Visakha Student Death Case: విశాఖ రైల్వే ట్రాక్‌పై విద్యార్థి మృతదేహం - అమ్మానాన్న సారీ అని ఫోన్లో మెస్సేజ్‌లు
Visakha Student Death Case: విశాఖ రైల్వేట్రాక్ సమీపంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![Visakha Student Death Case: విశాఖ రైల్వే ట్రాక్‌పై విద్యార్థి మృతదేహం - అమ్మానాన్న సారీ అని ఫోన్లో మెస్సేజ్‌లు Visakha News Police Investigation on Engineering Third Year Student Suspicious Death Visakha Student Death Case: విశాఖ రైల్వే ట్రాక్‌పై విద్యార్థి మృతదేహం - అమ్మానాన్న సారీ అని ఫోన్లో మెస్సేజ్‌లు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/07/c2da8ac5b0ffb833e4ca8df1dc693afb1670390331751519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Visakha Student Death Case: విశాఖపట్నం జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. మర్రిపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో ఓయువకుడి మృతదేహం లభ్యమైంది. ఆ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖకు చెందిన పవన్ అనే యువకుడు దాకరమర్రి రఘు ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. రోజూలాగే కళాశాలకు వెళ్లిన పవన్ తిరిగి ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు చాలా చోట్ల వెతికారు. ఇదే క్రమంలో పవన్ మృతదేహం మర్రిపాలెం రైల్వేస్టేషన్ సమీపంలో దొరికింది. విషయం గుర్తించిన జీఆర్పీ పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. మృతుడి వద్ద కళాశాలకు చెందిన బ్యాగు ఉండడంతో అతడి వివరాలను గుర్తించగలిగారు. అలాగే పవన్ తల వెనుక భాగంలో ఆరంగులాల గాయం ఉందని, ముఖం, ఎడమ భూజంపైన తీవ్ర గాయాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. పవన్ ఫోన్ ను తీసుకొని చూడగా.. అతని తల్లిదండ్రులకు పంపించిన మెసేజ్ కనిపించింది. దాన్ని చూస్తే ఆయన ఆత్మహత్య చేసుకున్న అర్థం అవుతుంది
మెసేజ్ లో ఏముందంటే..?
"అమ్మానాన్న సారీ.. నావల్ల ఎప్పటికైనా మీకు బాధలు తప్పవు. నాకు ఇచ్చిన 6 వేలు, అన్నయ్యకి మొబైల్ ఫోన్ కోసం ఇచ్చిన 7 వేలు వాడేశాను. లక్ష రూపాయల వరకు అప్పులు చేశాను. నావల్ల మీకు భవిష్యత్తులో కూడా బాధలే ఉంటాయి. అమ్మా, నాన్న లవ్ యూ"... అంటూ పవన్ మొబైల్లో మెసేజ్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. దీన్ని బట్టి పవన్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.
విశాఖలో డ్రమ్ములో మహిళ డెడ్ బాడీ కేసు ఛేదించిన పోలీసులు
విశాఖ మధురవాడలో రెండు రోజుల కిందట కలకలం రేపిన మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ప్లాస్టిక్ డ్రమ్ లో కుళ్లిపోయిన స్థిలో మహిళ మృతదేహం కనిపించడం తెలిసిందే. రిషి అనే వ్యక్తి ఈ మహిళను హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. మృతురాలని శ్రీకాకుళం జిల్లా కు చెందిన బమ్మిడి ధనలక్ష్మి గా పోలీసులు గుర్తించారు. నిందితుడ్ని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసు కస్టడీ కి తీసుకుని విచారిస్తున్నారు.
బస్టాండ్‌లో పరిచయం, ఓసారి రూమ్‌కు తీసుకొచ్చి..
ఏడాదిన్నర కిందట శ్రీకాకుళం బస్ స్టాప్ లో రిషికి, ధనలక్ష్మి కి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో మధురవాడలో అద్దెకు ఉన్న ఇంటికి ఓసారి ఆమెను తీసుకువచ్చి శారీరకంగా కలిశాడు రిషి. ఆ పరిస్థితిని ఆసరాగా తీసుకుని రిషిని డబ్బులు డిమాండ్ చేసేది ధనలక్ష్మి. కొంతకాలానికి విషయం చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుందని ఆందోళన చెందిన రిషి.. చున్నీని మెడను బిగించి ధనలక్ష్మిని హత్య చేశాడని పోలీసులు తెలిపారు. అయితే శవాన్ని ఇంట్లో దాచిపెట్టిన రిషి ఆ తరువాత మృతదేహాన్ని నీటి డ్రంలోకి మార్చాడు. ఇంటి యజమానికి భార్య డెలివరీ కి వెళ్ళింది వచ్చిన తర్వాత అద్దె చెల్లిస్తామని దాటవేస్తూ వచ్చాడు నిందితుడు.
ఏడాది నుంచి అద్దె రాకపోవడం, ఇల్లు కూడా ఖాళీ చేయక పోవడంతో సామాన్లు బయటికి పడేసేందుకు ఇంటి ఓనర్ రమేష్ వెళ్లి చూసి షాకయ్యాడు. ఊహించని విధంగా మహిళ హత్య జరిగిన విషయాన్ని గుర్తించాడు రమేష్. తీసేందుకు రమేష్ వెళ్లడంతో బయటపడ్డ హత్య. పోలీసులకు ఇంటి ఓనర్ సమాచారం అందించడంతో హత్య విషయం వెలుగుచూసింది. ధనలక్ష్మి మృతదేహాన్ని బయటకు తరలించలేక నిందితుడు ఇంట్లోని నీటి డ్రంలో వదిలేసినట్టు భావిస్తున్నారు. మృతురాలు ధనలక్ష్మి గా నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ కు నమూనాలు పంపిస్తున్నాం అని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీపీ శ్రీకాంత్ చెప్పారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)