(Source: ECI/ABP News/ABP Majha)
Vandhe Bharath: వందేభారత్ రైల్వే ప్రయాణికులకు వడ్డించిన పెరుగులో ఫంగస్, తీవ్రంగా మండిపడుతున్న ప్రయాణికులు
Vandhe Bharath Train: వందేభారత్ రైలు ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. ఐఆర్ సీటీసీ అందించిన భోజనంలోని పెరుగులో ఫంగస్ ఉండటంతో మండిపడిన ప్రయాణికులు ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేశాడు.
Vandhe Bharath Train: ఆవిరియంత్రం నుంచి హైస్పీడు రైలు వరకు రైల్వేవ్యవస్థ రూపాంతరం చెందినా...రైల్వేశాఖ(Indian Railway) అందజేసే భోజనం మాత్రం ఇంకా అక్కడే నిలిచిపోయింది. ఐఆర్ సీటీసీ(IRCTC) అందజేసే భోజనం అంటేనే చాలు ప్రయాణికులు బెంబేలెత్తిపోతారు. వారి అంచనాలను ఏమాత్రం నిరాశపరచకుండా రైల్వేశాఖ సైతం ఎప్పుటికప్పుడు తన మార్కును రుజువును చేస్తూ ఉంటుంది. తాజాగా వందే భారత్(Vandhe Bharath) రైలులో అందజేసిన పెరుగులో ఫంగస్ చూసి ప్రయాణికుడు అవాక్కయ్యాడు
ఇదేనా విమానస్థాయి సర్వీసులు
వందేభారత్(Vandhe Bharath) రైలు..భారతీయ రైల్వేవ్యవస్థలో సమూల మార్పులకు చిహ్నం. తుప్పుపట్టిన, కంపుకొట్టే సాధార రైల్వే బోగీల నుంచి ప్రయాణికులకు విమానస్థాయి సర్వీసులు అందజేయడమేగాక, వేగంగా గమ్యస్థానాలకు అందజేసేందుకు మోదీ(Modi)) ప్రభుత్వం తీసుకొచ్చిన అతిపెద్ద మార్పు. ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగానే ఈ రైళ్లకు సైతం పెద్దఎత్తున ఆదరణ లభిస్తోంది. సౌకర్యవంతమైన సిట్టింగ్, ఏసీ సౌకర్యంతోపాటు బయటి వ్యక్తులు ఎవరూ లోపలకి వచ్చే అవకాశం లేకపోవడంతో భద్రతాపరంగా ఈ రైళ్లు ఎంతో పేరు తెచ్చుకున్నాయి. కానీ ఈరైళ్లలో అందించే భోజనమే సరిగా ఇవ్వడం లేదన్న ఫిర్యాదులతో ఈ సర్వీసుకు చెడ్డపేరు తీసుకొస్తోంది రైల్వేశాఖ. ఐఆర్ సీటీ సర్వసు ద్వారా అందించే భోజనం ఏవిధంగా ఉంటుందో మనం అపరిచితుడు సినిమాలో చూశాం కదా...ఉడికీ ఉడకని అన్నం, నీళ్లచారుతో ప్రజలను ఎంతలా మోసం చేస్తారో....సరిగ్గా రైల్వేశాఖ అందించే భోజనం కూడా అలాగే ఉంటుంది. అందుకే చాలామంది ఇంటి భోజనం తీసుకెళ్తుంటారు. కుదరనివాళ్లు అదే ఎలాగో మేనేజ్ చేస్తూ తినేస్తారు. కానీ వందేభారత్ రైలు ప్రయాణికుడికి ఒకరికి కనీసం అలా తినడానికి కూడా వీల్లేనంత చెత్త భోజనం అందిచారు. దీనిపై సమాజిక మాధ్యమాల్లో విపరీతంగా రైల్వేశాఖ అబాసు పాలైంది.
పెరుగులో ఫంగస్
దెహ్రాదూన్ నుంచి ఢిల్లీకి వందేభారత్ రైలులో ప్రయాణిస్తున్న హర్షద్ కు రైల్వేసిబ్బంది అందజేసిన భోజనంలోని పెరుగు(Curd)లో ఫంగస్ వచ్చింది. పాడైపోయిన పెరుగు ఫొటోలను తన ఎక్స్(X) వేదికగా షేర్ చేస్తూ..వందే భారత్ నుంచి ఇలాంటి నాసిరకం సేవలను ఆశించడం లేదని రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. ఉత్తర రైల్వే, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్(Aswani Vaishnav) అధికార ఖాతాలకు ట్యాగ్ చేశాడు. వైరల్‌గా మారిన ఈ పోస్టుపై భారత రైల్వే స్పందించింది. అతని ప్రయాణ వివరాలను తెలియజేయాలని.. వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తామని బదులిచ్చింది. మరోవైపు ఉత్తర రైల్వే కూడా ఈ పోస్టుపై స్పందించిస్తూ.. ప్రయాణికుడికి కలిగిన అసౌకర్యాన్ని పరిశీలించాల్సిందిగా ఇండియన్స్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు ట్యాగ్ చేసింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. గత నెల దిల్లీ నుంచి వారణాసికి వెళ్తున్న ఓ ప్రయాణికుడికి నాసిరకమైన భోజనాన్ని అందించారు. భోజనం సరిగా లేనందుకు తాను చెల్లించిన మొత్తాన్ని రిఫండ్ చెల్లించాలని రైల్వే శాఖను కోరాడు. అంతకుముందు మరో ప్రయాణికుడి భోజనంలో బొద్దింక రావడంతో చర్చనీయాంశంగా మారింది. ఎన్నిసార్లు ప్రయాణికులు ఫిర్యాదు చేసినా...అప్పటికప్పుడు సాధారణ విచారణ జరిపించడం..ఆ తర్వాత ఈ విషయం మర్చిపోవడం రైల్వేశాఖకు రివాజుగా మారింది. వీటికి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు.