Jani Master: జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు రద్దుపై స్పందించిన ఆట సందీప్
Jani Master National Award: జానీ మాస్టర్ కు జాతీయ అవార్డును రద్దు చేయడం చాలా బాధించిందని ప్రముఖ కొరియో గ్రాఫర్ ఆట సందీప్ అన్నారు. ఈ మేరకు తన భార్యతో కలిసి ఇన్ స్టాలో ఒక వీడియోను రిలీజ్ చేశారు.
Jani Master Case : టాలీవుడ్ స్టార్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ కు ఊహించని షాక్ తగిలింది. లేడీ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జానీ మాస్టర్ మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అవార్డుల కమిటీ పేర్కొంది. తిరుచిట్రంబలం (తెలుగులో తిరు) చిత్రానికి గానూ జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు వచ్చింది.
ఈనెల 8న ఢిల్లీలో జానీ మాస్టర్ ఈ అవార్డు అందుకోవాల్సి ఉంది. ఇందుకోసమే జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ కూడా మంజూరైంది అయితే ప్రస్తుతం అవార్డు రద్దుతో జానీ మధ్యంతర బెయిల్ కూడా సందిగ్ధంలో పడింది. కాగా జానీ మాస్టర్ కు జాతీయ అవార్డును రద్దు చేయడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలా అవార్డు రద్దు చేయడం సరికాదని పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జానీ మాస్టర్ కు జాతీయ అవార్డును రద్దు చేయడం చాలా బాధించిందని ప్రముఖ కొరియో గ్రాఫర్ ఆట సందీప్ అన్నారు. ఈ మేరకు తన భార్యతో కలిసి ఇన్ స్టాలో ఒక వీడియోను రిలీజ్ చేశారు.
అస్సలు కరెక్ట్ కాదు
ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘‘హలో అండి, ఈ రోజు మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో పోస్టులు చూస్తున్నాను. జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు క్యాన్సిల్ అయిందని .. చూడగానే చాలా బాధగా అనిపించింది. అయితే ఈరోజు వరకు కూడా జానీ మాస్టర్ విషయంలో మాట్లాడపోవడానికి కారణం.. ఇది ఒక ఆడపిల్ల విషయం. ఒక సెన్సిటివ్ విషయం. ఏదైనా వాళ్లకు వాళ్లకు మధ్య ఉండొచ్చు. దాని మీద జానీ మాస్టర్ లీగల్ గా ప్రొసీడవుతున్నారు. బట్ ఈ రోజు జానీ మాస్టర్ నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేసే రేంజ్ కు వెళ్లిపోయింది సిచ్యుయేషన్ అంటే చాలా చాలా బాధపడుతున్నాను.
ఒక డ్యాన్స్ మాస్టర్ గా నాకు తెలుసు.. డ్యాన్స్ మాస్టర్లు ఎంత కష్టపడుతారో.. ఒక సినిమా ఒప్పుకున్న తర్వాత ఆ సినిమా హిట్ అయ్యి.. డ్యాన్స్ మాస్టర్ స్టెప్స్ హిట్ అయితేనే ఆయనకు ఓ లైఫ్ వస్తుంది. ఈ రోజు ఆయన ఎంత కష్టపడి ఉంటే జానీ మాస్టర్ నేషనల్ లెవల్ కు వెళ్లి ఉంటారు. కరెక్ట్ గా నోటి కాడి దాన్ని కాలుతో తన్నేశారు. ఇది కరెక్ట్ కాదు చాలా తప్పు. ఎవరైతే అమ్మాయి ఉన్నదో అమ్మాయిని నేను కూడా పిలిచాను. తర్వాత చాలా ఈ వెంట్లకు కూడా పిలిచాము. నేను రాలేను మాస్టర్ జానీ మాస్టర్ వద్దనే చేస్తానని చెప్పింది. ఒక వేళ అంత ఇబ్బందులు ఉన్న అమ్మాయి అలాంటి మాస్టర్ దగ్గర చేయదుగా. ఒక మనిషిని సర్వ నాశనం చేయడం అనేది చాలా తప్పండి. చట్టం కూడా పూర్తిగా అమ్మాయిల సైడే అయిపోయింది. దీంతో అమ్మాయిలు చాలా ఈజీగా అబ్బాయిల మీద కేసులు పెట్టేసి వాళ్ల జీవితాలు నాశనం చేసేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు.’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
View this post on Instagram
స్టుపిడ్ నిర్ణయం
జానీ మాస్టర్ అవార్డును సస్పెండ్ చేయడంపై టాలీవుడ్ నుంచి జానీ మాస్టర్‌కు మద్దతు పెరుగుతోంది. ఇలా రద్దు చేయడం సరికాదని ప్రముఖ దర్శకుడు, హీరో బండి సరోజ్ కుమార్ కూడా స్పందించారు. జానీ మాస్టర్ జాతీయ అవార్డు ఇవ్వడం ఆపారు. కేసు రుజువయ్యేవరకూ. మీరేమి పద్మభూషణ్, భారతరత్న ఇవ్వట్లేదు కదా.. తన కొరియోగ్రఫీ టాలెంట్‌కి తన వ్యక్తిగత జీవితంతో సంబంధం ఏంటి ?? స్టుపిడ్ నిర్ణయం.. సారీ అంటూ తన అసంతృప్తి బండి సరోజ్ కుమార్ సోషల్ మీడియా సాక్షిగా వ్యక్త పరిచాడు.
జాతీయ అవార్డు ఇవ్వడం ఆపారు. కేసు ఋజువయ్యేవరకూ. మీరేమి పద్మభూషణ్, భారతరత్న ఇవ్వట్లేదు కదా.. తన #Choreography టాలెంట్ కి తన వ్యక్తిగత జీవితంతో సంబంధం ఏంటి ?? This is stupidity ! Sorry !!#Nationalawards #JaniMastercase
— Bandi Saroj Kumar (@publicstar_bsk) October 6, 2024