వొద్దంటూ సీబీఐ కౌంటర్, తీర్పు వాయిదా
లండన్ పర్యటనకు వెళ్లేందుకు సీఎం జగన్ పిటిషన్ - అనుమతి ఇవ్వొద్దంటూ సీబీఐ కౌంటర్, తీర్పు వాయిదా
Money Seized: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల టైం - లారీలో రూ.8.40 కోట్లు కాలేజీ బ్యాగ్ లో రూ.55 లక్షలు సీజ్, పోలీసుల విస్తృత తనిఖీలు
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల టైం - లారీలో రూ.8.40 కోట్లు కాలేజీ బ్యాగ్ లో రూ.55 లక్షలు సీజ్, పోలీసుల విస్తృత తనిఖీలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paripoornananda Swami | Hindupur MLA Candidate | పరిపూర్ణనందస్వామి హిందుపురాన్నే ఎందుకు ఎంచుకున్నారుPemmasani Chandrasekhar | Guntur MP Candidate | చంద్రబాబు ఆపినా కార్యకర్తలు ఆగేలా లేరు |ABP DesamPadma Vibhushan Chiranjeevi | రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డు తీసుకున్న చిరంజీవి |Sujana Chowdary Interview | నేను జనాల హృదయాల్లో లోకల్.. గెలిచేది నేనే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Special Trains: ఓటు వేయడానికి వెళ్తున్నారా? టికెట్లు దొరకట్లేదా? ఈ స్పెషల్ ట్రైన్‌లో ట్రై చేయండి!
ఓటు వేయడానికి వెళ్తున్నారా? టికెట్లు దొరకట్లేదా? ఈ స్పెషల్ ట్రైన్‌లో ట్రై చేయండి!
Chandrababu Biopic : యూట్యూబ్‌లో దూసుకుపోతున్న చంద్రబాబు బయోపిక్ 'తెలుగోడు'
యూట్యూబ్‌లో దూసుకుపోతున్న చంద్రబాబు బయోపిక్ 'తెలుగోడు'
CM Jagan: లండన్ పర్యటనకు వెళ్లేందుకు సీఎం జగన్ పిటిషన్ - అనుమతి ఇవ్వొద్దంటూ సీబీఐ కౌంటర్, తీర్పు వాయిదా
లండన్ పర్యటనకు వెళ్లేందుకు సీఎం జగన్ పిటిషన్ - అనుమతి ఇవ్వొద్దంటూ సీబీఐ కౌంటర్, తీర్పు వాయిదా
Money Seized: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల టైం - లారీలో రూ.8.40 కోట్లు కాలేజీ బ్యాగ్ లో రూ.55 లక్షలు సీజ్, పోలీసుల విస్తృత తనిఖీలు
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల టైం - లారీలో రూ.8.40 కోట్లు కాలేజీ బ్యాగ్ లో రూ.55 లక్షలు సీజ్, పోలీసుల విస్తృత తనిఖీలు
Hyderabad News: భాగ్యనగరంలో భారీ వర్షాలు - వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది మృత్యువాత
భాగ్యనగరంలో భారీ వర్షాలు - వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది మృత్యువాత
Liquor Shops closed: ఎలక్షన్‌ ఎఫెక్ట్‌- తెలంగాణలో 3 రోజులు మద్యం షాపులు బంద్‌
ఎలక్షన్‌ ఎఫెక్ట్‌- తెలంగాణలో 3 రోజులు మద్యం షాపులు బంద్‌
Vizag News: అదొకటే వ్యసనం- డబ్బులు పోతాయని తెలిసినా మానుకోలేను: ఏబీపీ దేశంతో ఆసక్తికర విషయాలు పంచుకున్న విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌
అదొకటే వ్యసనం- డబ్బులు పోతాయని తెలిసినా మానుకోలేను: ఏబీపీ దేశంతో ఆసక్తికర విషయాలు పంచుకున్న విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌
వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారిపై నిఘా, ఆఫీస్‌కి రాని ఉద్యోగులకు రెడ్‌ఫ్లాగ్ - డెల్‌ కంపెనీ కొత్త రూల్స్
వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారిపై నిఘా, ఆఫీస్‌కి రాని ఉద్యోగులకు రెడ్‌ఫ్లాగ్ - డెల్‌ కంపెనీ కొత్త రూల్స్
Embed widget