KA Paul Kakinada : కేఏ పాల్ కార్లతో అనుచరుడు జంప్ - చివరికి ఏమయిందంటే ?
ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్‌కు కాకినాడలో ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఆయన రెండు కార్లను తీసుకుని అనుచరుడు అదృశ్యమైపోయాడు. చివరికి...
KA Paul Kakinada : కాకినాడ పర్యటనలో ఉన్న ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ కు సొంత అనుచరుడే జలక్ ఇచ్చాడు. బుధవారం పర్యటన ముగిసిన తర్వాత తన సంస్థ కార్యాలయం దగ్గర పార్కింగ్ చేస్తానని రెండు కార్లను తీసుకెళ్లిన అనుచరుడు కనిపించకుండా పోయాడు. కొత్తగా కొన్న ఐదు కార్ల కాన్వాయ్ తో కేఏ పాల్ కాకినాడకు వచ్చారు. రాత్రి ఓ హెూటల్లో బస చేశారు. అయితే ఆ సమయంలో సీబీఎం సంస్థల డైరెక్టర్ గా ఉన్న ముత్తాబత్తుల రత్నకుమార్ సీబీఎం కాంపౌండ్లో కార్లు పెడతావని చెప్పి కాన్వాయ్ లోని రెండు కార్లును అక్కడకు తీసుకెళ్లారు. ఉదయం తిరిగి కార్లు తెచ్చుకునేందుకు కేఏ పాల్ సిబ్బంది సీబీఎం కాంపౌండ్ వద్దకు వెళ్లారు.
కేంద్రం కంటే మెరుగ్గా ఏపీ ఆర్థిక పరిస్థితి - లెక్కలు రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు !
అయితే సీబీఎం కాంపౌండ్ మెయిన్ గేట్ కు తాళాలు వేసి ఉన్నాయి. సంస్థ సిబ్బంది లోపలోకి పంపించలేదు. ముత్తాబత్తుల రత్నకుమార్ చెబితేకానీ లోనికి వెళ్లనీయమని అప్పటి వరకు కార్లు ఇచ్చేది లేదని సెక్యూరిటీ సిబ్బంది తేల్చి చెప్పారు. దీంతో అటు కేఏ పాల్ సిబ్బంది, ఇటు రత్నకుమార్ సిబ్బంది మద్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. చివరికి పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. కేఏ పాల్ కు, సీబీఎం డైరెక్టర్ ముత్తాబత్తుల రత్నకుమార్ కు మధ్య ఆర్దీక పరమైన లావాదేవీల కారణంగానే ఈపరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు.
క్యాసినో మాధవ రెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్ నాదే, స్పందించిన మంత్రి మల్లారెడ్డి - కానీ కీలక ట్విస్ట్
రత్నకుమార్ కు కొంతమేర కేఏ పాల్ డబ్బు ఇవ్వాల్సి ఉందని, ఈనేపథ్యంలోనే డబ్బులు ఎప్పుడు అడిగినా ఇవ్వకపోవడంతో రాత్రి కేఏ పాల్ కు చెందిన రెండు వాహనాలను సీబీఎం కాంపౌండ్లో పెడతానని రత్నకుమార్ తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. తిరిగి ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే రత్నకుమార్ అందుబాటులో లేకుండా పోయినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అనూహ్యంగా కొందరు జనసేన కార్యకర్తలు కేఏ పాల్ కు బాసటగా నిలిచి ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. మొత్తం మీద పోలీసుల జోక్యంతో కేఏ పాల్ వాహనాలను తిరిగి అప్పగించడంతో కేఏ పాల్ వేరే ప్రాంతానికి బయలుదేరారు.
ప్రజాశాంతి పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్త పర్యటనలో ఉన్న కేఏ పాల్ ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించి అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కాకినాడకు వచ్చిన ఆయన ఉదయం అనుచరులతో కలిసి రోడ్డు మీద దుకాణంలో టీ తాగి కాసేపు హడావుడి చేశారు.