By: Ram Manohar | Updated at : 05 Dec 2022 12:04 PM (IST)
లైవ్‌లో గ్లేషియర్ కరిగిపోతున్న వీడియో వైరల్ అవుతోంది. (Image Credits: Youtube\European Space Agency)
Live Glacier Melting:
ఆర్కిటిక్‌లో..
వాతావరణ మార్పులతో ఎన్ని నష్టాలు కలుగుతున్నాయో మనం కళ్లారా చూస్తున్నాం. ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి. అకాల వర్షాలు కురుస్తున్నాయి. గడ్డకట్టుకుపోయేంత చలి గాలులు వీస్తున్నాయి. ఏ సీజన్ కూడా సరైన విధంగా ఉండట్లేదు. ఫలితంగా...ఎన్నో జబ్బులూ మనల్ని వెంటాడుతున్నాయి. వాతావరణ మార్పులను కళ్లకు కట్టినట్టు చూపించేస్తాయి...మంచు పర్వతాలు. అవి క్రమక్రమంగా కరిగిపోతూ..
సముద్ర మట్టాన్ని పెంచుతున్నాయి. ఇదే మనకు వరదల ముప్పుని పెంచుతోంది. ఎన్నోసార్లు మనం వినే ఉంటాం...వాతావరణంలోని ఉష్ణోగ్రతలకు...గ్లేషియర్స్ కరిగిపోతాయని. కానీ...ఇదెలా జరుగుతుందో ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ లైవ్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. మంచు కరుగుతుండగా...ఓ రీసర్చర్ వీడియో తీశారు. పాత వీడియోనే అయినప్పటికీ..ఉన్నట్టుండి ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. బ్రిటీష్ ఆర్కిటిక్ సర్వే రీసర్చర్ జేమ్స్ క్లార్క్ రోజ్...ఈ వీడియో తీశారు. క్షణాల్లోనే పెద్ద పెద్ద మంచు గడ్డలన్నీ కరిగి పోయాయి. ఇలాంటి వాటి వల్లే సముద్రాల్లో సునామీలు సంభవిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. సర్వేలో భాగంగా...ఆర్కిటిక్ పెనిన్సులాలో (Arctic Peninsula) మెజర్‌మెంట్స్ తీసుకుంటూ ఉండగా...ఉన్నట్టుండి William Glacier కరిగిపోతుండటం గమనించారు. వెంటనే వీడియో తీశారు. 78 వేల చదరపు మీటర్ల మంచు తునాతునకలైపోయి..సముద్రంలో కరిగిపోయినట్టు అంచనా వేశారు. అప్పటి వరకూ సముద్రంలో 50-100 మీటర్ల వరకూ మాత్రమే చల్లగా ఉంది. ఎప్పుడైతే ఈ గ్లేషియర్ కరిగిపోయిందో...లోతుల్లోనూ నీళ్లు చల్లగా మారిపోయాయని పరిశోధకులు చెప్పారు.
హిమాలయాలు కూడా...
ఇండోర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)పరిశోధకులు ఇప్పటికే ఓ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అదేంటంటే... గతేడాది వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, విపరీతమైన వేడిగాలుల కారణంగా హిమాలయా ల్లోని గ్లేషియర్స్ కరిగిపోయాయి. దాదాపు 15 ఏళ్లుగా హిమాలయాల స్థితిగతులపై అధ్యయనం చేస్తోంది పరిశోధకుల బృందం. మంచుఅత్యంత వేగంగా కరిగిపోతున్నట్టు గుర్తించారు. గతేడాది మార్చి, ఏప్రిల్‌లో 100 ఏళ్ల రికార్డులూ చెరిపేసి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ సమయంలోనే గ్లేషియర్స్ కరిగిపోవటాన్ని గమనించారు. ఈ కరిగిపోవటం కూడా చాలా వేగంగా, భారీగా జరుగుతోందన్నది పరిశోధకులు తేల్చి చెప్పిన విషయం. ఇలా కరుగుతున్నందునే...నేరుగా హిమాలయాల్లో నుంచి పాకిస్థాన్‌కు భారీగా నీరు చేరుతోందన్నది సైంటిస్ట్‌లు ఇస్తున్న వివరణ. ఈ ఫినామినాను "Glacial lake outburst"గా పిలుస్తారు. మంచు పొరలతో ఏర్పడ్డ గ్లేషియర్స్ కొన్ని వందల కిలోమీటర్ల మేర పై నుంచి కిందక వరకూ విస్తరించి ఉంటాయి. కేవలం
హిమాలయాల్లోనే కాదు. ఐరోపాలోని ఆల్ప్స్ (Alps) పర్వతాల్లోని మంచు కూడా చాలా వేగంగా కరిగిపోతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే..హిమాలయాల్లోని నార్త్, సౌత్ పోల్స్‌లో భారీ మొత్తంలో మంచి నీరు గడ్డకట్టుకుని ఉంటుంది. ఈ మంచు అధిక ఉష్ణోగ్రతల కారణంగా కరిగిపోయి...మంచి నీళ్లన్నీ అలా వరదల్లా ముంచెత్తుతున్నాయి. వృథా అవుతున్నాయి. హిమాలయాలు కరిగిపోవటం అనే ప్రక్రియ ఇంతే వేగంగా శతాబ్దాల పాటు కొనసాగితే...ఎప్పుడో అప్పుడు అక్కడ చుక్క నీరు కూడా లేకుండా పోతుందని హెచ్చరించారు.
Also Read: Putin's Health: షాకింగ్ న్యూస్- మెట్లపై నుంచి జారిపడిన పుతిన్- విరిగిన ఎముక!
Rat Steals Necklace : డైమండ్ నెక్లెస్ చోరీచేసిన ఎలుక, ప్రియురాలికి గిఫ్ట్ అంటూ నెటిజన్లు కామెంట్స్
Telangana Budget 2023: రూ.3 వేల నిరుద్యోగ భృతిపై బడ్జెట్ లో ఎందుకు ప్రస్తావించలేదు?: ఎంపీ సోయం బాపూరావు
SSC Exams: సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్ పరీక్షల తేదీలు ఖరారు! షెడ్యూలు ఇదే!
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతుల ఆందోళన - ఆసిఫాబాద్ లో పరిస్థితి ఉద్రిక్తం!
Turkey Earthquake : టర్కీ భూకంపాన్ని ముందుగా పసిగట్టిన పక్షులు, వీడియో వైరల్!
Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!
Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Man Marries Triplets: ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు- టైం టేబుల్ వేసుకొని భర్తతో కాపురం!