By: Ram Manohar | Updated at : 05 Mar 2023 11:12 AM (IST)
కాఫ్ సిరప్ కేసులో చిన్నారుల మృతికి కారణమైన కంపెనీ లైసెన్స్ రద్దు చేయాలని కేంద్రం ఆదేశించింది. (Image Credits: GettyImages)
Cough Syrup Case:
లైసెన్స్ రద్దు..
నోయిడాకు చెందిన Marion Biotech కంపెనీ లైసెన్స్‌ను రద్దు చేయాలంటూ కేంద్రం యూపీ డ్రగ్ కంట్రోలింగ్ అండ్ లైసెన్స్ అథారిటీకీ ఆదేశాలు జారీ చేసింది. ఈ కంపెనీ తయారు చేసిన కాఫ్ సిరప్ వల్ల ఉజ్బెకిస్థాన్‌లో 18 మంది చిన్నారులు మృతి చెందారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఇప్పటికే కేంద్రం చాలా సీరియస్‌గా ఉంది. WHO ఈ ఆరోపణలు చేసిన వెంటనే అప్రమత్తమై విచారణ మొదలు పెట్టింది. ఆ తరవాత ఆ సంస్థకు చెందిన తయారీ ల్యాబ్‌లను మూసేసింది. ఆ శాంపిల్స్‌ను సేకరించింది. మొత్తం 36 డ్రగ్ శాంపిల్స్‌ను టెస్ట్ చేసిన అధికారులు అందులో 22 శాంపిల్స్‌లో టాక్సిన్స్ ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటికే పోలీసులు ఈ సంస్థకు చెందిన ముగ్గురు అధికారులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు డైరెక్టర్లు పరారీలో ఉన్నారు. అయితే మరో ఇండియన్ కంపెనీ Maiden Pharmaceuticals తయారు చేసిన సిరప్‌ల కారణంగా ఈ మరణాలు సంభవించాయన్న వాదన కూడా ఉంది. ఇదే విషయాన్ని WHO వెల్లడించింది. ఈ సిరప్ శాంపిల్స్‌ని టెస్ట్ చేయగా వాటిలో ప్రమాదకరమైన ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నట్టు గుర్తించింది. ఉజ్బెకిస్థాన్‌తో పాటు కిర్జిస్థాన్, కంబోడియాకు కూడా ఇవే సిరప్‌లను ఎగుమతి చేస్తున్నట్టు తేలింది. ఈ కేసు విచారణలో ఉన్న ఓ అధికారి మాత్రం ఈ సిరప్‌ను చాలా దేశాలకు ఎగుమతి చేసినట్టు చెబుతున్నారు.
"మేరియన్ కంపెనీ తయారు చేసిన డ్రగ్స్‌ను చాలా దేశాలకు ఎగుమతి చేశారు. అక్కడి పిల్లలకు ఏమీ కాకూడదని ప్రార్థిస్తున్నాను. ఆరోగ్య శాఖ హెల్త్ అలెర్ట్ ప్రకటిస్తే మంచిది. ఈ నిర్ణయం తీసుకోవడమే మంచిది. ఇలా అలెర్ట్ చేయడం వల్ల ఆయా దేశాల్లోని ప్రజలు ఆ సిరప్‌ను వాడకుండా ఉంటారు."
-అధికారి
WHO చెప్పిన లెక్కల ప్రకారం..గాంబియా, ఇండోనేషియా, ఉజ్బెకిస్థాన్‌లో ఐదేళ్ల లోపు చిన్నారులు 300 మంది వరకూ మృతి చెందారు. ఈ నకిలీ మందుల కారణంగా కిడ్నీలపై ప్రభావం పడిందని తేల్చి చెప్పింది. ఇప్పటికే యూపీ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDSA) విభాగం ఆ కంపెనీ మ్యానుఫాక్చరింగ్ లైసెన్స్‌ను రద్దు చేసింది. డ్రగ్ రికార్డ్‌లు సరిగా మెయింటేన్ చేయకపోవడంతో పాటు మందు తయారీకి ఏయే పదార్థాలు వినియోగిస్తున్నారన్న వివరాలు సరైన విధంగా అందించలేదు. అందుకే లైసెన్స్ రద్దు చేశారు అధికారులు. ఘజియాబాద్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఈ మేరకు కీలక విషయాలు వెల్లడించారు. ఫేజ్ -3 లోని Marion Biotech Pvt Ltd కంపెనీ ప్రమాణాలకు అనుగుణంగా నడుచుకోవడం లేదని...సంస్థ డైరెక్టర్లు జయ జైన్, సచిన్ జైన్, ఆపరేషన్ హెడ్ తుహిన్ భట్టాచార్యపైనా కేసులు నమోదు చేశామని తెలిపారు. డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టంలోని 17,17A,17-B సెక్షన్ల కింద FIR నమోదు చేసినట్టు వివరించారు. ప్రస్తుతానికి పోలీసులు తుహిన్ భట్టాచార్య, అతుల్ రావత్, మూల్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న కంపెనీ యజమాని కోసం గాలిస్తున్నారు. త్వరలోనే అతడినీ అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
Medical Seats: కొత్తగా పది మెడికల్ పీజీ సీట్లు, కాకతీయ మెడికల్ కాలేజీకి కేటాయింపు!
SSC CHSLE 2022 Key: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి
ISRO Jobs: ఇస్రో-నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో ఖాళీలు, అర్హతలివే!
నెల గడువిస్తే 24 గంటల్లో రాహుల్ గాంధీపై అనర్హత వేటు అన్యాయమే: కేంద్ర మాజీ మంత్రి
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్