అన్వేషించండి

Breaking News Live: ఎల్లుండి నెల్లూరులో సీఎం జగన్ పర్యటన

AP Telangana Breaking News Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

LIVE

Key Events
Breaking News Live: ఎల్లుండి నెల్లూరులో సీఎం జగన్ పర్యటన

Background

AP Telangana Breaking News Live Updates: రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. సాగర నగరం విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ (South Coatal Railway Zone), వాల్తేరు డివిజన్‌ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ప్రత్యేక జోన్‌ ఏర్పాటుకు సంబంధించిన సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లో పేర్కొన్న సూచనలు, సలహాల పరిశీలన కోసం సీనియర్‌ అధికారులతో గతంలో కమిటీ వేశారు. 

రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఇలా బదులిచ్చారు. ‘దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ (విశాఖ రైల్వే జోన్)కు డీపీఆర్‌ సమర్పించాక కొత్త రైల్వేజోన్‌, రాయగడ రైల్వే డివిజన్‌ ఏర్పాటుకు పరిధి, ఇతర అంశాలు మా దృష్టికి వచ్చాయి. ఈ అంశాలను పరిశీలించడానికి సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ గ్రేడ్‌ లెవెల్‌ కమిటీని ఏర్పాటు చేశాం. కొత్త రైల్వేజోన్‌, రాయగడ డివిజన్‌ ఏర్పాటుకోసం 2020-21 బడ్జెట్‌లో రూ.170 కోట్లు కేటాయించినట్లు’ వివరించారు. ప్రత్యేక రైల్వేజోన్‌ను ఏర్పాటు చేసేందుకు విశాఖలో భవనాలు సిద్ధంగా ఉన్నాయి. మొదటగా ఇక్కడ కార్యకలాపాలు మొదలుపెట్టి, క్రమంగా అవసరమయ్యే నూతన భవనాల్ని నిర్మించుకోవాలని డీపీఆర్‌లో సూచించారు. ఈ దక్షిణ కోస్తా జోన్‌ ఏర్పడాలంటే రాయగడ డివిజన్‌ కూడా ఏర్పాటు కావాలి. కానీ అక్కడ ఎలాంటి మౌలిక వసతులు లేకపోవడంతో దానిపై ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్‌లో ఇంధన ధరలు వాహనదారులకు మళ్లీ షాకిచ్చాయి. గత మూడు నెలలుగానిలకడగా ఉన్న ఇంధన ధరలు ఇక్కడ గత మూడు రోజులుగా పెరుగుతూ జీవితకాల గరిష్టానికి చేరుకున్నాయి. 0.91 పైసలు పెరగడంతో నేడు హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర (Petrol Price Today 26th March 2022) రూ.110.91 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.24 కు చేరింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధరలు పెరగడంతో భారత్‌లో ప్రభావం చూపుతోంది. ఢిల్లీ గత డిసెంబర్ తొలి వారం నుంచి పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద స్థిరంగా ఉన్నాయి. 

విజయవాడలో పెట్రోల్‌ (Petrol Price in Vijayawada 26th March 2022)పై 34 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.112719 కాగా, ఇక్కడ డీజిల్ పై 34 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.98.70 అయింది. విశాఖపట్నంలో ఇంధన ధరలు స్వల్పంగా పెరిగాయి. 18 పైసలు తగ్గడంతో విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.68 అయింది. డీజిల్‌పై 18 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.97.69గా ఉంది. చిత్తూరులో పెట్రోల్‌ పై 18 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.113.24కి పతనమైంది. డీజిల్ పై 19 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.99.14 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. 

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గరిష్ట ధరలకు చేరుకుంటున్నాయి. తాజాగా బంగారం ధర రూ.280 మేర పెరగడంతో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,200కు చేరింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.52,590 అయింది. వెండి ధర రూ.1000 పెరగడంతో హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.73,800 కు ఎగబాకింది.

ఏపీలో బంగారం ధర.. (Gold Rate In Andhra Pradesh)
ఏపీ మార్కెట్లోనూ వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. నేడు రూ.280 మేర పెరగడంతో విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 26th March 2022)  10 గ్రాముల ధర రూ.52,590 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,200కు పుంజుకుంది. రూ.1000 పెరగడంతో విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.73,800 అయింది.

22:13 PM (IST)  •  26 Mar 2022

ఎల్లుండి నెల్లూరులో సీఎం జగన్ పర్యటన

ఈ నెల 28న (సోమవారం) నెల్లూరులో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప సభలో సీఎం పాల్గొంటారు. ఉదయం 10.15 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి 11.30 గంటలకు నెల్లూరు చేరుకోనున్న సీఎం. గొలగమూడి వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనున్న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప సభలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 

 

19:13 PM (IST)  •  26 Mar 2022

హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం, 40 లక్షల ఆస్తి నష్టం 

హైదరాబాద్  పాతబస్తీ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మదీనా సమీపంలోని చెత్త బజార్ లో అగ్ని ప్రమాదం జరిగింది. బారా లైన్ గల్లిలోని చెప్పుల గోదాంలో మంటలు చెలరేగాయి. ఎస్ఎస్ ఫుట్ వేర్ చెప్పుల  గోదాంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఫుట్ వేర్ కాలిబూడిదైంది. దాదాపు 40 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. రంజాన్ మాసం సమీపిస్తుండడంతో ఇటీవలే ఫుట్ వేర్ లోడ్ తెప్పించారు. మంటలను ఫైర్ సిబ్బంది అదుపుచేశారు.  ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అగ్ని మాపక సిబ్బంది తెలిపారు. 

17:39 PM (IST)  •  26 Mar 2022

శ్రీవారి ధర్మరథం బస్సులో చెలరేగిన మంటలు

తిరుమల రెండో ఘాట్ రోడ్డులో శ్రీవారి ధర్మరథం బస్సులో మంటలు చెలరేగాయి. శ్రీవారి సేవకులతో తిరుపతి నుంచి తిరుమలకు ఉచిత బస్సు బయల్దేరింది. మొదటి మలుపు వద్ద బస్సులోని డీజల్ లీక్ అవడంతో బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితం బయటపడ్డారు.  బస్సులో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.    

13:09 PM (IST)  •  26 Mar 2022

Tirumala Road Accident: తిరుమలలో టెంపో ట్రావెలర్, ఆర్టీసీ బస్సు ఢీ - 9 మందికి గాయాలు

Tirumala Road Accident:  తిరుపతి : తిరుమలలోని శ్రీవారి పాదాలు ఘాట్ రోడ్డులో పెనుప్రమాదం తప్పింది.. శ్రీవారి పాదాల వద్దకు వెళ్తున్న టెంపో ట్రావెలర్ ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో టెంపో ట్రావెలర్ ముందుభాగం నుజ్జు నుజ్జు అయింది.. టెంపో ట్రావెలర్ లో ప్రయాణం చేస్తున్న ఇద్దరు డ్రైవర్ తో సహా 9 మంది ప్రయాణికులకు గాయాలు కాగా.. క్షతగాత్రులను తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు.. ఎతైన ఘాట్ సెక్షన్ కావడం, అందులోనూ సింగల్ రోడ్డులో ప్రయాణం సాగించాల్సిన నేపథ్యంలో మలుపు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు గమయించక ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. గంత రెండు నెలలుగా శ్రీవారి పాదాలకు మొదటి సారి ఆర్టీసీ బస్సులను కేటాయించారు. 

12:56 PM (IST)  •  26 Mar 2022

బీర్భూమ్ హింస కేసులో 21 మంది నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు: CBI

పశ్చిమ బెంగాల్ బీర్భూమ్ హింస కేసులో సెక్షన్ 147, 148, 149 మరియు ఇతర సెక్షన్ల కింద 21 మంది నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు సీబీఐ పేర్కొంది.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Harish Rao: బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
Crime News: రాంలీలా ప్రదర్శనలో రాముడి పాత్ర - వేదికపైనే కుప్పకూలిన వ్యక్తి, ఢిల్లీలో తీవ్ర విషాదం
రాంలీలా ప్రదర్శనలో రాముడి పాత్ర - వేదికపైనే కుప్పకూలిన వ్యక్తి, ఢిల్లీలో తీవ్ర విషాదం
Punganuru Child Murder: వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Siyaram Baba Viral Video 188 Years | 188ఏళ్ల సాధువు అంటూ వైరల్ అవుతున్న వీడియో | ABP DesamRK Roja on CM Chandrababu | పుంగనూరు బాలిక కిడ్నాప్, హత్య కేసుపై మాజీ మంత్రి ఆర్కే రోజా | ABP DesamTirumala Bramhotsavam Simha vahanam | యోగ నారసింహుడి అలంకారంలో తిరుమల శ్రీవారు | ABP DesamPrakash Raj Counters Pawan Kalyan | తమిళనాడులో పవన్ కళ్యాణ్ పరువు తీసిన ప్రకాశ్ రాజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Harish Rao: బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
Crime News: రాంలీలా ప్రదర్శనలో రాముడి పాత్ర - వేదికపైనే కుప్పకూలిన వ్యక్తి, ఢిల్లీలో తీవ్ర విషాదం
రాంలీలా ప్రదర్శనలో రాముడి పాత్ర - వేదికపైనే కుప్పకూలిన వ్యక్తి, ఢిల్లీలో తీవ్ర విషాదం
Punganuru Child Murder: వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
Hyderabad News: భార్యలతో జర జాగ్రత్త - వీపు రుద్దమన్నందుకు భర్తను భార్య ఏం చేసిందంటే?
భార్యలతో జర జాగ్రత్త - వీపు రుద్దమన్నందుకు భర్తను భార్య ఏం చేసిందంటే?
Drugs Seized: మధ్యప్రదేశ్‌లో డ్రగ్స్ కలకలం - రూ.1,800 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం
మధ్యప్రదేశ్‌లో డ్రగ్స్ కలకలం - రూ.1,800 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం
Jani Master: జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు రద్దుపై స్పందించిన ఆట సందీప్
జానీ మాస్టర్ కు పెరుగుతున్న మద్దతు, నేషనల్ అవార్డు రద్దుపై స్పందించిన ఆట సందీప్
Pawan Kalyan: 3 నెలలుగా జీతాలు వస్తలేవు, పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఆయన శాఖల ఉద్యోగులు
3 నెలలుగా జీతాలు వస్తలేవు, పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఆయన శాఖల ఉద్యోగులు
Embed widget