Viral Video: మీరెప్పుడైనా బిస్లరీ వాటర్ దోశ తిన్నారా? ఇదిగో ఇలా తయారు చేసుకోండి
Viral Video: బిస్లరీ పానీ దోశ అంటూ ఓ వ్లాగర్ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
Bisleri Water Dosa: టిఫిన్స్‌లో దోశకి ఉండే డిమాండే వేరు. ఆనియన్, మసాలా, చీజ్, ఎగ్, చాక్లెట్ ఇలా ఎన్నో రకాల దోశల్ని ప్రిపేర్చేస్తుంటారు. అయితే.. ఎప్పుడూ ఒకేలా ఉంటే కిక్ ఏం ఉంటుంది. ఎప్పుడూ ఏదో కొత్త రెసిపీతో దోశలు తయారు చేస్తుంటారు చెఫ్‌లు. అలా ఓ కుక్ బిస్లరీ వాటర్‌తో దోశ తయారు చేశారు. ప్యాకేజ్డ్ వాటర్‌ని దోశపై పోసి అందరికీ సర్వ్ చేస్తున్నాడు. ఇదంతా ఓ వ్లాగర్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆహార ప్రియులంతా ఈ వీడియో చూసి ఆశ్చర్యపోతున్నారు. Bisleri Pani Vala Dosa అనే పేరు కూడా పెట్టేశారు. ఈ వీడియోలో రెసెపీ అంతా చూపించాడు. ముందుగా పిండిని పెనంపై వేశాడు చెఫ్.
ఆ తరవాత మసాలా దోశపై వేసే రకరకాల పదార్థాలన్నీ వేశాడు. ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, కొత్తిమీర, చీజ్ ఇలాంటి ఇన్‌గ్రీడియెంట్స్ అన్నీ ఆ దోశపై వేశాడు. ఆ తరవాత ఆ మిక్స్‌ని అంతా కలిపి దోశపై పూశాడు. కొంత కారం పొడి, పసుపు చల్లాడు. టేస్ట్ కోసం కాస్తంత బటర్ కూడా యాడ్ చేశాడు. అక్కడి వరకూ అంతా ఓకే. కానీ ఆ తరవాతే ఓ బిస్లరీ వాటర్ బాటిల్ తీసి ఆ దోశపై పోశాడు. ఆ తరవాత అంతా కలిపి దోశపై రుద్దాడు. అదే నోరూరించే మసాలాలా తయారైంది. వెంటనే ఓ ప్లేట్‌లో వేసి దాన్ని సర్వ్ చేశాడు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. "ఇలాంటి రెసిపీలతో దోశకున్న టేస్ట్‌ని నాశనం చేయకండి" అని కొందరు తిడుతుండగా మరి కొందరు "నీళ్లలో కాస్తంత దోశ పెట్టావా" అని సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో వైరల్ అయిపోయింది.
View this post on Instagram
ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో అవతార్ బిర్యానీ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్లాగర్ (Avatar Biryani)ఇదంతా వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. శంఖం పూలను( Pea Flowers) ఓ కుండలో నీళ్లు పోసి బాగా ఉడికించింది. ఆ ఉడికిన నీళ్లలో శంఖం పూలు వేసి సన్నగా మంట పెట్టి కాసేపు ఉడికించింది. ఆ తరవాత ఆ పూలను వేరు చేసింది. ఆ నీళ్లు నీలం రంగులోకి మారాయి. నానబెట్టిన బియ్యాన్ని అందులో పోసింది. దాదాపు 20 నిముషాల పాటు అలాగే ఉడికించి తరవాత అందులో ఉప్పు, నెయ్యి వేసింది. మరో కుండ తీసుకుని అందులో నెయ్యి, సుగంధ ద్రవ్యాలు వేసింది. ఉల్లిగడ్డ ముక్కలు, జీడిపప్పు, పచ్చిమిర్చి వేసి వేయించింది. ఆ మసాలాలోనే నీలం రంగులో ఉన్న బియ్యం పోసింది. కాసేపు ఉడికించిన తరవాత నీలం రంగులో ఉన్న బిర్యానీ రెడీ అయిపోయింది.
View this post on Instagram