అన్వేషించండి

US Midterm Polls: బైడెన్ మాకు నచ్చటం లేదు, మరోసారి అధ్యక్షుడు అవడానికి వీల్లేదు - ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలన నిజాలు

US Midterm Polls: అమెరికాలో మధ్యంతర ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ సంచలన విషయాలు వెల్లడించాయి.

US Midterm Polls:

మధ్యంతర ఎన్నికలు..

అమెరికాలో మధ్యంతర ఎన్నికల పోలింగ్ ముగిసింది. వీటి ఫలితాలపైనే ఉత్కంఠ పెరుగుతోంది. వచ్చే అధ్యక్ష ఎన్నికల ఫలితాలపైనా ప్రభావం చూపించగలిగే ఈ మధ్యంతర ఎన్నికల్లో ఓటర్ల నాడి ఎలా ఉందో తెలుసుకునేందుకు అక్కడి పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. ప్రస్తుతం ఆ దేశాన్ని ద్రవ్యోల్బణం వెంటాడుతోంది. కరోనా తరవాత అమెరికా స్థితిగతులు కాస్త గాడి తప్పాయి. వీటితో పాటు తుపాకుల దాడులు, నేరాల పెరుగుదల, అక్రమ వలసలు లాంటి సమస్యలూ ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి. వీటిపైనే ఆచితూచి ఆలోచించాకే..ఓటర్లు తమ అభిప్రాయాలను ఓటు రూపంలో తెలియజేసి ఉంటారని అంతా భావిస్తున్నారు. ఇదే సమయంలో కొన్ని ఎగ్జిట్ పోల్స్ కొన్ని షాకింగ్ నిజాలు వెల్లడించారు. అమెరికన్లు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ పాలనలో సంతృప్తిగా లేరని అందులో తేలింది. మరోసారి ఆయనకే అధ్యక్ష పదవి దక్కాలన్న ఆలోచనలో ఎవరూ లేరని తెలుస్తోంది. Edison Research వెల్లడించిన వివరాల ప్రకారం...అబార్షన్‌ విషయంలో అమెరికా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రతి 10 మంది ఓటర్లలో ఆరుగురు అసంతృప్తిగానో, ఆగ్రహంగానో ఉన్నారు. అబార్షన్‌ అనేది చట్టబద్ధంగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి 10 మంది ఓటర్లలో ముగ్గురు "ద్రవ్యోల్బణం, అబార్షన్‌పై తీర్పు" అంశాలే తమను ఇబ్బంది పెడుతున్నాయని చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా జరుగుతున్ననేరాలపైనా కొందరు అసంతృప్తిగా ఉన్నారు. 

అసంతృప్తి..

ప్రతి 10 మందిలో ఒక్కరు నేరాలు, గన్ పాలసీ, అక్రమ వలసలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక Edison Exit Pollలో మరికొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి 10 మంది పౌరుల్లో ఏడుగురు ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని భావిస్తున్నారు. రెండోసారి బైడెన్ అధ్యక్షుడు అవడం తమకు ఇష్టం లేదని ప్రతి 10 మందిలో ఏడుగురు కుండ బద్దలు కొట్టేస్తున్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్‌ని బట్టి చూస్తే..అధ్యక్షుడు బైడెన్‌పై వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని స్పష్టమవుతోంది. అమెరికాలో మధ్యంతర ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో గెలిస్తేనే...రానున్న అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు సాధ్యపడుతుందని నమ్ముతారంతా. ఇప్పుడు ఈ ఎన్నికల్లోనే బైడెన్‌పై వ్యతిరేకత కనిపించటం సంచలనం కలిగిస్తోంది. 

పోటీ చేస్తానంటున్న ట్రంప్..

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు అవే సంకేతాలిస్తున్నాయి. 2024లో జరిగే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని స్పష్టం చేశారు ట్రంప్. ఓ మీటింగ్‌కు హాజరైన ఆయన..."తరవాతి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా" అన్న ప్రశ్నకు "తప్పకుండా చేస్తాను" అని సమాధానిచ్చినట్టు BBC రిపోర్ట్ చేసింది. మిడ్‌టర్మ్ ఎన్నికల్లో భాగంగా రిపబ్లికన్ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్న ఆయన ఓ ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అయితే..ఈలోగా మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఎలక్షన్‌లో ప్రస్తుత ప్రభుత్వంపై అక్కడి ప్రజల అభిప్రాయమేంటే కచ్చితంగా తెలుస్తుంది. ఇందులోని ఫలితాలు...అధ్యక్ష ఎన్నికలనూ ప్రభావితం చేస్తాయి. పూర్తిగా అక్కడి రాజకీయాలు మారిపోయే అవకాశమూ ఉంది. 

Also Read: COP27 Event: రిషి చర్యలు ఊహాతీతం- బ్రిటన్ ప్రధాని అంత హడావిడిగా ఎక్కడికి వెళ్లినట్లు?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Devara Japan Release Date: జపాన్‌లో 'దేవర' తాండవానికి అంతా రెడీ... ఎన్టీఆర్ సినిమా జపాన్ రిలీజ్ డేట్ ఇదే
జపాన్‌లో 'దేవర' తాండవానికి అంతా రెడీ... ఎన్టీఆర్ సినిమా జపాన్ రిలీజ్ డేట్ ఇదే
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Devara Japan Release Date: జపాన్‌లో 'దేవర' తాండవానికి అంతా రెడీ... ఎన్టీఆర్ సినిమా జపాన్ రిలీజ్ డేట్ ఇదే
జపాన్‌లో 'దేవర' తాండవానికి అంతా రెడీ... ఎన్టీఆర్ సినిమా జపాన్ రిలీజ్ డేట్ ఇదే
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
Venkatesh: వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
AP Weather Updates: ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Embed widget