Visakha Steel Plant Privatization: స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా నేడే "ఉక్కు ప్రజా గర్జన "
Visakha Steel Plant Privatization: విశాఖ ఉక్కు నగరంలోని త్రిష్ణా గ్రౌండ్స్ లో ఈరోజు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా "ఉక్కు ప్రజా గర్జన" సభ నిర్వహించబోతున్నారు.
![Visakha Steel Plant Privatization: స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా నేడే Visakha Steel Plant Privatization Today Ukku Praja Garjana Conducted in Vizag Thrishna Grounds Visakha Steel Plant Privatization: స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా నేడే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/30/1050d55646a9a87a8d8b78d1d9f29bab1675049418345519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Visakha Steel Plant Privatization: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత రెండేళ్లుగా పోరాటం చేస్తున్న విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ సోమవారం(ఈరోజు) మరో కీలక కార్యక్రమం చేపట్టారు. మధ్యాహ్నం 3 గంటలకు ఉక్కు నగరంలోని త్రిష్ణ మైదానంలో "ఉక్కు ప్రజా గర్జన" పేరుతో భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు అన్ని పార్టీల నుంచి ముఖ్యమైన నేతలు హాజరుకానున్నట్లు కమిటీ సభ్యులు చెబుతున్నారు. 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వమని.. స్థానికంగా ఉన్న కార్మికులు, ఉద్యోగులు, మేధావులు కుటుంబాలతో సహా ఈ భారీ సభకు వచ్చి తమ పోరాటానికి మద్దతు పలకాలని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపునిచ్చింది.
"ఉక్కు ప్రజాగర్జన" సభకు హాజరవుతున్న నేతలు వీర
- వైసీపీ నుంచి వైవీ సుబ్బారెడ్డి, గుడివాడ అమర్ నాథ్
- టీడీపీ నుంచి రామ్ మోహన్ నాయుడు
- జనసేన నుంచి నాదెండ్ల మనోహర్
- కాంగ్రెస్ నుంచి పీ రాకేష్ రెడ్డి
- సీపీఐ నుంచి కె.రామకృష్ణ
- సీపీఎం నుంచి శ్రీనవాసరావు
- సీపీఐ (న్యూ డెమోక్రసీ) నుంచి కె. వెంకటేశ్వర్లు
- బీఎస్పీ నుంచి సత్యనారాయణ
- ఆర్పీఐ నుంచి బొడ్డు కళ్యాణ్ లతో పాటు బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ, ఎం.సీపీఐ పార్టీల ప్రతినిధులు ఈ సభకు హాజరు కానున్నారు. వీరితో పాటు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి కొణతాల లక్ష్మీ నారాయణ కూడా ఈ "ఉక్కు ప్రజా గర్జన "సభలో పాలు పంచుకుంటున్నట్టు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ప్రతినిధులు తెలిపారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం దానికి ఉన్న భూములే అంటారు ఇక్కడి కార్మికులు. ప్లాంట్ విస్తరణ, భవనాల నిర్మాణం పోగా ఇంకా 8 వేల ఎకరాల భూమి స్టీల్ ప్లాంట్‌ది ఖాళీగా ఉంది. దాన్ని చేజిక్కించుకునేందుకే ప్రైవేటు కంపెనీలు స్టీల్ ప్లాంట్ పై కన్నేసాయనేది వారి వాదన. వీటి విలువ దాదాపు లక్ష కోట్ల వరకూ ఉండడంతో వాటిపై ఆధిపత్యం కోసమే ఈ కుట్ర జరుగుతుంది అంటారు వాళ్ళు. విచిత్రంగా ఇప్పుడు కేంద్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను అమ్మాలని చూస్తున్న పోస్కో కంపెనీ గతంలో ఒడిశాలో ప్లాంట్ కోసం ప్రయత్నిస్తే ప్రాజాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మరి అదే కంపెనీకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎలా అప్పగిస్తారని కేంద్రాన్ని అడిగితే మాత్రం జవాబు లేదని ఉద్యోగ కార్మిక సంఘాలు అంటున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)