Viral Video: స్టూడెంట్‌తో మర్దన చేయించుకున్న టీచర్, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Viral Video: యూపీలో ఓ మహిళా ఉపాధ్యాయురాలు, స్టూడెంట్‌తో చేతులు మర్దన చేయించుకోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Viral Video:
కఠిన చర్యలు తీసుకుంటాం: అధికారులు
యూపీలోని హర్దోయ్‌లో ఓ టీచర్ చేసిన పని నెటిజన్లను ఆగ్రహానికి గురి చేస్తోంది. ఇప్పటికే ఆమె ఉద్యోగం ఊడిపోగా, ఆమెపై కామెంట్లు మాత్రం ఇంకా వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఆమె చేసిన తప్పేంటంటే...ఓ స్టూడెంట్‌తో చేతులకు మసాజ్ చేయించుకోవటం. ఓ ప్రైమరీ స్కూల్‌లో వారం క్రితం జరిగిన ఈ సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. టీచర్ హాయిగా కుర్చీలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటుంటే, ఓ విద్యార్థి వచ్చి ఆమె చేతులకు మర్దన చేశాడు. ఇది జరుగుతున్న సమయంలో క్లాస్‌లో ఒకరు టీచర్‌కు తెలియకుండా వీడియో తీశారు. ఇది సోషల్ మీడియాలో షేర్ చేశాక, వైరల్ అయిపోయింది. ఎడమ చేతిని స్టూడెంట్ మసాజ్ చేస్తుండగా, కుడి చేతితో వాటర్ తాగుతూ ఆరామ్‌గా కూర్చుంది ఆ టీచర్. క్లాస్‌లోని మిగతా పిల్లలు అల్లరి చేస్తుంటే, వారిని వారించింది కూడా. ఈ వీడియో వైరల్ అయ్యాక అధికారులు ఎంక్వైరీ చేశారు. ఆమె పేరు ఊర్మిళా సింగ్‌గా నిర్ధరించారు. బవాన్ బ్లాక్‌లోని పొఖరి ప్రైమరీ స్కూల్‌లో అసిస్టెంట్ టీచర్‌గా పని చేస్తున్నారు. బేసిక్ శిక్ష అధికారి(BSA)వీపీ సింగ్ ఈ వీడియో చూసి తీవ్రంగా స్పందించారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌కు ఆదేశాలు జారీ చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు. అధికారులు రిపోర్ట్ ఇచ్చిన తరవాత, అవసరమైన చర్యలు తీసుకుంటానని వీపీ సింగ్ స్పష్టం చేశారు.
School teacher is sitting comfortably and pressing her hands with the children of the class in Uttarpradesh Hardoi
— Nandini Idnani 🇮🇳🚩 (@nandiniidnani69) July 28, 2022
Action initiated by concern authorities
Bringing shame to such noble profession 🙆#Hardoi pic.twitter.com/yRRSUCs6lH
School teacher is sitting comfortably and pressing her hands with the children of the class in Uttarpradesh Hardoi
— Nandini Idnani 🇮🇳🚩 (@nandiniidnani69) July 28, 2022
Action initiated by concern authorities
Bringing shame to such noble profession 🙆#Hardoi pic.twitter.com/yRRSUCs6lH
This lady teacher caught. What about numerous others who allegedly ask small kids to run their errands? Would it help if we have (functional) CCTVs?
— Jaspreet Singh (@jsprt20) July 28, 2022
ఇదే కాదు. ఈ మధ్యే మరో ఇలాంటి వీడియోనే ఒకటి వైరల్ అయింది. మధురలో ఓ స్కూల్‌లో వరద నీరు రాగా, స్టూడెంట్స్‌తో ప్లాస్టిక్ కుర్చీలు వేయించుకుని వాటిపై నడుచుకుంటూ వచ్చారు ఓ టీచర్. నీరు లేని చోటకు వెళ్లేందుకు కుర్చీలను ఆసరాగా చేసుకున్నారామె. కానీ... అందు కోసం పిల్లలతో కుర్చీలు వేయించటంపైనే విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యాక, వెంటనే ఆ టీచర్‌ను సస్పెండ్ చేశారు.
Also Read: KA Paul Kakinada : కేఏ పాల్ కార్లతో అనుచరుడు జంప్ - చివరికి ఏమయిందంటే ?