Quad Summit: 6 నెలల తర్వాత మోదీ తొలి విదేశీ పర్యటన.. బైడెన్‌తో భేటీలో ఈ అంశాలపైనే చర్చ!
ఈ నెల 24న ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ కానున్నారు. అఫ్గాన్ సంక్షోభంపై ఇరువురు చర్చించే అవకాశం ఉంది.
అఫ్గానిస్థాన్ సంక్షోభం, చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. వచ్చేవారం మోదీ రెండు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. అధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలో జరగనున్న క్వాడ్ సదస్సులో కూడా మోదీ పాల్గొంటారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రకటించింది.
Prime Minister @narendramodi to visit USA for Quad Leaders’ Summit and High-level Segment of the 76th Session of the United Nations General Assembly.
— Arindam Bagchi (@MEAIndia) September 14, 2021
Press release ➡️ https://t.co/BxCyVxkqHa
వరుస భేటీలు..
భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగా మధ్య సెప్టెంబరు 24న వాషింగ్టన్‌లో క్వాడ్ సదస్సు జరగనుంది.
ఆ తర్వాత సెప్టెంబరు 25న న్యూయార్క్ వేదికగా జరగనున్న ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొని కీలక ప్రసంగం చేయనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
ఆరు నెలల తర్వాత..
కరోనా కల్లోలం నేపథ్యంలో ప్రధాని ఇటీవల ఎలాంటి విదేశీ పర్యటనకు వెళ్లలేదు. దాదాపు ఆరు నెలల తర్వాత మోదీ వెళ్తోన్న తొలి విదేశీ పర్యటన ఇదే. దీనికి ముందు 2021 మార్చిలో బంగ్లాదేశ్‌లో మోదీ పర్యటించారు.
క్వాడ్ సదస్సు..
మోదీ తన పర్యటనలో భాగంగా పాల్గొనబోయే క్వాడ్ సదస్సు కూడా ప్రధానమైంది. కొవిడ్ ప్రధాన అజెండాగా ఈ క్వాడ్ సదస్సు జరగనుంది. క్వాడ్ వ్యాక్సిన్ ఇనిషియేటివ్‌పై సమీక్ష, సముద్ర జలాల భద్రత, వాతావరణ మార్పులు, విద్య, సాంకేతికత సహా పలు అంశాలపై క్వాడ్ నేతలు చర్చించనున్నారు. ఇక అఫ్గానిస్థాన్ ఉద్రిక్త పరిస్థితులు, తాలిబన్ల పాలనతో ఎదురయ్యే సవాళ్లను చర్చించే అవకాశాలున్నాయి.
Also Read: cooking oil: మీరు వాడే వంటనూనె మంచిదో, కల్తీదో తెలుసా? ఇలా చేస్తే ఇట్టే తెలిసిపోతోంది...
బైడెన్‌తో భేటీలో..
బైడెన్ అమెరికా అధ్యకుడిగా గెలిచిన తర్వాత మోదీ తొలిసారి అమెరికా వెళ్తున్నారు. చైనాతో ఉద్రిక్తత పరిస్థితులు సహా అఫ్గాన్ లో ప్రస్తుత పరిణామాలపై ఇరువురు చర్చించే అవకాశం ఉంది.
Also Read: Terrorists Arrested: ఉగ్రమూకల కుట్ర భగ్నం .. దిల్లీలో ఆరుగురు ముష్కరులు అరెస్ట్