అన్వేషించండి

SC Status Religious Conversion Verdict: మత మార్పిడితో ఎస్సీ హోదా రద్దు - సంచలన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు!

SC Reservation Case: క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు. మార్చి 2026 తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు. ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించింది.

Supreme Court Rejects Review Petition on SC Status Conversion:  మత మార్పిడి పొందిన వ్యక్తుల రాజ్యాంగబద్ధమైన షెడ్యూల్డ్ కులాల హోదాకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరో చారిత్రాత్మక  తీర్పును ఇచ్చింది.  హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను వదిలి ఇతర మతాల్లోకి  ప్రత్యేకించి క్రైస్తవం లేదా ఇస్లాం మారిన వ్యక్తులు తమ ఎస్సీ హోదాను, దాని ఆధారంగా పొందే రిజర్వేషన్ ప్రయోజనాలను పూర్తిగా కోల్పోతారని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో మార్చి 2026లో తామిచ్చిన చారిత్రాత్మక తీర్పును పునఃసమీక్షించాలని దాఖలైన రివ్యూ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకునేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం  తిరస్కరించింది.

గతంలో ఏపీ హైకోర్టు తీర్పు 

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన పూర్వపు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలైంది. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన ఒక వ్యక్తి ఎస్సీ రిజర్వేషన్ పరి పరిధిలోకి రారని, రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ క్యాస్ట్స్ (ఆర్డర్) 1950 ప్రకారం ఎస్సీ హోదా అనేది కేవలం హిందూ, సిక్కు , బౌద్ధ మతస్థులకు మాత్రమే పరిమితమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు చట్టబద్ధమైనదేనని సమర్థిస్తూ సుప్రీంకోర్టు మార్చి 2026లోనే కీలక తీర్పు వెలువరించగా, తాజాగా ఆ తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ను కూడా ధర్మాసనం కొట్టివేయడంతో ఈ అంశంపై న్యాయపరమైన తుది ముగింపు లభించినట్లయింది.

రివ్యూకు సుప్రీంకోర్టు నిరాకరణ

రివ్యూ పిటిషన్ విచారణ సందర్భంలో సుప్రీంకోర్టు స్పష్టమైన న్యాయ సూత్రాలను వెల్లడించింది. మత మార్పిడి ద్వారా ఇతర మతాలను స్వీకరించినప్పుడు, ఆయా మతాల్లో కుల వ్యవస్థ లేదా అస్పృశ్యత వంటి సామాజిక వివక్షలు ఉండవనే ప్రాతిపదికన రాజ్యాంగం ఎస్సీ వర్గాలకు ప్రత్యేక రక్షణలు కల్పించిందని వ్యాఖ్యానించింది. అందువల్ల, ఒక వ్యక్తి క్రైస్తవ లేదా ఇతర మతంలోకి మారిన మరుక్షణమే ఆ వ్యక్తి రాజ్యాంగబద్ధమైన ఎస్సీ హోదాను కోల్పోతారని, ఎలాంటి సాకులు చెప్పి రిజర్వేషన్ ప్రయోజనాలను కొనసాగించడం సాధ్యపడదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.

అధికారికంగా ఘర్ వాపసీ జరిగినప్పుడు మళ్లీ ఎస్సీ హోదా 

అదే సమయంలో, 'ఘర్ వాపసీ' లేదా పునరాగమనం అంశంపై కూడా అత్యున్నత న్యాయస్థానం కీలక స్పష్టతనిచ్చింది. ఇతర మతాల్లోకి మారిన వ్యక్తులు తిరిగి తమ మూల మతాలైన హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతంలోకి అధికారికంగా పునరాగమనం  చేసినప్పుడు మాత్రమే.. ఆయా సామాజిక వర్గాల ఆమోదం మేరకు వారి ఎస్సీ హోదా పునరుద్ధరించబడుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. కేవలం పేర్లను మార్చుకోవడం లేదా కాగితాల మీద ఆధారాలను చూపించడం వల్ల ఎస్సీ సర్టిఫికేట్లు చెల్లుబాటు కాబోవని హెచ్చరించింది.

సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించడం ద్వారా వెలువడిన ఈ తుది తీర్పు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ, సామాజిక చర్చకు దారితీసింది. మత మార్పిడిలు పొంది కూడా దొంగ సర్టిఫికేట్లతో ఎస్సీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో.. ఈ తీర్పు ద్వారా అక్రమంగా ప్రయోజనాలు పొందుతున్న వారికి చెక్ పడుతుందని భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో నిజమైన ఎస్సీ వర్గాలకు దక్కాల్సిన ఫలాలు దక్కుతాయని, నకిలీ సర్టిఫికేట్ల ఏరివేతకు ఇది ఒక గీటురాయిగా మారుతుందని సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: లైంగిక వేధింపుల కేసు.. మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టులో ఊరట
లైంగిక వేధింపుల కేసు.. మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టులో ఊరట
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
AP CM Chandrababu: గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించారు: చంద్రబాబు ధ్వజం
గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించారు: చంద్రబాబు ధ్వజం
Historic Test Victory: సుతార్ 10 వికెట్ల మాయాజాలంతో లంక చిత్తు.. 165 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం, 600వ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ!
సుతార్ 10 వికెట్ల మాయాజాలంతో లంక చిత్తు.. 165 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం, 600వ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ!
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget