అన్వేషించండి

Uttar Pradesh Storm: రాకాసి గాలులంటే ఇవి - మనుషులే ఎగిరిపోయారు - యూపీ దృశ్యాలు చూస్తే షాకే

Hailstorm Deaths: యూపీలోని పలు జిల్లాల్లో ప్రచండమైన ఈదురుగాలులు, వడగళ్ల వర్షం పెను విషాదాన్ని నింపాయి. పదుల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఉత్తరప్రదేశ్‌లో పిడుగులు, వడగళ్ల వానతో 89 మంది మృతి.
  • తుఫాను ధాటికి 114 పశువులు, వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి.
  • క్యుములోనింబస్ మేఘాలు, 80-100 కి.మీ. వేగంతో గాలులే కారణం.
  • ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు, మరికొన్ని చోట్ల వర్షాల హెచ్చరిక.

Rain Havoc In UP:  ఉత్తరప్రదేశ్‌లో ప్రకృతి ఒక్కసారిగా ప్రకోపించింది. ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలకు ఊరటనిస్తుందనుకున్న వర్షం.. రాకాసి గాలులు, వడగళ్ల వానగా మారి మృత్యుపాశం విసిరింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో సంభవించిన పిడుగుపాట్లు, గోడలు కూలడం , చెట్లు విరిగి పడటం వంటి ఘటనల్లో ఇప్పటివరకు 89 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 53 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అకాల వర్షం సృష్టించిన ఈ బీభత్సం పచ్చని పొలాలను, నిరుపేదల గూడును చిన్నాభిన్నం చేసింది.

ఈ విపత్తు కేవలం మనుషులకే కాకుండా మూగజీవాలకు కూడా ప్రాణసంకటంగా మారింది.    సుమారు 114 పశువులు ఈదురుగాలుల ధాటికి మరణించాయి. దాదాపు 87 ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా, వందలాది గృహాలకు పాక్షిక నష్టం వాటిల్లింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో అనేక జిల్లాలు అంధకారంలో మునిగిపోయాయి. ఒక్కరోజులోనే ఇంత భారీ స్థాయిలో నష్టం సంభవించడం రాష్ట్ర యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది.    

ఈ అకాల వర్షాలకు వాతావరణ శాస్త్రవేత్తలు క్యుములోనింబస్ మేఘాలను ప్రధాన కారణంగా చెబుతున్నారు. మండే ఎండల వల్ల ఏర్పడిన వేడి గాలి ,  తేమ కలవడం వల్ల ఈ మేఘాలు వేగంగా విస్తరించి, పిడుగులతో కూడిన భారీ వడగళ్ల వర్షానికి దారితీశాయి. సాధారణంగా వర్షాకాలంలో కనిపించే ఇటువంటి తీవ్రమైన పరిస్థితులు, వేసవిలో ఏర్పడటం వల్లే ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈదురుగాలులు గంటకు 80-100 కిలోమీటర్ల వేగంతో వీయడం విధ్వంసానికి మరో కారణమైంది.  

 
 గాలివాన తగ్గుముఖం పట్టినప్పటికీ, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్  , ఎస్డీఆర్ఎఫ్  బృందాలు క్షేత్రస్థాయిలో శిథిలాలను తొలగిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరింది.  యూపీ మళ్ళీ కోలుకోవడానికి కొంత సమయం పట్టేలా కనిపిస్తోంది.                  

Frequently Asked Questions

ఉత్తరప్రదేశ్‌లో అకాల వర్షాల వల్ల ఎంతమంది మరణించారు?

ఉత్తరప్రదేశ్‌లో సంభవించిన పిడుగుపాట్లు, గోడలు కూలడం, చెట్లు విరిగిపడటం వంటి ఘటనల్లో ఇప్పటివరకు 89 మంది ప్రాణాలు కోల్పోయారు.

వర్షాల వల్ల ఎంతమంది గాయపడ్డారు?

ఈ అకాల వర్షాల వల్ల మరో 53 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

పశువులకు, ఇళ్లకు జరిగిన నష్టం వివరాలు ఏమిటి?

సుమారు 114 పశువులు మరణించాయి, దాదాపు 87 ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా, వందలాది గృహాలకు పాక్షిక నష్టం వాటిల్లింది.

వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం ఈ అకాల వర్షాలకు కారణమేమిటి?

క్యుములోనింబస్ మేఘాలు, మండే ఎండల వల్ల ఏర్పడిన వేడి గాలి, తేమ కలవడం ఈ విధ్వంసానికి కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రభుత్వం సహాయక చర్యల కోసం ఏమి చేస్తోంది?

ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి, శిథిలాలను తొలగిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
ABP Desam Top 10, 20 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 20 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Embed widget