Love Proposal: అందరికీ తెలిసేలా ఎమ్మెల్యేకు ప్రపోజ్ చేసిన అమ్మాయి .. ఏం రిప్లై వచ్చిందో తెలుసా
ఓ అమ్మాయి.. ఎమ్మెల్యేకు ప్రపోజ్ చేసింది. డైరెక్ట్ గా కాదు.. ఇన్ డైరెక్ట్ గా చెప్పేసింది. ఎమ్మెల్యే కూడా రిప్లై ఇచ్చాడు.
![Love Proposal: అందరికీ తెలిసేలా ఎమ్మెల్యేకు ప్రపోజ్ చేసిన అమ్మాయి .. ఏం రిప్లై వచ్చిందో తెలుసా Want AAP MLA Raghav Not Free Electricity Women Tweets Raghav Chadha replies Love Proposal: అందరికీ తెలిసేలా ఎమ్మెల్యేకు ప్రపోజ్ చేసిన అమ్మాయి .. ఏం రిప్లై వచ్చిందో తెలుసా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/01/feccd40dd8abebea1811f31a075497d2_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పాలిటిక్స్ లో యంగ్ లీడర్లకు అమ్మాయిల ఫాలోయింగ్ తక్కువేమీ ఉండదు. తమకు ఇష్టమైన లీడర్ ఎక్కడ సభ పెట్టినా కొంతమంది వెళ్తుంటారు. ఇష్టమైన యువనేత స్పీచ్ విని తెగ సంబరపడిపోతుంటారు కొందరు అమ్మాయిలు. చాలామంది నేతలకు ఫాలోయింగ్ తో ప్రపోజల్స్ కూడా వస్తుంటాయి. ఢిల్లీ రాజీందర్ నగర్ నియోజకవర్గ ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చద్దాకు ఓ అమ్మాయి అందరికీ అర్థమయ్యేలా.. ప్రపోజ్ చేసింది. దానికి ఎమ్మెల్యే కూడా రిప్లై ఇచ్చాడు. కానీ కాస్త ఇంట్రస్టింగ్ గా..
ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ఎన్నికల కోసం రెడీ అవుతుంది. ఇందులో భాగంగానే.. ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. అధికారంలోకి వస్తే.. ఉచిత విద్యుత్ ఇస్తామన్న విషయాన్ని గుర్తు చేశాడు. దీనికి ఓ అమ్మాయి ఏమని చెప్పిందో తెలుసా? నాకు ఉచిత విద్యుత్ వద్దు... ఆ ఎమ్మెల్యే కావాలంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కాస్త.. ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లింది. ఎమ్మెల్యే కూడా కూల్ గా సమాధానం చెప్పారు.
అసలు ఏం జరిగిందంటే?
గురుదీప్ అనే వ్యక్తి ఉచిత విద్యుత్ హామీని మరోసారి గుర్తు చేస్తూ ట్వీట్ చేశాడు. ఈ విషయంపై కీర్తి ఠాకూర్ అనే అమ్మాయి.. 'నాకు రాఘవ్ కావాలి, విద్యుత్ కాదు' అని ట్వీట్ చేసి పరోక్షంగా ప్రపోజ్ చేసింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. 'నేను మేనిఫెస్టోలో లేను, ఫ్రీ కరెంట్ మాత్రమే ఉంది'.. అని రీ ట్వీట్ చేశారు.
రాఘవ్ చద్దాకు అమ్మాయిల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కిందటి ఎన్నికల్లో కూడా సోషల్ మీడియాలో ఆయనకు ప్రపోజల్స్ వచ్చాయి. ప్రస్తుతం పంజాబ్ ఎన్నికల కోసం రెడీ అవుతున్న ఎమ్మెల్యేకు మరోసారి ఇలా ఓ స్వీట్ మెమోరీ ఎదురైంది.
I'm not on the manifesto, but free electricity is.
— Raghav Chadha (@raghav_chadha) July 31, 2021
Vote for Kejriwal and I promise you’ll get free electricty, 24x7. Can’t commit the same about myself though :) https://t.co/F0tqLLp1FL
కేజ్రీవాల్ కు ఓటు వేస్తే.. 24 గంటలు ఉచిత కరెంట్ అందుతుందని.. హామీ ఇస్తున్నాని రాఘవ్ చద్దా చెప్పారు. కానీ తన విషయంలో ఎలాంటి కమిట్ మెంట్ ఇవ్వలేనని తెలిపారు. ఆ విషయాన్నే స్క్రీన్ షాట్ తీస ఇన్ స్టా లోనూ పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇస్తామని కేజ్రీవాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం వల్ల 80 శాతం కుటుంబాలకు లబ్ది జరుగుతుందని చెప్పారు. అంతేకాకుండా ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న అన్ని కరెంటు బిల్లులు మాఫీ చేస్తామని.. నిరంతర విద్యుత్ అందించే దిశంగా పని చేస్తామని ప్రకటించారు..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)