By: Ram Manohar | Updated at : 04 Dec 2022 02:04 PM (IST)
ఓ వ్యక్తి తన ఫ్రెండ్ పెళ్లికి బుర్కా వేసుకుని వెళ్లి ఆటపట్టించిన వీడియో వైరల్ అవుతోంది. (Image Credits: Twitter)
Watch Video:
బుర్కాతో వచ్చి ఆట పట్టించి..
సోషల్ మీడియాలో వైరల్ వీడియోలకు కొరతేం ఉండదు. ముఖ్యంగా...ఆట పట్టించే వీడియోలైతే ఇట్టే వైరల్ అయిపోతాయి. ఎవరిదైనా పెళ్లంటే...వాళ్లకు ఏం గిఫ్ట్ ఇవ్వాలని అంతా ఆలోచిస్తాం. కానీ...బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రం ఎలా షాక్ ఇవ్వాలని ఆలోచిస్తారు. ఫన్నీ గిఫ్ట్‌లతో కొందరు ఆటపట్టిస్తే...ప్రాంక్‌లు చేసి ఆ జంటను హడలెత్తించేస్తారు. ఇలాంటి వీడియోనే ఒకటి వైరల్ అవుతోంది. ఓ కొత్త జంట వేదికపై నిలబడి ఉండగా..అందరూ వచ్చి గిఫ్ట్‌లు ఇచ్చి ఆశీర్వదించి ఫోటోలు దిగి వెళ్తున్నారు. ఇలాగే ఓ ముగ్గురు మహిళలు బుర్కా వేసుకుని స్టేజ్‌పైకి వచ్చారు. వధూ వరులకు కంగ్రాట్స్ చెప్పి వెళ్లిపోయారు. ఇంతలో ఓ బుర్కా వేసుకున్న మహిళ వచ్చి పెళ్లి కొడుకుని గట్టిగా హత్తుకుంది. ముద్దు కూడా పెట్టుకుంది. ఇది చూసి అంతా షాక్ అయ్యారు. పక్కనే ఉన్న పెళ్లికూతురు ఎలా స్పందించాలో అర్థంకాకం అలా చూస్తూ ఉండి పోయింది. పెళ్లి కొడుకు కూడా షాక్‌లో ఉన్నాడు. ఆ తరవాత ముందుకు తిరిగి బుర్కా తీసి ముఖం చూపించింది. అప్పుడు కానీ తెలియలేదు. ఆమె "ఆమె" కాదని. పెళ్లి కొడుకు ఫ్రెండ్ ఇలా బుర్కా వేసుకుని వచ్చి ఆట పట్టించాడు. అసలు విషయం తెలియగానే...వరుడు గట్టిగా నవ్వుతూనే ఆ ఫ్రెండ్ తలపై గట్టిగా కొట్టాడు. చుట్టూ ఉన్న వారంతా "హమ్మయ్య" అని ఊపిరి పీల్చుకుని నవ్వుకున్నారు. పెళ్లి కూతురు కూడా ఆ షాక్‌లో నుంచి తేరుకుని నవ్వుతూ కనిపించింది. ఈ వీడియో చూసిన వాళ్లంతా.. ఫ్రెండ్స్ ఎంత డేంజరో చూడండి..అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
हरामी दोस्त 👏😂 pic.twitter.com/tovKXfBJDP
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) December 3, 2022
ముద్దు పెట్టుకున్నాడని పెళ్లి క్యాన్సిల్..
యూపీలో ఓ వధువు ఉన్నట్టుండి పెళ్లి క్యాన్సిల్ చేసేసింది. వరుడిపై కోపంతో వేదిక దిగి వెళ్లిపోయింది. పైగా పోలీసులకు ఫోన్ చేసి కేసు కూడా పెట్టింది. ఇంతకీ...వధువు అంతగా కోపగించుకోడానికి కారణం..వరుడు చేసిన ఓ చిలిపి పని. 300 మంది అతిథుల ముందు స్టేజ్‌పైనే వధువుకి ముద్దు పెట్టాడు వరుడు. దీన్ని అవమానంగా భావించిన యువతి వెంటనే వేదిక దిగి కోపంగా వెళ్లిపోయింది. పోలీసులకు ఫోన్ చేసి ఇదంతా చెప్పింది. ఆ తరవాత తేలిందేంటంటే...వధువుకి కోపం వచ్చింది వరుడు ముద్దు పెట్టినందుకు కాదు. అలా వేదికపైనే అందరూ చూస్తుండగానే ముద్దు పెడతానని వరుడు వాళ్ల ఫ్రెండ్స్‌తో బెట్ కాశాడట. దీనిపైనే ఆగ్రహించిన వధువు "అబ్బాయి క్యారెక్టర్ నాకు నచ్చలేదు" అని తేల్చి చెప్పింది. ఇది కాస్తా...పెళ్లి రద్దు చేసుకునేంత వరకూ వెళ్లింది. ఆ తరవాత పోలీసులు కల్యాణ మంటపానికి వచ్చారు. పెళ్లి రద్దు కాకుండా పోలీసులు ప్రయత్నించినా... ఫలితం లేకుండా పోయింది. "ఆ సంఘటన జరిగే సమయానికి ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొన్ని రోజుల వేచి చూసి తరవాత ఏం చేయాలనేది ఆలోచిస్తాం" అని పోలీసులు తెలిపారు.
Also Read: Viral Video: వైరల్ వెడ్డింగ్- పెళ్లికి వచ్చే వారి కోసం ఏకంగా విమానం బుక్ చేశారు!
Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సంచలన మలుపు, ఛార్జ్‌షీట్‌లో కేజ్రీవాల్, కవిత పేరు
YS Sharmila Gift To KCR : సీఎం కేసీఆర్ కు షూస్ గిఫ్ట్ పంపిన షర్మిల, తమతో ఒక్కరోజు పాదయాత్ర చేయాలని సవాల్
SECL Recruitment: సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 405 ఉద్యోగాలు, అర్హతలివే! జీతమెంతో తెలుసా?
TSPSC: గ్రూప్-4 ఉద్యోగార్థులకు అలర్ట్, పరీక్ష తేదీ ప్రటించిన టీఎస్పీఎస్సీ!
Lokesh Padayatra : నెల్లూరు నుంచి జగన్ పతనం స్టార్ట్, పెద్దిరెడ్డి లోకల్ వీరప్పన్ - లోకేశ్
Telangana budget 2023 : కొత్త పన్నులు - భూముల అమ్మకం ! తెలంగాణ బడ్జెట్లో ఆదాయ పెంపు మార్గాలు ఇవేనా ?
Pawan Kalyan On Anam : డీజీపీ బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు - ఆనం, కోటంరెడ్డి ఇష్యూపై పవన్ కల్యాణ్ హెచ్చరిక
Jagan focus on Muslims : మైనార్టీలపై జగన్ ఫోకస్, త్వరలో భారీ బహిరంగ సభకు ప్లాన్!
Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?