అన్వేషించండి

Teacher Burns Child Private Part: వారణాసిలో ఘోరం - ప్యాంట్‌లో మూత్రం పోసుకున్నాడని.. బాలుడి ప్రైవేట్ పార్ట్ కాల్చిన టీచర్!

Varanasi Play School Teacher: వారణాసి ప్లే స్కూల్‌లో ఘోరం. ప్యాంట్‌లో మూత్రం పోసుకున్నాడని ఐదేళ్ల బాలుడి ప్రైవేట్ పార్ట్‌ను కాల్చింది టీచర్. ఈ దారుణ ఘటన కలకలం రేపింది

POCSO Case Varanasi Teacher: అక్షరాలు దిద్దించి క్రమశిక్షణ నేర్పించాల్సిన గురువే కిరాతకురాలిగా మారింది. చిన్నారులకు రక్షణగా నిలవాల్సిన బడిలోనే ఐదేళ్ల పసివాడిపై రాక్షసత్వం ప్రదర్శితమైంది. ప్యాంట్‌లో మూత్రం పోసుకున్నాడనే పసివాడి తప్పుకు.. వేడి కత్తితో ప్రైవేట్ పార్ట్‌ను కాల్చి భయానక క్షోభకు గురిచేసింది ఒక మహిళా ఉపాధ్యాయురాలు. ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం వారణాసిలోని భేలూపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సెరీన్ సోనీ ప్లే స్కూల్ లో చోటుచేసుకున్న ఈ దారుణ  ఘటన  కలకలం రేపుతోంది. 

జులై 4న పాఠశాలలో తరగతి జరుగుతున్న సమయంలో ఐదేళ్ల చిన్నారి వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు ఉపాధ్యాయురాలిని అనుమతి కోరాడు. అయితే సదరు ఉపాధ్యాయురాలు బాలుడి విన్నపాన్ని  నిరాకరించింది. పసివాడు కావడంతో ఎంతసేపు ఆపుకోవాలో తెలియక, మూత్రాన్ని నియంత్రించుకోలేక చివరకు ప్యాంట్‌లోనే పోసుకున్నాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ టీచర్, బాలుడిని పక్కనే ఉన్న మరో గదిలోకి తీసుకెళ్లి, తీవ్రంగా కొట్టడమే కాకుండా వేడి చేసిన కత్తితో ప్రైవేట్ పార్ట్‌పై కాల్చింది. ఈ ఘోరాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఆ పసివాడిని భయభ్రాంతులకు గురిచేసింది.

సాయంత్రం ఇంటికి వచ్చిన చిన్నారి తీవ్రమైన నొప్పితో విలవిలలాడుతుండటం, భయంతో వణికిపోతుండటం గమనించిన తల్లిదండ్రులు ఒంటిపై ఉన్న గాయాలను చూసి షాక్‌కు గురయ్యారు. ఏం జరిగిందో అని ప్రేమగా అడిగి తెలుసుకున్నారు.  పాఠశాలలో టీచర్ చేసిన దారుణాన్ని ఆ పసివాడు ఏడుస్తూ వివరించాడు. వెంటనే కంగారుపడిన తల్లిదండ్రులు మరుసటి రోజు ఉదయాన్నే స్కూల్‌కు వెళ్లి ప్రిన్సిపాల్  ను కలవగా.. బాధ్యతగల పాఠశాల యాజమాన్యంగా స్పందించాల్సింది పోయి, సమస్యను తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు. ప్రశ్నించిన తల్లిదండ్రులపైనే తిరిగి బెదిరింపులకు పాల్పడటంతో యాజమాన్య తీరుపై బాధితులు తీవ్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.   

పాఠశాల యాజమాన్యం నుంచి ఎలాంటి న్యాయం జరగకపోవడంతో, తీవ్ర గాయపడిన బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన తల్లిదండ్రులు.. అనంతరం భేలూపూర్ పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. చిన్నారి శరీర భాగాలపై ఉన్న తీవ్రమైన సురక్షిత లేని గాయాలను, మెడికల్ రిపోర్టులను పరిశీలించిన పోలీసులు తక్షణమే స్పందించారు. సదరు ఉపాధ్యాయురాలితో పాటు, ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించి బెదిరింపులకు పాల్పడిన ప్రిన్సిపాల్ హేమలతపై భారతీయ నశిత్ సంహిత,  పోక్సో   చట్టంలోని కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు.

చిన్నారులను చేర్పించే ప్లే స్కూళ్లలో ఇలాంటి సైకో మనస్తత్వాలు ఉన్న ఉపాధ్యాయులు ఉండటంపై తల్లిదండ్రులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పసివాడిపై ఇంతటి కిరాతకానికి ఒడిగట్టిన సదరు టీచర్‌ను , నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించి, స్కూల్ గుర్తింపును వెంటనే రద్దు చేయాలని   డిమాండ్ చేస్తున్నాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget