By: ABP Desam | Updated at : 03 Mar 2023 11:43 AM (IST)
Edited By: jyothi
మహిళ స్నానం చేస్తుండగా దొంగచాటుగా ఫొటోలు - బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారం
Vijayawada Crime News: ఓ మహిళ స్నానం చేస్తుండగా.. ఆమెకు తెలియకుండా ఫొటోలు తీశాడు. ఆపై వాటిని ఆమెకు చూపించి బ్లాక్ మెయిల్ కు పాల్పడడం ప్రారంభించాడు. తాను చెప్పినట్లు వినకపోతే ఫొటోలు బయటపెడతానంటూ బెదిరించాడు. ఆమె న్యూడ్ ఫొటోలను అడ్డంగా పెట్టుకొని అత్యాచారానికి పాల్పడ్డాడు. అలాగే చాలాసార్లు ఆమె వద్ద నుంచి లక్షల్లో డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు ఆమెపైనే దాడికి పాల్పడ్డాడు. అతడి వేధింపులు భరించలేని మహిళ.. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. వారి సాయంతోనే ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని కూడా అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే..?
కృష్ణా జిల్లాలోని అమరావతి విశాలాంధ్ర కాలనీకి చెందిన 45 ఏళ్ల పుట్టా సుభాష్ బీపీసీఎల్ కంపెనీలో పైప్ లైన్ సెట్టింగ్ పనులు చేస్తుంటాడు. రాజీవ్ నగర్ కు చెందిన మహిళ భర్తతో కలిసి పచారీ దుకాణం నిర్వహిస్తోంది. దుకాణంలో సరకులు కొనుగోలు చేసి, ఫోన్ పే, పేటీఎం ద్వారా పలుమార్లు నగరు చెల్లింపులు చేసే సందర్భంలో ఆ మహిళ ఫోన్ నెంబర్ ను తెలుసుకున్నాడు. అలా సరకుల కోసం వెళ్లినప్పుడల్లా మాట కలిపాడు. ఒక రోజు ఆమె తన ఇంట్లో స్నానం చేస్తుండగా.. సుభాష్ దొంగచాటుగా ఫొటోలు తీశాడు. వాటిని ఆమెకు చూపించి బెదిరింపులకు పాల్పడడం మొదలు పెట్టాడు. ఆమె వద్దని వారిస్తున్నా వినకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కూడా ఇంట్లో ఎవరూ లేని సమయంలో పలుమార్లు అత్యాచారం చేశాడు.
ఇలాగే ఆమెను బలవంతంగా అనుభవిస్తూ.. రోజులు గడిపేస్తున్నాడు. కేవలం అత్యాచారంతో ఆగకుండా డబ్బులు ఇవ్వాలంటూ వేధించడం ప్రారంభించాడు. న్యూడ్ ఫొటోలు బయటపెడతానని బెదిరిస్తూ.. ఆమె నుంచి 16 లక్షల నగదు తీసుకున్నాడు. తిరిగి ఇవ్వాలని ఆమె అడిగితే కొట్టడం మొదలు పెట్టాడు. ఏడాదిగా ఆమెపై అత్యాచారం చేయడం, తాజాగా ఆమెను కొట్టడంతో వేధింపులు తాళలేని బాధితురాలు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. వారి సాయంతోనే సుభాష్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సుభాష్ ను అరెస్ట్ చేశారు. గురువారం నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి సుభాష్ కు రిమాండ్ విధించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇటీవలే కోనసీమ జిల్లాలో బాలికపై సామూహిక అత్యాచాారం
బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సంచనలం అయిన బాలికపై సామూహిక అత్యాచారం కేసును పోలీసులు ఛేదించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల అరెస్ట్ చేశారు. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కాట్రేనికోన మండలంలోని ఓ గ్రామంలో ఈ నెల 6న బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 16న బాధిత బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. అమలాపురం డీఎస్పీ మాధవ రెడ్డి, ముమ్మిడివరం సీఐ జానకిరామ్ ఈ కేసుపై విచారణ చేపట్టారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను శుక్రవారం అరెస్టు చేశారు. నిందితులు ఓలేటి బ్రహ్మతేజ(20), ఓలేటి తులసీరావు(21), ఓలేటి ధర్మారావు(21), మాల్లాడి వంశీ(20), అర్ధాని వీరబాబు(21) అరెస్ట్ చేసి, ముమ్మిడివరం కోర్టులో హాజరుపర్చారు. నిందితులకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.
TSPSC పేపర్ లీకులతో CMOకు లింక్! సీబీఐ, ఈడీ విచారణకు ప్రవీణ్ కుమార్ డిమాండ్
1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
Court Jobs: కోర్టుల్లో 118 కొత్త పోస్టులు మంజూరు - 3546కి చేరిన ఖాళీల సంఖ్య!
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Indian Railways: రైళ్లపై రాళ్లు రువ్వితే కేసులు మామూలుగా ఉండవు - రైల్వేశాఖ వార్నింగ్
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!
KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?