Viral News: 4 ఇంజిన్లు, 100 బోగీలు- ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలును చూశారా?
Viral News: ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాసింజర్ రైలును నడిపినట్లు స్విట్జర్లాండ్ ప్రకటించింది.
Viral News: రైలుకు ఎన్ని బోగీలు ఉంటాయి? మహా అయితే 20 నుంచి 25 బోగీలు ఉంటాయి. కానీ ఆ రైలుకు మాత్రం ఏకంగా 100 బోగీలు ఉన్నాయి. అంతేకాదు నాలుగు ఇంజిన్లు కూడా ఉన్నాయి. ఇదేంటి అనుకుంటున్నారా? ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాసింజర్ రైలు ఇదేనట.
1.9 కిమీ
#Switzerland
— AFP Photo (@AFPphoto) October 29, 2022
Like clockwork: World's longest passenger train winds through Swiss Alps
📸 @Coffrinews #AFP pic.twitter.com/F5m94YJB2Y
స్విట్జర్లాండ్ ప్రస్తుతం.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాసింజర్ రైలును నడిపి రికార్డు సృష్టించింది. దీనికి ఏకంగా 100 బోగీలు, నాలుగు ఇంజిన్లు ఉంటాయి. 1.9 కిలోమీటర్ల (1.2 మైళ్ల) పొడవైన ఈ రైలును ప్రకృతి రమణీయతకు నెలవైన ఆల్ఫ్స్ పర్వతాల్లోని అల్బులా/బెర్నినా మార్గంలో నడిపారు. ప్రెడా నుంచి బెర్గుయెన్ వరకు ఈ రైలు శనివారం ప్రయాణం చేసింది. ఈ మేరకు స్విస్ రైల్వే కంపెనీ 'రేటియన్' ప్రకటించింది.
Switzerland has just set the #worldrecord for the longest passenger train in history! After taking a hit during the pandemic, Rhaetian Railway hopes the event reminds people of the beauty of train journeys. Can you guess the length of the train? pic.twitter.com/2cBo5PrB5H
— DW Culture (@dw_culture) October 29, 2022
ప్రఖ్యాత ల్యాండ్వాసర్ వయాడక్ట్ సహా 48 వంతెనలు, 22 సొరంగాల గుండా పర్వత సానువుల మధ్యన ఒంపులు తిరుగుతూ ఈ మార్గం ఉంటుంది. దీనిని యునెస్కో 2008లోనే ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. మొత్తం 25 కిలోమీటర్ల (15.5 మైళ్ల) దూరం సాగే ఈ ప్రయాణం పూర్తయ్యేందుకు దాదాపు గంట సమయం పట్టింది.
Also Read: Indian Ecomomy: భారతీయులు ఎక్కువగా టెన్షన్ పడే విషయాలివే- సర్వేలో షాకింగ్ ఫ్యాక్ట్స్!