Viral Video: ఇదేం స్టంట్‌రా బాబూ, బాహుబలిని మించిపోయాడుగా - వైరల్ వీడియో
Viral Video: ఓ యువకుడు తన చేతులకు తాళ్లు కట్టుకుని బైక్‌లను నిలువరిస్తూ చేసిన సాహసం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video:
సోషల్ మీడియాలో వైరల్..
సోషల్ మీడియాలో ఓ వీడియో ఎప్పుడు ఎలా వైరల్ అవుతుందో అర్థం కాదు. రోజుకో వీడియో అలా చక్కర్లు కొడుతూ ఉంటుంది. వాటిని చూసి యూజర్లు "వావ్" అని రియాక్షన్లు ఇస్తుంటారు. రీసెంట్‌గా అలాంటి వీడియోనే వైరల్ అవుతోంది. యూపీలో ఓ యువకుడు చేసిన సాహసాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అందరికీ షేర్ చేస్తున్నారు. కుర్రాళ్ల దగ్గర బైక్ ఉంటే ఓ పట్టాన ఆగరు. ఏదో స్టంట్‌లు చేస్తుంటారు. ఇందులో కొత్త ట్రిక్‌లు వెతుక్కుంటూ ఉంటారు. యూపీలోని బగ్‌ఫట్‌కు చెందిన ఓ యువకుడు ఇలాంటి ట్రిక్‌తోనే మ్యాజిక్ చేశాడు. ఓ యువకుడు తన రెండు చేతులకు పెద్ద తాళ్లు కట్టుకుని నిలబడ్డాడు. ఆ తాడు చివరలను 6 బైక్‌లకు కట్టారు. ఆ బైక్‌లు స్టార్ట్ చేసి రైజ్ చేస్తుంటే...అవి ముందుకు కదలకుండా తన చేతులతోనే గట్టిగా పట్టుకుని ఆపేశాడు యువకుడు. అంటే..ఒకేసారి 6 బైక్‌లను తన రెండు చేతులతో కట్టిన తాళ్లతో ఆపేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నారు. ముందుగా...ఈ వైరల్ వీడియోని ABP News Instagram Pageలోషేర్ చేశారు. ఆ తరవాత ఇది వైరల్ అయింది. వెంటనే మిగతా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలోనూ షేర్ అయింది. ఈ సాహసం చేసిన యువకుడు బాడీ బిల్డర్. పేరు మోసిన్. ఇప్పటికే ఈ వీడియోను 87 లక్షల మంది చూశారు. ఇంత పెద్ద సాహసం చేసిన యువకుడిని అంతా బాహుబలి అని కితాబిస్తున్నారు.
View this post on Instagram
Also Read: Indo-US Military Drill: తెగ టెన్షన్ పడుతున్న చైనా, అందుకు రెడీ అవుతున్న భారత్ అమెరికా