Viral News: వాట్సాప్ కాల్ ద్వారా డెలివరీ చేసిన వైద్యులు, తల్లి బిడ్డ ఇద్దరూ సేఫ్
Viral News: జమ్ముకశ్మీర్‌లో ఓ గైనకాలజిస్ట్ వాట్సాప్ కాల్ ద్వారా డెలివరీ చేశారు.
Jammu Kashmir Viral News:
జమ్ముకశ్మీర్‌లో ఘటన..
జమ్ముకశ్మీర్‌లో కొన్ని రోజులుగా విపరీతమైన మంచు కురుస్తోంది. కొన్ని చోట్ల మంచు చరియలు విరిగి పడి దారులు మూసుకుపోతున్నాయి. మారుమూల ప్రాంతాల్లోని వాళ్లకేదైనా జబ్బు చేస్తే వైద్యం అందించడమూ కష్టమవుతోంది. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర ఘటన జరిగింది. కేరాన్ గ్రామంలో ఓ మహిళ ప్రసవ వేదన పడుతోంది. అయితే...మంచు కురుస్తుండటం వల్ల అప్పటికప్పుడు ఆమెను ఆసుపత్రికి తరలించడం కష్టమైంది. అప్పటికే ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. ఏం చేయాలో అర్థం కాక కుటుంబ సభ్యులు ఆందోళన పడుతుండగా వైద్యులు అప్పటికప్పుడు ఓ మెరుపు ఆలోచన చేశారు. వాట్సాప్ కాల్ ద్వారా సలహాలు, సూచనలు ఇస్తూ డెలివరీ చేయించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రసవించేలా సహకరించారు. కేరాన్‌లోని పీహెచ్‌సీకి ఓ మహిళ పురిటి నొప్పులతో బాధ పడుతూ వచ్చిందని...అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉందని వివరించారు వైద్యులు. అయితే...కేరాన్ ప్రాంతానికి పరిసర గ్రామాలకు మంచు కారణంగా దారి లేకుండా పోయింది. ఆసుపత్రికి తరలించాలంటే తప్పకుండా హెలికాప్టర్ కావాల్సిందే. అయితే...అప్పటికీ మంచు తీవ్రంగా కురుస్తుండటం వల్ల అధికారులు అది సాధ్యపడదని చెప్పారు. ఏదో ఓ ప్రత్యామ్నాయం చూసుకోవాలని చెప్పారు. పీహెచ్‌సీలోని మెడికల్ స్టాఫ్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. క్రాల్‌పొరలోని సబ్‌డిస్ట్రిక్ హాస్పిటల్‌లో పని చేసే గైనకాలజిస్ట్ హీహెచ్‌సీలోని వైద్యులకు వాట్సాప్ కాల్ చేసి గైడ్ చేశారు. సురక్షితంగా శిశువును ఎలా బయటకు తీయాలో చెప్పారు. ఆమె చెప్పినట్టే చేయగా..సుఖ ప్రసవం అయింది. ఆడ శిశువు జన్మించింది.
Also Read: Delhi Meerut Rapid Rail: మరో కొత్త ట్రైన్ వచ్చేస్తోంది,ఈ సారి ర్యాపిడ్ రైల్ - మొదట ఆ రూట్‌లోనే