Viral Video: వైరల్ వెడ్డింగ్- పెళ్లికి వచ్చే వారి కోసం ఏకంగా విమానం బుక్ చేశారు!
Viral Video: పెళ్లికి వచ్చే అతిథుల కోసం ఓ జంట ఏకంగా విమానాన్నే బుక్ చేసింది.
Viral Video: మన దేశంలో వివాహం అంటే అదో మహోత్సవంగా జరుపుకుంటారు. విలాసవంతంగా, కనుల పండువగా పెళ్లి చేస్తారు. ఆహారం నుంచి అలంకరణ వరకు, అతిథుల జాబితా నుంచి అన్ని ఆహ్వాన పత్రిక వరకు అన్నీ ఎంతో గ్రాండ్‌గా చేయడానికి ఇష్టపడతారు.
అయితే కొవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రజలు గత రెండు సంవత్సరాలుగా వారి ఇళ్లలోనే ఉన్నారు. భారీగా ఫంక్షన్ చేద్దామని ఉన్నా వైరస్‌కు భయపడి సింపుల్‌గా చేసేశారు. కానీ ఇప్పుడు.. వివిధ దేశాలు మళ్లీ పర్యటకులను అనుమతించడం ప్రారంభించాయి. ప్రపంచ దేశల ప్రజలు వివిధ దేశాలకు వెకేషన్‌కు వెళ్తున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్‌లు పెరిగాయి. తాజాగా ఓ డెస్టినేషన్ వెడ్డింగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
వైరల్ వెడ్డింగ్
డెస్టినేషన్ వెడ్డింగ్‌లో ఒక జంట తమ కుటుంబం, బంధువులతో కలిసి ప్రయాణించడానికి మొత్తం విమానాన్ని బుక్ చేసుకున్నారు. ఏంటి షాక్ అయ్యారా? ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ శ్రేయా షా షేర్ చేసిన వీడియోలో తన సోదరి పెళ్లి కోసం మొత్తం ఫ్లైట్ బుక్ చేసినట్లు తెలిపింది. తర్వాతి కొన్ని సెకన్లలో ఆమె తన కుటుంబం, బంధువులు విమానం లోపల ఫుల్ జోష్‌లో అరుస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు చూపించింది. వీడియో చివర్లో, పెళ్లి చేసుకోబోయే జంటను కూడా చూపించారు. యూజర్ షేర్ చేసిన వివరాల ప్రకారం, రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో వివాహం జరుగుతోంది. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
View this post on Instagram
Also Read: Rahul Gandhi on BJP: 'మిస్టర్ ప్రైమ్ మినిస్టర్- పెట్రోల్, గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించడం లేదు?'