అన్వేషించండి

Pawan Kalyan: 3 నెలలుగా జీతాలు వస్తలేవు, పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఆయన శాఖల ఉద్యోగులు

Andhra Pradesh News | పవన్ కళ్యాణ్ కు సంబంధించిన శాఖల ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు రావడం, పైగా జాబ్ సెక్యూరిటీ కూడా లేదని ఆర్.డబ్ల్యూ.ఎస్ శాఖల ఉద్యోగులు డిప్యూసీ సీఎంను కలిశారు.

AP RWS Employees meets Pawan Kalyan for pending salaries | మంగళగిరి: తమకు మూడు నెలలుగా జీతాలు రావడం లేదని సంబంధిత శాఖల ఉద్యోగులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తమకు జీతాలు రావడం లేదని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, RWS శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.

గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పని చేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ లేబరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ను కలిసి తమకు 3 నెలలుగా జీతాలు రావడం లేదని,  తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని వాపోయారు. ఎలాగైనా తమకు ఉద్యోగ భద్రత కల్పించకపోతే, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని మంత్రికి విజ్ఞప్తి చేశారు. పెండింగ్ జీతాలు క్లియర్ చేయాలని అధికారులను ఆదేశిస్తానని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ వారికి హామీ ఇచ్చారు.

Pawan Kalyan: 3 నెలలుగా జీతాలు వస్తలేవు, పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఆయన శాఖల ఉద్యోగులు

నా ఉద్యోగం నాకు తిరిగి ఇప్పించండి సార్...
తనకు ఉద్యోగం తిరిగి ఇప్పించి ఆదుకోవాలాలని ఓ దివ్యాంగురాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి విజ్ఞప్తి చేసింది. కడప జిల్లా కమలాపురం ల్యాబ్ లో గత 10 ఏళ్లు జి.సుజన కుమారి అనే దివ్యాంగురాలు హెల్పర్ గా పని చేస్తున్నారు. అయితే తనను 3 నెలల కిందట విధులు నుంచి తొలగించారని పవన్ కళ్యాణ్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పుట్టుకతో ఒక కిడ్నీ లేదని, బరువులను ఎత్తే పనులు సైతం చేయకూడదని డిప్యూటీ సీఎం పవన్ కు తెలిపారు. కనుక బతకడానికి ఏ ఆధారం లేని తనకు తిరిగి ఉద్యోగం ఇప్పించాలని ఈ సందర్భంగా సుజన కుమారి వేడుకున్నారు. వెంటనే స్పందించి ఆయన అధికారులతో ఈ విషయమై మాట్లాడతానని ఆమెకు భరోసా ఇచ్చారు. 
Also Read: Prakash Raj: డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్

సూపర్ సిక్స్ ను డైవర్ట్ చేయడానికి లడ్డూ పాలిటిక్స్ అని వైసీపీ ఫైర్

కాగా, సనాతన ధర్మం అంటూ రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ముందు తమకు ఓట్లు వేసి గెలిపించిన ఏపీ ప్రజల హామీలు నెరవేర్చాలని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. తనకు సంబంధించిన శాఖల ఉద్యోగులకు ఏం సమస్యలు ఉన్నాయో కూడా మూడు నెలలైనా తెలుసుకోలేకపోయారని, పైగా వంద రోజుల కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోవడాన్ని తిరుమల లడ్డూ వివాదంతో డైవర్షన్ చేయాలని చూస్తున్నారని విమర్శించారు. గ్రామాల్లో సమస్యలు, పర్యావరణంపై ప్రేమతో, అట్టడుగు వర్గాల వారిని నేరుగా కలసి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఏ వర్గానికి సాయం చేయడానికి ప్రయత్నాలు కూడా మొదలుపెట్టలేదంటూ వైసీపీ నేతలు, మాజీ మంత్రులు మండిపడుతున్నారు. అధికారం కోసం మహిళలకు నెలకు నగదు, ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15000 ఇలా సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ఇప్పుడు సనాతన ధర్మం, తిరుమల లడ్డూ అంటూ కాలయాపన చేస్తున్నారని వైసీపీ క్యాడర్ పోరాటానికి సిద్ధం కావాలని ఆ పార్టీ అధినేత జగన్ ఇదివరకే నేతలకు దిశానిర్దేశం చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Inter Results 2025: నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు, విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు, విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
Vanajeevi Ramaiah Passes Away: పద్మశ్రీ గ్రహీత, వనజీవి రామయ్య కన్నుమూత- అరుదైన వ్యక్తిగా గుర్తింపు
Vanajeevi Ramaiah Passes Away: పద్మశ్రీ గ్రహీత, వనజీవి రామయ్య కన్నుమూత- అరుదైన వ్యక్తిగా గుర్తింపు
Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs KKR Match Highlights IPL 2025 | చెన్నై పై 8వికెట్ల తేడాతో కేకేఆర్ గ్రాండ్ విక్టరీ | ABP DesamCSK vs KKR Match Preview IPL 2025 | KKR తో మ్యాచ్ నుంచి CSK కెప్టెన్ గా ధోని | ABP DesamRCB Home Ground Sad Story IPL 2025 | సొంత మైదానంలోనే ఆర్సీబీకి షాకులుKL Rahul 93* vs RCB IPL 2025 | కేఎల్ రాహుల్ మాస్ ఇన్నింగ్స్ కు అసలు రీజన్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Inter Results 2025: నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు, విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు, విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
Vanajeevi Ramaiah Passes Away: పద్మశ్రీ గ్రహీత, వనజీవి రామయ్య కన్నుమూత- అరుదైన వ్యక్తిగా గుర్తింపు
Vanajeevi Ramaiah Passes Away: పద్మశ్రీ గ్రహీత, వనజీవి రామయ్య కన్నుమూత- అరుదైన వ్యక్తిగా గుర్తింపు
Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
Telugu TV Movies Today: చిరంజీవి ‘శ్రీ మంజునాథ’, బాలయ్య ‘నరసింహా నాయుడు’ to ప్రభాస్ ‘సలార్’, అల్లు అర్జున్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వరకు - ఈ శనివారం (ఏప్రిల్ 12) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
చిరంజీవి ‘శ్రీ మంజునాథ’, బాలయ్య ‘నరసింహా నాయుడు’ to ప్రభాస్ ‘సలార్’, అల్లు అర్జున్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వరకు - ఈ శనివారం (ఏప్రిల్ 12) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
HCA : ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
ఐపీఎల్ టిక్కెట్ల గోల్‌మాల్ - పోలీసులకే ఇస్తున్నామని ప్రచారం - విజిలెన్స్ డీజీ లెక్క తేల్చేశారా ?
 IPL 2025 KKR VS CSK Result Update: సీఎస్కే ఘోర పరాభవం.. 8 వికెట్లతో కేకేఆర్ చేతిలో చిత్తు.. సునీల్ నరైన్ ఆల్ రౌండ్ షో
సీఎస్కే ఘోర పరాభవం.. 8 వికెట్లతో కేకేఆర్ చేతిలో చిత్తు.. సునీల్ నరైన్ ఆల్ రౌండ్ షో
AP Intermediate Results 2025: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలు వాట్సాప్‌లో ఎలా తెలుసుకోవాలి?
ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలు వాట్సాప్‌లో ఎలా తెలుసుకోవాలి?
Embed widget