Viral Video: క్వారంటైన్ వద్దని వేడుకున్నా ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు - వైరల్ వీడియో
Viral Video: చైనాలో ఓ కొవిడ్ బాధితుడు క్వారంటైన్ వద్దన్నందుకు వైద్య సిబ్బంది ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు.
Viral Video:
వద్దని అంటున్నా..
చైనాలో కొవిడ్ ఆంక్షలు ఎంత కఠినంగా ఉన్నాయో..వాటిపై ప్రజలు ఎంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారో ప్రపంచమంతా గమనిస్తూనే ఉంది. వైరస్ కట్టడికి ఇలాంటి రూల్స్ తప్పవని ప్రభుత్వం చెబుతున్నా...ఇవి మరీ హద్దు దాటుతున్నాయని మండి పడుతున్నారు ప్రజలు. అయితే...ఈ రూల్స్ ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటాయన్నది వినడమే కానీ...ఎప్పుడూ చూడలేదు. కానీ...అక్కడి ప్రభుత్వ నియంతృత్వ వైఖరిని తెలియజేసే వీడియో ఒకటి వైరల్ అవుతోంది. కొవిడ్ సోకిన వ్యక్తి క్వారంటైన్‌లో ఉండేందుకు నిరాకరించగా...వైద్య సిబ్బందిన ఆ వ్యక్తిని లాక్కుని తీసుకెళ్లిన వీడియా సంచలనమవుతోంది. పీపీఈ కిట్స్ వేసుకున్న ఇద్దరు..ఆ వ్యక్తిని బలవంతంగా పట్టుకుని తీసుకెళ్లారు. ఎంత వద్దని బాధితుడు అరుస్తున్నా కూడా పట్టించుకోలేదు. హంగ్‌జోవూలో జరిగిందీ ఘటన. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడం వల్ల అధికారులు స్పందించారు. "బాధితుడికి క్షమాపణలు చెప్పాం. ఆ సిబ్బందినీ మందలించాం" అని చెప్పారు. కానీ..అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సోషల్ మీడియాలో నెటిజన్లు చైనా ప్రభుత్వంపై తీవ్రంగా మండి పడుతున్నారు. ఇలాంటి నియంతృత్వ విధానాలు మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెల్లకాగితాలతో నిరసన..
Raided by the state in broad daylight in your own home!
— 247ChinaNews (@247ChinaNews) December 1, 2022
That is China at the moment.#China #ChinaProtests pic.twitter.com/pTOthWmy5i
చైనాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు చాలా రోజులుగా నిరసనలు చేపడుతున్నారు. ముఖ్యంగా కొవిడ్ ఆంక్షల విషయంలో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగుతున్నారు. వీటిని కూడా ప్రభుత్వం అడ్డుకుంటోంది. ఎక్కడ జనం గుమిగూడినా వెంటనే పోలీసులు దాడులు చేస్తున్నారు. అందుకే..పౌరులు కొత్త తరహాలో ఉద్యమిస్తున్నారు. ఎలాంటి నినాదాలు చేయకుండానే తమ వ్యతిరేకత తెలియజేస్తున్నారు. ఇదే "బ్లాంక్ పేజ్ ఉద్యమం" (Blank Page Revolution). అంటే...కేవలం ఓ తెల్ల కాగితం పట్టుకుని నిరనస వ్యక్తం చేయడం. తెల్లకాగితాలతో ఉద్యమం ఏంటి..? అనిపిస్తుండొచ్చు. కానీ..దీనికి ప్రత్యేక కారణముంది. ప్రభుత్వం
ఏం చేసినా..సెన్సార్ పేరిట అణగదొక్కేస్తోంది. దీంతో విసిగిపోయిన ప్రజలు ఇలా A4 పేపర్లు పట్టుకుని నిలబడుతున్నారు. ఈ తెల్ల కాగితమే ప్రభుత్వానికి సెగ పుట్టిస్తోంది. పైగా...ఇలా వైట్ పేపర్స్‌తో నిరసనలు చేపడితే...పోలీసులు తమను అరెస్ట్ చేయలేరన్న ధీమాతో ఉన్నారు పౌరులు. ఎలాగో వాటిపై ఏమీ రాసి ఉండదు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలూ ఉండవు. అలాంటప్పుడు ఏ కారణం చూపించి తమను అరెస్ట్ చేస్తారు..? అంటూ ప్రశ్నిస్తున్నారు. దీన్నే "White Paper Revolution","A4 Revolution"అని పిలుస్తున్నారు. ఈ ఉద్యమం చైనాకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచమంతా దీని గురించి మాట్లాడుకుంటోంది. పలు దేశాల పౌరులు చైనీస్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. చైనా ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. చైనా కొవిడ్ నిబంధనలను సరళతరం చేసేందుకు ప్రయత్నిస్తోంది. కొన్ని మినహాయింపులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి అధికారిరక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశముంది.
Also Read: Live Glacier Melting: గ్లేషియర్స్ కరిగిపోవడం ఎప్పుడైనా చూశారా? క్షణాల్లో మాయమైన మంచు